
ప్రఖ్యాత నిర్మాత, విజయా సంస్థల అధినేత దివంగత బి.నాగిరెడ్డి మనవడు శరత్ రెడ్డి (52) శుక్రవారం ఉదయం చెన్నైలో కరోనా వైరస్‌తో కన్నుమూశారు. నాగిరెడ్డికి ఇద్దరు కొడుకుల్లో ఒకరు విశ్వనాథరెడ్డి. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారిలో రెండో కొడుకు శరత్ రెడ్డికి కరోనా వైరస్ సోకడంతో ఇటీవల చెన్నైలోని విజయా హెల్త్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ‘చందమామ, విజయ, బొమ్మరిల్లు’ వంటి పత్రికల నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు శరత్ రెడ్డి. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. తను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. శరత్‌రెడ్డి మరణంతో బి.నాగిరెడ్డి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment