sarath reddy
-
కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి
ప్రఖ్యాత నిర్మాత, విజయా సంస్థల అధినేత దివంగత బి.నాగిరెడ్డి మనవడు శరత్ రెడ్డి (52) శుక్రవారం ఉదయం చెన్నైలో కరోనా వైరస్‌తో కన్నుమూశారు. నాగిరెడ్డికి ఇద్దరు కొడుకుల్లో ఒకరు విశ్వనాథరెడ్డి. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారిలో రెండో కొడుకు శరత్ రెడ్డికి కరోనా వైరస్ సోకడంతో ఇటీవల చెన్నైలోని విజయా హెల్త్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ‘చందమామ, విజయ, బొమ్మరిల్లు’ వంటి పత్రికల నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు శరత్ రెడ్డి. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. తను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. శరత్‌రెడ్డి మరణంతో బి.నాగిరెడ్డి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్
పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన శరత్ రెడ్డి అనే రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. తనకున్న 70 సెంట్ల భూములను రిజిస్టర్ చేయించుకునేందుకు శరత్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా..సబ్‌రిజిస్ట్రార్ రిజిస్టర్ చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సబ్‌రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.