Hollywood actor
-
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది: హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్
‘‘నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్‌లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఇండియాలో గడిపిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ‘ఎల్2ఈ ఎంపురాన్’(L2E Empuraan) సినిమాలో నటించడంతో మళ్లీ నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది’’ అని ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ (Jerome Flynn)(‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్’ ఫేమ్) తెలిపారు.మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘లూసిఫర్’ (2019)కి సీక్వెల్‌గా ‘ఎల్2ఈ ఎంపురాన్’ మూవీ రూపొందింది. సీక్వెల్లోనూ మోహన్‌లాల్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జెరోమ్ ఫ్లిన్ చేసిన బోరిస్ ఆలివర్‌పాత్రని రివీల్ చేశారు. జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ– ‘‘ఖురేషి (మోహన్‌లాల్‌పాత్ర పేరు) ప్రయాణంలో బోరిస్ ఆలివర్ది ఒక ముఖ్యమైనపాత్ర. ఈ క్యారెక్టర్ని ప్రేక్షకులు ఇష్టపడతారు’’ అని పేర్కొన్నారు. మార్చి 27న మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు. -
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న హాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?
లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'నిన్ను వదలను'. యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అశోక్ కుల్లర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో రష్యాకు చెందిన లియుబా పామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సింగర్‌గా రాణించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు నిర్మాతగా.. లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్‌కు రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నిన్ను వదలను అంటూ హారర్ థ్రిల్లర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కాగా.. వాక్టర్ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్'లో అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'వెస్ట్‌వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే', క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్‌లలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా పనిచేశాడు. 2016లో వచ్చిన చిత్రం 'యూఎస్ఎస్ ఇండియానాపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మారియో వాన్ పీబుల్స్ దర్శకత్వం వహించాడు. -
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు రోజర్ విలియం కోర్మన్ (98) కన్నుమూశారు. 1926 ఏప్రిల్ 5న డెట్రాయిట్లో జన్మించారు రోజర్ కోర్మన్ . కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఈ నెల 9న ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో కాస్త ఆలస్యంగా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. 1950లో స్టోరీ రీడర్‌గా ఆయన సినీ కెరీర్ మొదలైంది. కెరీర్ మొదట్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత రోజర్ కోర్మన్ తొలిసారిగా ‘మాన్ స్టర్ ఫ్రమ్ ది ఓషియన్ ఫ్లోర్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ నిర్మించగా మంచి విజయం సాధించింది. రోజర్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 350కిపైగా సినిమాలను నిర్మించారు. అలాగే 20కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 30 సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ చేశారు. రోజర్ కెరీర్లో ‘ఫైవ్ గన్స్ వెస్ట్’, ‘డే ది వరల్డ్ ఎండెడ్’, ‘ది అన్ డెడ్’, ‘టార్గెట్స్’, ‘వార్ ఆఫ్ ది శాటిలైట్స్’, ‘ఎక్స్: ద మ్యాన్ విత్ ది ఎక్స్ రే ఐస్’, ‘డెత్ రేస్’ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి. హాలీవుడ్ పరిశ్రమ రోజర్‌ను ‘΄ోప్ ఆఫ్ ΄ాప్ సినిమా’, ‘ది కింగ్ ఆఫ్ కల్ట్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంది. రోజర్‌కు భార్య జూలీ కోర్మన్, కుమార్తెలు కేథరీన్, మేరీ ఉన్నారు. ఆయన మృతిపట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఇండస్ట్రీలో విషాదం.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రంలో కెవాన్ లన్నిస్టర్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బెన్ డేనియల్స్ ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.ఇయాన్ గెల్డర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పాటు సర్జ్, క్వీర్స్, షేక్స్పియర్ గ్లోబ్, హిజ్ డార్క్ మెటీరియల్స్. అండర్డాగ్ లాంటి చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కాగా.. ఇటీవలే టైటానిక్ నటుడు సైతం మరణించిన సంగతి తెలిసిందే. -
విషాదం.. ఆస్కార్ విజేత లూయిస్ గోసెట్ కన్నుమూత
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. అమెరికన్ ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లూయిస్ గోసెట్ జూనియర్ (87) కాలిఫోర్నియాలో కన్నుమూశారు. లూయిస్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇక 1936లో లూయిస్ గోసెట్ సీనియర్, హెలెన్ రెబక్కా దంపతులకు మే 27న న్యూయార్క్‌లో జన్మించారు లూయిస్ గోసెట్ జూనియర్. చిన్నతనంలోనే లూయిస్‌కు నటన పట్ల ఆసక్తి ఉండేది. అలా 17ఏళ్ల వయసులోనే రంగస్థల నటుడిగా మారాడు లూయిస్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ‘ఎ రైసిన్ ఇన్ ది సన్, ది బ్లాక్స్, ది పనిషర్, స్కిన్గేమ్’ వంటి సినిమాల్లో నటించారు. ‘ది బుక్ ఆఫ్ నీగ్రోస్’ వంటి టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించారు లూయిస్. ఇక 1982లో వచ్చిన ‘యాన్ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్‌మేన్’ సినిమాలోని నటనకుగాను 55వ ఆస్కార్ అవార్డ్స్‌లో లూయిస్ ఉత్తమ సహాయనటుడు విభాగంలో అవార్డు అందుకున్నారు. కాగా ఈ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి నటుడు లూయిస్నే అని హాలీవుడ్ సమాచారం. అలాగే ఇదే సినిమాకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. 1977లో వచ్చిన మినీ సిరీస్ ‘రూట్స్’లోని నటన లూయిస్‌కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ఎమ్మీ అవార్డు కూడా అందుకునేలా చేసింది. -
ఐదేళ్లుగా ఆ వ్యాధి.. 'కెప్టెన్ మార్వెల్' నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు చనిపోయాడు. కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కెన్నెత్ మిచెల్(49) ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచాడు. తాజాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఏఎల్ఎస్ (అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇతడు.. ఆ వ్యాధితో పోరాడుతూ చనిపోయాడు. (ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) 2000 నుంచి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తున్న కెన్నెత్ మిచెల్.. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, ఘోస్ట్ విస్పరస్ తదితర చిత్రాల్లో నటించాడు. అలానే పలు వెబ్ సిరీసుల్లో హీరోగా, సహాయ పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ విషయానికొస్తే 2006లో నటి సుసాన్ మే ప్రాట్ని పెళ్లి చేసుకున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్‌కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ (39) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 11న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను ఆయన సన్నిహితులు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు. కాగా డారెన్ కెంట్ ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించారు. 2007లో ఇటాలియా కాంటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఆ మరుసటి ఏడాది మిర్రర్స్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ద లిటిల్ స్ట్రేంజర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. 'Game of Thrones' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ ఇతడికి విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితోపాటు అనేక HBO డ్రామా సిరీస్‌లలోనూ నటించారు. సన్నీబాయ్ సినిమాకు గాను కెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. What a privilege it was to be your friend and to work together on so many projects over the years. Life won’t be the same without you 💔I will miss you so much. RIP darling Darren Kent xxxx pic.twitter.com/Fz81LszZkF — Jane Gull (@GullJane) August 14, 2023 Love and thoughts to the friends and family of our talented, caring soul of a friend, Darren Kent, who sadly passed away on Friday. Darren, an Essex writer, actor and director, directed our award winning short You Know Me. A true character who was Always creating and forever… pic.twitter.com/y3IWbJxi6I — Ben Trebilcook (@BenTrebilcook) August 13, 2023 -
83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే దాదాపు 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు. అది కూడా తనకంటే వయసులో చిన్నదైన 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. జూన్‌లో నూర్ అల్ఫాల్లా బిడ్డకు జన్మనివ్వగా.. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. అల్ పాసినో అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు. ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!) ప్రెగ్నెన్సీ సమయంలో అనుమానాలు? అయితే గతంలో నూర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.. నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు. నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరాడని తెలిసింది. అంతేకాకుండా తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు. అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది. మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి చేసుకోకుండానే ముగ్గురితో సహజీవనం? అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ అనే మహిళతో సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు. వీరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్‌లో కలిసి డిన్నర్ చేస్తుండగా.. మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. కొవిడ్ లాక్ డౌన్లో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా.. అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) + Al and his girlfriend, Noor Alfallah, after dinner in Santa Monica. pic.twitter.com/6kCrePMDuf — Pacino's World 👑 (@worldpacino) August 2, 2023 -
అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఇండియాలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది! ) అయితే భారత్‌లో ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఐమాక్స్‌లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర రూ.2450 పలుకుతోంది. గతంలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 సినిమా టికెట్ ధర బెంగళూరులో గరిష్ఠంగా రూ.1700 మాత్రమే పలికింది. అంతటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అవతార్‌ను సినిమాను మించి టికెట్ ధరలు ఉండడంతో సినీ ప్రియులు ఆశ్చర్య పోతున్నారు. మనదేశంలో సాధారణంగా టిక్కెట్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. తాజాగా ముంబయిలో ఓపెన్ హైమర్ మూవీ టికెట్ ధర రూ.2450 ( ఎలాంటి పన్నులు లేకుండా) ఇప్పటికే అమ్ముడయ్యాయి. ముంబయిలోని పీవీఆర్ ఐకాన్, ఫీనిక్స్ పల్లాడియంలో సాయంత్రం ఏడు, రాత్రి పది గంటల షో కోసం సినిమా రిలీజ్ రోజున టిక్కెట్స్ బుక్ కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ భారీ టికెట్ ధరలు చూస్తే ఓపెన్ హైమర్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. గతవారంలో టామ్ క్రూజ్ మూవీ మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ఇండియాలో మొదటి రోజు రూ.12.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా సిలియన్ మర్ఫీ నటించిన ఓపెన్‌హైమర్ ఆ చిత్రాన్ని అధిగమిస్తోందేమో వేచి చూడాల్సిందే. అసలేంటీ ఓపెన్‌హైమర్? ఒపెన్‌హైమర్ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన మొదటి అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త. కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన రాబర్ట్ జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్ ఆధారంగా రూపొందించారు. కాగా.. ఇప్పటికే హాలీవుడ్ సమ్మె ప్రభావం ఈ చిత్రంపై ఉండదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!) -
సినీ కార్మికుల సమ్మె.. రిలీజ్‌కు సిద్ధమైన భారీ బడ్జెట్ మూవీ!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!) మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించగా.. ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. ప్రభావం ఉండదన్న మేకర్స్ ఇప్పటికే ఏఐ వల్ల వచ్చే ముప్పుపై సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఇప్పటికే హాలీవుడ్లో అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం ఉండదని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. ఆందోళనల నడుమ ఓపెన్ హైమర్ రిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! ) -
వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్!
4 వేల అడుగుల ఎత్తున్న ఒక పర్వతం.. అక్కడ ఫుట్‌పాత్ సైజులో ఉన్న స్టీల్ ర్యాంప్.. దానిపై ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకెళ్తున్నాడు.. అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.. అంతే.. ఒక్కసారిగా పర్వతం మీద నుంచి జంప్ చేసేశాడు.. అందరి గుండెలు దడదడలాడుతున్నాయి.. మృత్యువుకు అతనికి మధ్య ఉన్నది ఒక్క పారాచూట్ మాత్రమే.. దాన్ని సమయానికి తెరవకుంటే.. అతడి శవం ఆనవాలు కూడా దొరకదు.. పారాచూట్ తెరుచుకుంది. అతడు క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టంట్‌గా పేరొందిన ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆ వ్యక్తి.. టామ్ క్రూజ్.. హాలీవుడ్ డాషింగ్ హీరో.. వయసు జస్ట్ 61 ఏళ్లు!!! మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లోని తాజా చిత్రం డెడ్ రెకనింగ్ పార్ట్ 1 కోసం ఈ సాహసాన్ని చేశారు. సినిమాలో కేవలం 60 సెకన్లు ఉండే ఈ సన్నివేశం కోసం రిహార్సల్స్ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయని ఈ చిత్ర స్టంట్ కోఆర్డినేటర్ ఈస్ట్‌వుడ్ చెప్పారు. శిక్షణలో భాగంగా మన హీరో 13 వేల మోటార్ క్రాస్ జంప్స్, 500 స్కైడైవ్స్ చేశారట. ‘200 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్లి.. పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. అదే సమయంలో గాలిలో కరెక్టు టైంకి బైక్‌ను వదిలేయాలి.. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్‌ను తెరవాలి. సరిగా బాలెన్స్ చేసుకుంటూ నేలపై దిగాలి. ఇందులో ఏ ఒక్క విషయంలో చిన్నపాటి తేడా జరిగినా ఇక అంతే.. టామ్‌కు చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’ అని ఈస్ట్‌వుడ్ తెలిపారు. మీకో విషయంలో తెలుసా..? ఒక బైక్ మీద వేగంగా వెళ్లి.. పర్వతంపై నుంచి దూకి.. వెంటనే పారాచూట్ తెరిచి.. ల్యాండ్ అవ్వాలన్నది టామ్ క్రూజ్ చిన్నప్పటి కల అట. చిన్నప్పుడు ఇంట్లో ర్యాంప్లాంటిది ఏర్పాటు చేసుకుని.. సైకిల్ మీద ఇలా జంప్ చేసిన ఘటనలు ఎన్నోనట. అలాగే దెబ్బలు తిన్న ఘటనలు కూడా.. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ స్టంట్తో ఇన్నాళ్లకు ఆయన కల తీరిందన్నమాట. ఈ వీడియోను నెట్లో చూసినోళ్లంతా సూపర్ అనేస్తున్నారు. ఏంటీ సింపుల్‌గా సూపరా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారీస్థాయిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు రూపమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ భారత ప్రధానితో కొద్దిసేపు మాటామంతీ జరిపిన తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను ఓ మీడియా ప్రతినిధి కార్యక్రమం గురించి స్పందించమని కోరగా.. "ఇదొక ప్రేమ పూర్వకమైన సందేశమని.. ఆయన అసలైన సంస్కృతికి పుట్టినిల్లయిన భారత్ నుండి వచ్చారు. ఆయన భారతీయ సాంప్రదాయానికి ప్రతిబింబం. ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందని అన్నారు. #WATCH | It is a lovely message. He (PM Modi) is a product of Indian culture and comes from a vast place like Indian culture does. This message of universal brotherhood and sisterhood is the one we want to hear again and again, says Richard Gere after Yoga Day event in New York pic.twitter.com/9fKXLpCYyh — ANI (@ANI) June 21, 2023 భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ తో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ "వసుదైక కుటుంబం" పేరుకు తగ్గట్టుగానే ప్రపంచ ప్రతినిధులంతా ఒకేచోట చేరి కుటుంబ వేడుకను తలపించారు. ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం.. -
కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు!
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్‌లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. (ఇది చదవండి: స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి) మైక్ బటాయే కెరీర్ మైక్ బటాయే సూపర్‌హిట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్లో మూడు ఎపిసోడ్లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్‌హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. (ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!) -
అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డానీ మాస్టర్సన్ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీనిపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించగా.. 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా 2003 ఏడాది చివర్లో ఓ యువతిని హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది. ఇకపోతే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్ 2017లో ద రాంచ్ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది చదవండి: ఆలియా భట్ ఇంట విషాదం.. నువ్వే నా హీరో అంటూ పోస్ట్ -
83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న హీరో
హాలీవుడ్ సీనియర్ హీరో, ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. 29 ఏళ్ల యువతి, నిర్మాత నూర్ అల్పల్లాతో ఈ సీనియర్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) కోవిడ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ తర్వాత పాసినో.. అల్పల్లాతో డేటింగ్ ప్రారంభించాడు. అల్పల్లా కూడా అంతకు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేసింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పాసినోతో సహజీవనం కొనసాగించింది. అల్పల్లాకు ఇది మొదటి సంతానం కాగా, పాసినోకు నాలుగో సంతానం. అంతకు ముందు నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు. -
మూడోసారి సహజీవనం, 83 ఏళ్ల వయసులో నాలుగోసారి..
హాలీవుడ్ స్టార్, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న హీరో రాబర్ట్ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన విషయం తెలిసిందే కదా! తాజాగా ఇదే వయసులో ఉన్న మరో హాలీవుడ్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడ్ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్ పచినో 29 ఏళ్ల వయసున్న నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇకపోతే అల్ పచినో ఏప్రిల్‌లో 83వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. మూడు రిలేషన్స్- ముగ్గురు పిల్లలు పెళ్లి అంటే ముఖం చాటేసే అల్ పచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడిపాడు. మొదటగా యాక్టింగ్ కోచ్ జన్ తరంత్తో డేటింగ్ చేయగా వీరికి 1989లో జూలీ పుట్టింది. ఆ తర్వాత నటి బెవర్లీ డియాంగిలోతో సహజీవనం చేయగా వీరికి ఆంటన్, ఒలీవియా కవలలు జన్మించారు. అయితే వీరి రిలేషన్ కూడా ఎంతో కాలం సాగలేదు. 1997-2003 మధ్యకాలంలోనే కలిసి ఉన్నారు, తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం అల్.. నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటికే ఆమె మిక్ జాగర్, నికోలక్ బెరగ్రూన్లతో ప్రేమలో పడటం, బ్రేకప్ చెప్పడం కూడా అయిపోయింది. అంటే ఇద్దరికీ ఇది మూడో డేటింగే! ఎప్పుడూ ప్రేమ, సహజీవనం వరకే వచ్చి ఆగిపోయిన అల్ పచినో పెళ్లికి మాత్రం మొగ్గచూపలేదు. మరి ఈసారైనా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి! సినిమాల విషయానికి వస్తే.. అల్ పచినో ప్రస్తుతం 'డేవిడ్ మామెట్స్ అసాసినేషన్' సినిమా చేస్తున్నాడు. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షియా లేబఫ్, రెబెకా పిడ్జియాన్, కోర్ట్నీ లవ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. చదవండి: కోపంతో నయనతారను రావద్దని చెప్పా: పార్థిబన్ -
'ఆర్ఆర్ఆర్' నటుడు స్టీవెన్ సన్ మృతికి కారణమిదే!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ విలన్‌గా(స్కాట్ దొర) నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ 58 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వాళ్లకు సుపరిచతమైన ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. స్టీవెన్ సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్ఆర్ఆర్ టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్ చేస్తుండగానే ఆయన మిస్టరీ ఇల్నెస్కు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన మరణించారు అంటూ సదరు వార్తాసంస్థ తెలిపింది. కాగా థోర్ సిరీస్‌తో పాపులర్ అయిన ఆయన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్,ది ట్రాన్స్పోర్టర్ వంటి పలు సినిమాల్లో నటించారు. చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.స్టీవెన్ సన్ 1997లో బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకోగా 8ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. -
12 రకాల సర్జరీలు.. లక్షల డాలర్లు ఖర్చు..తీరా చూస్తే ప్రాణం పోయింది!
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కెనడాకు చెందిన నటుడు సెయింట్ వాన్ కోలుచి(22) కన్నుమూశారు. అయితే ముఖానికి సర్జరీ చేయించుకోవడం వల్లే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఉదయం దక్షిణ కొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సెయింట్ వాన్ కొలూచి 12 ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో దవడకు అమర్చిన ఇంప్లాంట్లను తొలగించుకోవడానికి ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అది ఇన్ఫెక్షన్కు దారి తీయడంతో కొద్ది గంటలకే మృతి చెందాడు. వాన్ కొలూచి సినీ ఇండస్ట్రీలో రావడానికి 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు అతని సన్నిహితులు తెలిపారు. అతను దక్షిణ కొరియా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. మార్వెల్ స్టార్ నటుడు అరెస్ట్
మార్వెల్ స్టార్, హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలిపై దాడి చేసిన కేసులో న్యూయార్క్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బ్రూక్లిన్‌లోని బార్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా టాక్సీలో ఇద్దరి మధ్య గొడవ జరిగనట్లు జోనాథన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది. తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ప్రియురాలి తల, మెడకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. జోనాథన్ తన మొబైల్ ద్వారా మరొక మహిళకు మేసేజ్ పంపడం ప్రియురాలు చూసింది. దీంతో అతని ఫోన్‌ను పరిశీలించాలని ఆమె అడిగింది. దీనికి అతని కోపం కట్టలు తెచ్చుకుంది. ఆమెను చేయి పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. వెంటనే అతని ప్రియురాలు పోలీసులను కాల్ చేసింది. జోనాథన్ మేజర్స్ చివరిగా క్రీడ్-3, యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియాలో కనిపించారు. అతను రెండు వారాల ముందు ఆస్కార్స్‌లో తన క్రీడ్-3 సహనటుడు మైఖేల్ బి. జోర్డాన్‌తో పాటు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. కానీ జోనాథన్ ప్రతినిధి మాట్లాడుతూ అతను ఏ తప్పు చేయలేదని అన్నారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ‘హ్యారీపోటర్’ నటుడు హఠాన్మరణం
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘హ్యారీపోటర్’ ఫేం పాల్ గ్రాంట్(56) కన్నుమూశారు. బ్రిటిష్ నటుడైన పాల్ గ్రాంట్ లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ స్టేషన్లో ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చెర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు స్థానికి మీడియా పేర్కొంది. దీంతో ఆయన మృతిపై పలువురు హాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? కాగా పాల్ గ్రాంట్ 1980ల టైంలో విల్లో, లైబరన్త్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో హ్యారీపోటర్, స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. ఈ పరిస్థితుల్లోనూ డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోయిమంది. ఈ క్రమంలో 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. NEW: Paul Grant, who played an Ewok in Star Wars: Return of the Jedi and a goblin in Harry Potter and the Philosopher's Stone, died after collapsing outside a London train station. He was 56 years old. #diedsuddenly pic.twitter.com/NmjTkyhGrl — DiedSuddenly (@DiedSuddenly_) March 20, 2023 -
ఆర్ఆర్ఆర్ ఎక్కవ సార్లు చూశా.. హాలీవుడ్ నటుడు ప్రశంసలు
హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చాలా సార్లు చూశానని తెలిపారు. చూడటంతో తన అనుభవాన్ని తెలిపారు. ఈ వారంలో జోనాథన్ నటించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇవాళ భారత్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్ను ఆయన కొనియాడారు. జోనాథన్ మేజర్స్ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జోనాథన్.. తాను భారతీయ సినిమాలకు అభిమానినని.. అలాగే బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశానని వెల్లడించారు. జోనాథన్ జేమ్స్ మాట్లాడుతూ.. 'నేను భారతీయ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఎస్ఎస్ రాజమౌళి చిత్రం కాంగ్ ది కాంకరర్ దృష్టిని 'జయించిందని' చెప్పడం విశేషం. నేను ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశాను. ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించా. ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై చూడటం నాకు చాలా నచ్చింది.' అని అన్నారు. భారతీయ చిత్రాలను చూడటానికి నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. జోనాథన్ మేజర్స్ ప్రకటనతో ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ, అంతర్జాతీయ ప్రేక్షకులపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా.. మార్వెల్ స్టూడియోస్ ఇండియా నిర్మించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా సినిమా ఫిబ్రవరి 17 ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. -
ఇంట్లో విగతజీవిలా మారిన యంగ్ హీరో
హాలీవుడ్ యంగ్ హీరో కాడి లాంగో (34) మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్ నగరం ఆస్టిన్లోని ఆయన ఇంట్లో శవమై కనిపించారు. ఈ విషయాన్ని మేనేజర్ అలెక్స్ గిట్టెల్సన్ తన ట్విట్టర్లో వెల్లడించారు. లాంగో కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేశారు. అలెక్స్ గిట్టెల్సన్ ట్వీట్ చేస్తూ.. 'నా ప్రియమైన స్నేహితుడు, నా క్లయింట్ కాడి లాంగో ఇక లేరన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మిస్ యూ బ్రదర్.' అంటూ ట్వీట్ చేశారు. అయితే లాంగో చాలా సంవత్సరాలుగా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. 2022లో రిహాలిబిటేషన్ కేంద్రానికి కూడా వెళ్లివచ్చినట్లు సమాచారం. తన భర్త పిల్లల కోసం చాలా కష్టపడేవారని దివంగత నటుడి భార్య స్టెఫానీ లాంగో తెలిపింది. లాంగోకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్, వైల్డ్‌ఫ్లవర్, నాట్ టుడే, హాలీవుడ్ హైట్స్‌లో లాంగో తన పాత్రలకు బాగా పేరు సంపాదించారు. Devastated beyond words at the tragic loss of my dear friend and client, Cody Longo. My heart breaks for his beautiful family. You will be missed, brother. https://t.co/D0lKsUnBmK — Alex Gittelson (@alexgittelson) February 10, 2023 -
నా 30 ఎముకలు విరిగిపోయాయి.. మీ అందరికీ కృతజ్ఞతలు
మంచు తొలగిస్తూ తీవ్ర గాయాల పాలైన హాలీవుడ్ స్టార్ హీరో జెరెమీ రెన్నర్. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. తాజాగా ఆయన తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఓ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో తెల్లవారుజామున మంచు ప్రమాదంలో జెరెమీ రెన్నర్ తీవ్రంగా గాయపడ్డారు. జెరెమీ రెన్నర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'న్యూ ఇయర్ రోజున మంచు గడ్డల కింద నలిగిపోయా. నా 30 ఎముకలు విరిగిపోయాయి. కొత్త ఏడాదిలో రిజల్యూషన్లు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నా. కానీ నా కుటుంబంలో విషాదం నింపింది. కానీ మీ అందరి ప్రేమతో మళ్లీ కోలుకుంటున్నా. త్వరలోనే బలంగా తిరిగివస్తా' అంటూ ఆసుపత్రి బెడ్లో డాక్టర్ తన కాలును చాచి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Jeremy Renner (@jeremyrenner) -
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ 'గే'నే: నటుడు
నటుడు నోవా షన్నాప్.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన స్ట్రేంజర్ థింగ్స్‌లో విల్ బయర్స్ అనే గే పాత్రలో నటించాడు. తీరా ఇప్పుడు తాను నిజంగానే స్వలింగ సంపర్కుడినని ప్రకటించాడు. 'పద్దెనిమిదేళ్లపాటు భయపడుతూ బతికిన నేను ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాను. నేను గే అని నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు చెప్పేశాను. కానీ వాళ్లెంతో సులువుగా ఆ విషయం మాకు తెలుసని అనేశారు' అంటూ ఓ టిక్‌టాక్ వీడియో చేశాడు. అక్కడితో ఆగకుండా 'నేను రియల్‌లైఫ్‌లో కూడా విల్ బయర్స్నే' అంటూ తాను స్వలింగ సంపర్కుడినని నొక్కి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆ సిరీస్ చేసినప్పుడే మేము గెస్ చేయాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. I'm so proud of Noah Schnapp for coming out!!! his caption almost made me choke laughing pic.twitter.com/36F55vCFcb — Mirian 🐍 (@MirianMeriQuei) January 5, 2023 చదవండి: తల్లితో కలిసి వంట చేస్తున్న అల్లు అయాన్ నరేశ్ పెళ్లి జరగనివ్వను: రమ్య -
కొంపముంచిన మంచు.. స్టార్ నటుడి పరిస్థితి విషమం
అమెరికాలో కురుస్తున్న మంచు తుపాను కారణంగా హాలీవుడ్ స్టార్ నటుడు ప్రమాదానికి గురయ్యారు. ది అవెంజర్స్ నటుడు, కెప్టెన్ అమెరికా ఫేమ్ స్టార్ యాక్టర్ జెరెమి రెన్నర్కు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నటుడిని వెంటనే స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జెరెమి రెన్నర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల అమెరికాలో మంచు తుపాను కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో అవి తొలగించటానికి అక్కడి ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తుండగా హాలీవుడ్ స్టార్ యాక్టర్, అవెంజర్స్ ఫేమ్ జెరెమి రెన్నర్ ప్రమాదానికి గురయ్యారు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్(56) కన్నుమూశారు. నిద్రలోనే తన నివాసంలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘యంగ్ టాలెంట్ టైమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జిర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సహానటీనటులు, ఆస్ట్రేలియా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా 1 979 నుంచి 1983 వరకు యంగ్ టాలెంట్ టైమ్ అనే ప్రోగ్రాంలో రెగ్యులర్ పెర్ఫార్మర్గా బాబీ వర్క్ చేశారు. ఈ షోలో బాబీతో వర్క్ చేసిన యంగ్ టాలెంట్ టైం షో టీం సభ్యులు ఫేస్బుక్ వేదికగా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. యంగ్ టాలెంట్ టైమ్(1979), నెయిబర్(1985) టీవీ సిరీస్, యంగ్ టాలెంట్ టైమ్ టెల్స్ ఆల్(2001) ప్రోగ్రామ్స్ ద్వారా ఆయన మంచి గుర్తింపు పొందారు. -
అవతార్-2 అరుదైన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆ చిత్రాన్ని దాటేసింది..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సముద్రం అడుగున ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం కామెరూన్‌కే సాధ్యమనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్) తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల టికెట్ల అమ్మకాల మార్క్‌ను అవతార్-2 అధిగమించింది. కేవలం 14 రోజుల్లో ఈ మార్క్‌ను దాటేసింది కామెరూన్ విజువల్ వండర్. జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని అధిగమించి 2022లో రెండో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. 2022లో విడుదలైన మూడు సినిమాలు మాత్రమే వన్ బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో పాటు టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్: మావెరిక్ (31 రోజులు), క్రిస్ ప్రాట్ మూవీ జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ మార్క్ చేరుకోవడానికి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2019లో విడుదలైన తొమ్మిది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ మూవీ తర్వాత అవతార్- 2 అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకుంది. స్పైడర్ మ్యాన్ చిత్రం కేవలం 12 రోజుల్లోనే అధిగమించి మొదటిస్థానంలో ఉంది. ఇప్పటివరకు కేవలం ఆరు సినిమాలు మాత్రమే మొదటి రెండు వారాల్లో వన్ బిలియన్ చేరుకున్నాయి. (ఇది చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?) అవతార్ 2 ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో 317.1 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 712.7 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 1.025 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 1.001 బిలియన్ డాలర్లను అధిగమించి రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అవతార్-2. ప్రస్తుతం అంచనాల ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి మరోసారి పుంజుకోనుంది. అవతార్-2 ప్రధాన థియేట్రికల్ మార్కెట్ అయిన చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షల రష్యాలో చిత్రానికి ఆదరణ తగ్గింది. -
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్ హిప్హాప్ డ్యాన్స్, కొరియోగ్రాఫర్, నటుడు డీజే స్టీఫెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ హాటల్లో ఆయన గన్‌తో షూట్ చేసుకున్ని ఆత్మహత్య పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్టీఫెన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. చదవండి: అనన్య ఫ్యాన్‌గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’ కాగా ది ఎలెన్ డిజనరేస్ షో, సో యూ థింక్ యూ కెన్ డాన్స్’ వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్ పాపులర్ అయ్యాడు. స్టెప్ అప్, మ్యాజిక్ మైక్ డబుల్ ఎక్స్ సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అలాగే టెలివిజన్ ప్రొడ్యూర్గా కూడా స్టీఫెన్ గుర్తింపు పొందాడు. కాగా స్టీఫెన్‌కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ellen DeGeneres (@theellenshow) -
చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. మరో దిగ్గజ నటుడు మృతి
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో దిగ్గజ హాలీవుడ్ నటుడు కన్నుమూశారు. పవర్ రేంజర్స్ సిరీస్‌లో నటించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మరణించారు. ఆయన ప్రస్తుతం ఆమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ప్రముఖంగా గ్రీన్ రేంజర్ పాత్ర పోషించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ 49 ఏళ్ల వయసులో కన్నుమూయడంతో సహచరులు షాక్‌కు గురయ్యారు. పవర్ రేంజర్స్ స్టార్ దాదాపు 14 ఎపిసోడ్లలో నటించారు. ఆయన మరణవార్త విన్న అతని స్నేహితులు, సహచరులు నివాళులర్పించారు. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో టామీ ఆలివర్ పాత్రతో జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ప్రాముఖ్యం సంపాదించారు. ఫ్రాంక్ మృతితో అతని కుటుబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ నటుడికి నలుగురు పిల్లలు ఉన్నారు. 1993 నుంచి 1996 వరకు మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ఎక్కువగా నటించారు. ఆ తర్వాత పవర్ రేంజర్స్ జియో, టర్బో, డినో థండర్‌తో సహా స్వీట్ వ్యాలీ హై, ఫ్యామిలీ మ్యాటర్స్, వి బేర్ బేర్స్ ఎపిసోడ్స్‌లో కూడా జాసన్ కనిపించారు. అతని మరణ వార్త విన్న సహనటుడు వాల్టర్, జోన్స్ నివాళులర్పించారు. ఫ్రాంక్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. 'ఫ్రాంక్ లేడంటే నమ్మలేకపోతున్నాను. మా కుటుంబంలోని మరొక సభ్యుడిని కోల్పోయినందుకు బాధగా ఉంది. అతను మా అందరికీ స్ఫూర్తి. అతని ఉనికిని చాలా మిస్ అవుతున్నాం. మా రేంజర్ కుటుంబంలోని సభ్యుడిని కోల్పోవడం చాలా బాధాకరం.' అంటూ పోస్ట్ చేశారు. Rest in peace Jason David Frank Just talking to you a few weeks back... This is heartbreaking My condolences to the family.... — BossLogic (@Bosslogic) November 20, 2022 -
గోల్డ్ మెడల్‌తో సర్ప్రైజ్ చేసిన హాలీవుడ్ హీరో
వెనమ్(VenoM), మ్యాడ్మాక్స్ ఫ్యూరీ రోడ్.. ఫేమ్ హాలీవుడ్ హీరో టామ్ హార్డీ(ఎడ్వర్డ్ థామస్) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. హీరోగా పేరు తెచ్చుకొని మళ్లీ పాపులర్ అవడం ఏంటని డౌట్ వద్దు. విషయంలోకి వెళితే.. మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొన్న టామ్ హార్డీ ఏకంగా గోల్డ్ మెడల్ కొల్లగొట్టడం విశేషం. 45 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్‌లోకి ఎంటరైన టామ్ హార్డీ 2022 బ్రెజిలియన్ జియు-జిట్సు ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 17న అల్టిమేట్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో మిల్టన్ కీన్స్‌లోని ఓక్గ్రోవ్ స్కూల్లో ఈ పోటీని నిర్వహించారు. నీలిరంగు దుస్తులు ధరించిన టామ్ హార్డీ.. తన అసలు పేరు ఎడ్వర్డ్ థామస్‌గా బరిలోకి దిగడం విశేషం. కాగా పోటీలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని టామ్ హార్డీ పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టామ్ హార్డీ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్‌లో పాల్గొనడంపై మ్యాచ్ నిర్వాహకులు స్పందించారు. టామ్ హార్డీ చాలా మంచి వ్యక్తి. అతని యాక్టింగ్ తెలిసిన ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. మేం పిలిచిన వెంటనే ఒక గెస్ట్‌గా హాజరవడమే గాక మ్యాచ్ ఆడడంతో పాటు అభిమానులకు ఫోటోలు ఇవ్వడం అతని మంచి మనుసును తెలియజేస్తుంది. ఇలాంటి ఈవెంట్‌కు టామ హార్డీ రావడం మా అదృష్టం అని పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం గోల్డ్ మెడల్‌తో పాటు సర్టిఫికేట్ పొందిన టామ్ హార్డీ మాట్లాడాడు. ''ఈ విజయం వర్ణించలేనిది.. ఎందుకంటే నేనింకా షాక్‌లోనే ఉన్నా.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు'' అంటూ పేర్కొన్నాడు. Tom Hardy just casually submitting people at 45 years old pic.twitter.com/pLpYvH1Rj4 — Out Of Context MMA (@oocmma) September 21, 2022 View this post on Instagram A post shared by 𝗧𝗮𝗽𝗲𝗱 𝗙𝗶𝗻𝗴𝗲𝗿𝘀 (@taped_fingers) -
ప్రముఖ నటుడు కన్నుమూత.. ఎమోషనల్‌గా భార్య ట్వీట్
Goodfellas Actor Paul Sorvino Died At Age 83: హాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో 'గుడ్ ఫెల్లాస్' ఒకటి. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్ పౌలీ సిసిరో పాత్ర పోషించి మెప్పించిన నటుడు పాల్ సోర్వినో. 83 ఏళ్ల పాల్ సోర్వినో ఇక లేరు. ఫ్లోరిడా జాక్సన్ విల్లేలోని ఓ ఆసుపత్రిలో సహజ కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. దీంతో హాలీవుడ్ చిత్రసీమలో విషాదం నెలకొంది. 'నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను. నా జీవితంలోని ప్రేమ, అత్యంత అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాను. మనసు ముక్కలైంది' అని ఆయన భార్య డీ డీ సోర్వినో సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. 1990 దశకంలో వచ్చిన లా అండ్ ఆర్డర్ టీవీ సిరీస్‌లో పోలీస్ సార్జెంట్ ఫిల్ సెరెటా పాత్రతో పాపులర్ అయ్యాడు సోర్వినో. గత 50 ఏళ్లుగా సినిమాలు, టీవీ షోలు, స్టేజ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. 1939లో బ్రూక్లిన్‌లో జన్మించిన పాల్ సార్వినో సంగీతం కూడా నేర్చుకున్నాడు. నటుడు కాకముందు ఆయన ఒపేరా సింగర్ కావాలనుకున్నాడు. ది ఛాంపియన్షిప్ సీజన్, డిక్ ట్రేసీ, రెడ్స్, నిక్సన్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో I am completely devastated The love of my life & the most wonderful man who has ever lived is gone . I am heartbroken ❤️❤️❤️ pic.twitter.com/0wBSG3uTgD — Dee Dee Sorvino (@deedeegop) July 25, 2022 -
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘గాడ్ ఫాదర్’ నటుడు మృతి
గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమల్లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. వారి మరణవార్త నుంచి బయటపడక ముందే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్(82) శుక్రవారం కన్నుమూశారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో నివాసం ఉంటున్న జేమ్స్ నేడు ఉదయం తుదిశ్వాస విడిచనట్లు ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. చదవండి: ‘ఏంటీ.. మహేశ్ సినిమాకు పూజా కండిషన్స్ పెట్టిందా?’ ‘బుధవారం (జూలై 6) సాయంత్రం జిమ్మీ కన్నుమూశారనే విషయాన్ని తెలియజేయడానికి మేం చింతిస్తున్నాం’ అని జేమ్స్ ఫ్యామిలీ ట్వీట్ చేసింది. అలాగే ఆయన మేనేజర్ స్పందిస్తూ ‘జేమ్స్ చాలా గొప్పవాడు. చాలా సరదాగా ఉంటారు. అందరితో ప్రేమగా ఉండే ఆయన ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని పార్థిస్తున్నా’ అంటూ మీడియాకు చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్ చిత్రంతో గుర్తింపు పొందిన జేమ్స్ కాన్ మిజరీ, ఎల్ఫ్ వంటి తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు పలుమార్లు ఆయన ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. చదవండి: హీరో విక్రమ్‌కు గుండెపోటు James Caan. Loved him very much. Always wanted to be like him. So happy I got to know him. Never ever stopped laughing when I was around that man. His movies were best of the best. We all will miss him terribly. Thinking of his family and sending my love. pic.twitter.com/a0q8rCP1Yl — Adam Sandler (@AdamSandler) July 7, 2022 -
త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు
ప్రముఖ హాలీవుడ్ నటుడు రే లియోటా (రేమండ్ అలెన్ లియోటా) మే 26న డొమినికన్ రిపబ్లిక్లో నిద్రలోనే కన్నుమూశారు. 67 ఏళ్ల రే లియోటా 'డేంజరస్ వాటర్స్' షూటింగ్ లొకేషన్లో మరణించినట్లు ఆయన ప్రచారకర్త జెన్నిఫర్ అలెన్ అధికారికంగా ప్రకటించారు. మార్టిన్ స్కోర్సెస్ డైరెక్ట్ చేసిన గుడ్ ఫెల్లాస్ సినిమాతో మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రే గుర్తింపు పొందారు. 1990లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మాబ్స్టర్ హెన్రీ హిల్ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. ఈ మూవీకి అనేక క్యాటగిరీల్లో ఆస్కార్ లభించింది. ఆయన మృతితో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రే లియోటా కాప్ ల్యాండ్ (1992), హన్నిబాల్ (2001), జాన్ క్యూ (2002), ఐడెంటిటీ (2003), కిల్లింగ్ మి సాఫ్ట్లీ (2012), మ్యారేజ్ స్టోరీ (2019), ది మెనీ సెయింట్స్ ఆఫ్ నెవార్క్ (2021) చిత్రాలలో నటించి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా మైఖేల్ రుడాల్ఫ్ రచించిన 'షేడ్స్ ఆఫ్ బ్లూ: 30 ఇయర్స్ ఆఫ్ (అన్) ఎథికల్ పోలీసింగ్' నవల ఆధారంగా తెరకెక్కిన షేడ్స్ ఆఫ్ బ్లూ (2016-18) క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించాడు. రే లియోటాకు ఒక కుమార్తె కర్సెన్ లియోటా ఉండగా, తనకు కాబోయే భార్య (ఫియాన్సీ) జాసీ నిట్టోలోను వివాహం చేసుకోవాలనుకున్నట్లు సమాచారం. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ -
‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు
Hollywood Writer Patton Oswalt Interesting Comments On SS Rajamouli: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్ ఏమన్నదంటే.. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా చూసిన ఓ హాలీవుడ్ నటుడు, సినీ రచయిత జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూసిన పాటన్ ఓస్వాల్ట్ వరుస ట్వీట్ చేస్తూ ఆర్ఆర్ఆర్, మూవీ టీంపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి! ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ సినిమా ఇది అన్నాడు. ‘మీ దగ్గర్లోని థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఆడకపోతే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి’ అంటూ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ట్యాగ్ చేశాడు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన విధానం, కథను చూపించిన తీరు అత్యద్భుతం. ఇకపై మిమ్మల్ని(రాజమౌళి) సినిమాలు తీసేందుకు అనుమతించకూడదు. మీ తదుపరి చిత్రం కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నా’అంటూ రాసుకొచ్చాడు. If this ISN’T playing near you in IMAX then this is the next best way to watch it. Fucken @RRRMovie is insane. https://t.co/1kwNFwtTMR — Patton Oswalt (@pattonoswalt) May 24, 2022 -
నటుడితో అమీ జాక్సన్ డేటింగ్.. లీకైన ఫోటోలు
వరుడు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్.. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో మరింత పాపులర్ అయింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే ఇటీవలె మరోసారి ప్రేమలో పడిన అమీ జాక్సన్ కొన్నాళ్లుగా బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ లండన్‌లో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి అమీ జాక్సన్ చేతిలో చేయి వేసుకొని లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరి లవ్ ఎఫైర్ మరోసారి చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by D💋🎀 (@edwestwicks.wife) -
జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి
Actress Amber Heard Cries At Court: ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై వేసిన పరువు నష్టం దావా కేసుపై ప్రస్తుత కోర్టులో విచారణ జరుగుతోంది. వారు కలుసున్నపుడు జానీ డేప్ తరచూ కొడుతుండేవాడని, తాను గృహహింస బాధితురాలిని అంటూ అంబర్ హెర్డ్ ఇటీవల తను రాసిన ఓ వ్యాసంలో వెల్లడించింది. దీంతో తనపై అంబర్ తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంటూ జానీ ఏప్రిల్ 20న మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా! ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన హియరింగ్‌లో అంబర్, జానీ డేప్పై సంచలన ఆరోపణలు చేసింది. జానీ తనను తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించింది అంబర్. ‘మా కొద్దిపాటి వైవాహిక జీవితంలో జానీ తరచూ కొట్టేవాడు. అంతేకాదు అసభ్యపదజాలంతో దూషించేవాడు. మొదటి సారి తన టాటూను చూసి నవ్వానని కొట్టాడు. ఆయన శరీరంపై చెదిరిన ఉన్న టాటూ ఏంటని అడగ్గా విన్నో(జానీ డేప్ మాజీ ప్రియురాలు విన్నోనా రైడర్ పేరు) అని సమాధానం ఇచ్చాడు. అది జోక్ అనుకుని నవ్వేశాను. దీంతో నా చెంపపై కొట్టి నీకు ఇది సరదాగా ఉందా? అంటూ అభ్యంతరకర పదం(బీ..) వాడాడు’ అని పేర్కొంది. చదవండి: సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా? ఆ సమయంలో తనకు ఏం అర్థం కాలేదని, షాక్‌తో అతనివైపే ఉండిపోయాను’ అని చెప్పింది. అంతేగాక జానీ తనపై పలుమార్లు దాడి చేశాడని, మద్యం, మాదకద్రవ్యాల మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ భౌతికంగా గాయపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇతర యువతుల పట్ల సన్నిహితంగా ఉన్న సంఘటనలు గురించి తరచూ తన దగ్గర ప్రస్తావించేవాడని పేర్కొంది. ఈ క్రమంలో ఓ రోజు తన జీవితంలో అంత్యంత చేదు సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేని చెప్పింది. ఓ రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకుని ఫుల్ మత్తులో ఉన్న జానీ తన బట్టలు చించి, శరీరా భాగాల్లో కోకైన్ కోసం వేతికాడంటూ నాటి చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అంబర్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మాజీ భార్యపై రూ. 380కోట్ల పరువునష్టం దావా వేసిన హీరో
మాజీ భార్య రాసిన వ్యాసంపై ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ రూ. 380 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. వివరాల్లోకి వెళితే... మూడేళ్ల డేటింగ్ అనంతరం నటి అంబర్ హెర్డ్‌ను 2015లో హీరో జానీ డేప్ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరి వైవాహిక జీవితంలో కలతలు రావడంతో 2017లో వీరు విడిపోయారు. అయితే అంబర్ హెర్డ్ తాను గృహహింస బాధితురాలని అంటూ రాసిన వ్యాసంపై డేప్ ఏకంగా రూ. 380కోట్ల పరువు నష్టం దావా వేశాడు. తాను అంబర్‌ను ఏ రకంగా హింసించలేదని డేప్ తెలిపారు. 'పెళ్లయిన ఏడాది తర్వాతి నుంచి మా మధ్య తరుచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అంబర్ నన్ను దౌర్జన్యంగా, హింసాత్మకంగా, మాటల్లో చెప్పలేని తిట్లతో అవమానించేది. టీవీ రిమోట్, వైన్ గ్లాస్ తలపై విసిరేది. మానవ మలం బెడ్‌పై ఉంచేది' అని వర్జీనియా కోర్టులో వాపోయాడు. ప్రస్తుతం వర్జీనియాలో జరుగుతున్న ఈ పరువు నష్టం కేసు ఇప్పుడు రెండో వారానికి చేరుకుంది. ఈ కేసులో తర్వాతి సాక్షులుగా పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, నటులు జేమ్స్ ఫ్రాంకో, పాల్ బెటనీలు హాజరు కానున్నారు. -
సింగర్‌పై యంగ్ హీరో లైంగిక దాడి, అరెస్ట్ చేసిన పోలీసులు
The Flash Actor Ezra Miller Arrested On Harassment, Misconduct Charges: జస్టిస్ లీగ్, ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ యంగ్ హీరో ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. అమెరికా హవాయిలోని ఓ బార్లో జరిగిన పార్టీలో మిల్లర్ పాల్గొన్నాడు. అక్కడ 23 ఏళ్ల ఓ యువతి సాంగ్స్ పాడుతుండగా మిల్లర్ స్టేజ్ పైకి ఎక్కి ఆమెతో అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె ఒంటిపై చేతులు వేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకోవడానికి వచ్చిన మేనేజర్ కూడా దాడికి యత్నించాడు. ఇక మిల్లర్‌కు సదరు యువతి ఎదురు తిరగడంతో ఆమె చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ని లాక్కొని అసభ్యంగా దూషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బార్ యాజమాన్యం మిల్లర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు 500 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే హిట్స్ అందుకుంటున్న మిల్లర్ ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వార్నీ! సొంత తండ్రితోనే సినీ నటుడి ఆన్లైన్ డేటింగ్..
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్లైన్ డేటింగ్‌కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్లైన్లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్‌తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు. (చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా! (చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!) -
ప్రముఖ నటుడు కన్నుమూత.. క్యాన్సర్ కారణమా?
Oscar Winning Actor William Hurt Dies At 71: ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మా నాన్న72వ పుట్టినరోజుకు వారం రోజుల ముందు మార్చి13న మరణించారు. ఆయన మృతి పట్ల మా కుటుంబం ఎంతో విచారంగా ఉంది. సహజ కారణాలతో ఆయన చనిపోయారు అని వివరించాడు. కాగా ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయిన విలియమ్ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన క్యాన్సర్ కారణంగానే చనిపోయారా లేక వృద్దాప్యపు సమస్యలతో మరణించారా అన్నదానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. 1991లో‘అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు. 1985లో వచ్చిన ‘కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్’ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. -
రెండేళ్ల డేటింగ్, రెండో పెళ్లికి నటుడు రెడీ!
Josh Duhamel Engagement: ట్రాన్స్ఫార్మర్స్ స్టార్ జోష్ దుహమెల్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ మేరకు ప్రియురాలు ఆద్రామరితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు. జనవరి 8న ఆద్రా బర్త్‌డే. ఇదే సరైన సమయం అనుకున్న జోష్ 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ఓ లేఖ ద్వారా ప్రశ్నించగా ఆమె సిగ్గుపడుతూ ఓకే చెప్పేసింది. దీంతో సంతోషం పట్టలేకపోయిన జోష్ ఆమె ఒప్పుకుందోచ్ అంటూ ఈ శుభవార్తను సోషల్ మీడియాలో వెల్లడించగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా జోష్ ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్య ఫెర్గీకి 2019లో విడాకులిచ్చాడు. అదే సమయంలో ఆద్రాకు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగానే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన అతడి మాజీ భార్య కొత్త జీవితం మొదలుపెట్టబోతున్న జోష్‌కు శుభాకాంక్షలు తెలిపింది. కాగా ఆద్రామరి పేరుగాంచిన ప్రొఫెషనల్ మోడల్. 2014లో మిస్ నార్త్ డకోటా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్న ఆమె 2016లో మిస్ వరల్డ్ అమెరికాగా కిరీటం దక్కించుకుంది. View this post on Instagram A post shared by Josh Duhamel (@joshduhamel) -
స్టార్ హీరోకు కరోనా పాజిటివ్.. వీలైనంత త్వరగా కోలుకుంటా
Hugh Jackman Tests Positive For Corona: హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్మన్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని పేరు. కానీ 'దెయ్యాల కోట' సినిమా హీరో అంటే తెలియని 90స్ కిడ్స్ మాత్రం ఉండరు. 2004లో హ్యూ జాక్మన్ నటించిన వాన్ హెల్సింగ్ చిత్రాన్ని తెలుగులో దెయ్యాల కోట పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అయితే తర్వాత 'దెయ్యాల కోట' పేరుతో అనేక హాలీవుడ్ చిత్రాలు డబ్ అయ్యాయి. హ్యూ జాక్మన్ కూడా ఎక్స్‌మెన్ సిరీస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన బ్రాడ్వేకు చెందిన 'ది మ్యూజిక్ మ్యాన్' షోకి ప్రదర్శన ఇచ్చే పనిలో ఉన్నాడు. అయితే మంగళవారం ఈ హీరోకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించాడు. 'ఈ రోజు ఉదయం (డిసెంబర్ 29 మంగళవారం) నేను కొవిడ్ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు జలుబు, గొంతు నొప్పి, కొంచెం ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. వీలైనంతా త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తాను. రివర్ సిటీ వేదికపై కచ్చితంగా కలుసుకుంటాను.' అని హ్యూ జాక్మన్ తెలిపాడు. హ్యూ జాక్‌మన్‌కు కరోనాతో తాను ప్రదర్శిస్తున్న 'ది మ్యూజిక్ మ్యాన్' షో జనవరి 1 వరకు వాయిదా పడింది. జనవరి 2న వింటర్ గార్డెన్ థియేటర్ వేదికపైకి హ్యూ జాక్మన్ రావాలని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. View this post on Instagram A post shared by Hugh Jackman (@thehughjackman) -
జేమ్స్ బాండ్‌గా చేయాలనుందన్న ఆ స్టార్ హీరో
Dwayne Johnson Wants To Play James Bond Character: హాలీవుడ్ ఐకానిక్ స్పై థ్రిల్లర్ 'జేమ్స్ బాండ్' సినిమా ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అభిమానులైతే చిన్న చిన్న స్పైలు చేస్తూ తాము జేమ్స్ బాండ్ల ఫీల్ అవుతుంటారు. ఆ పాత్రలో నటించేందుకు యాక్టర్స్ సైతం బాండ్ అనే బ్రాండ్ కోసం ఎంతో ఆరాటపడుతారు. అలాంటి జాబితాలో 'సూపర్ మ్యాన్'గా పాపులర్ అయిన 'కావిల్ హెన్రీ'తోపాటు హాలీవుడ్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా చేరారు 'డ్వేన్ జాన్సన్ (ది రాక్)'. ఇటీవల ఈ స్టార్ నటించిన రెడ్ నోటీస్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న డ్వేన్ ఓ ఇంటర్య్వూలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. కాగా జేమ్స్ బాండ్ పాత్రలో తర్వాత ఎవరినీ తీసుకోవాలనే చర్చ నడుస్తోంది. '1967లో వచ్చిన 007 సినిమా యూ ఓన్లీ లివ్ ట్వైస్లో మా తాత పీటర్ మైవియా విలన్‌గా నటించారు. అవును, 'సీన్ కానరీ' బాండ్‌గా చేసిన సినిమాలో మా తాత విలన్. నేను ఆ 'సీన్ కానరీ'లా కూల్ బాండ్‌గా నటించాలనుకుంటున్నాను. నాకు విలన్ అవ్వాలని లేదు. నేను బాండ్ అవ్వాలి' అని 'ఎస్కైవర్ వీడియో సిరీస్ అయిన ఎక్స్‌ప్లేన్ దిస్ షో'లో జాన్సన్ తెలిపాడు. అయితే ఇంతకుముందు ఏ ఒక్క అమెరికన్ బాండ్ పాత్ర పోషించకపోగా, అమెరికన్లందరూ బాండ్ ఫ్రాంచైజీలో విలన్లుగా కనిపించారు. అందుకే జాన్సన్‌కు విలన్‌గా చేయాలని లేనట్లు తెలుస్తోంది. డేనియల్ క్రేగ్‌కు బాండ్‌గా ఐదో చిత్రమైన 'నో టైమ్ టూ డై' అక్టోబర్ మొదటి వారంలో విడుదలై యూఎస్ బాక్సాఫీస్ వద్ద 56 మిలియన్ల అమెరికన్ డాలర్లు కొల్లగొట్టింది. తదుపరి బాండ్ చిత్రం ఎప్పుడూ అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే డేనియల్‌కి ప్రత్యామ్నాయంగా తర్వాతి బాండ్ ఎవరూ అనేది ప్రకటించలేదు. ఈ జేమ్స్ బాండ్ పాత్ర ఎంపికపై 2022 వరకు చర్చించలేమని దర్శకనిర్మాతలు తెలిపారు. మరోవైపు జాన్సన్ 'బ్లాక్ ఆడమ్' సినిమాతో డీసీ ఫ్రాంచైజీలోకి అడుగుపెడుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన డిస్నీ వెంచర్ 'జంగిల్ క్రూజ్'కు సీక్వెల్ కూడా రానుంది. -
మిస్టర్ బీన్ మరణించినట్లు ప్రచారం.. ఫ్యాన్స్ ఫైర్
Mr Bean Aka Rowan Atkinson Is Rumored To Be Dead And Goes Viral: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. అందులో ఎన్నో వార్తలు చక్కర్లు కొడతాయి. ఆ వార్తలు సమాచారం అందించేలా ఉన్నా, కొన్నిసార్లు తప్పుడు వార్తలే ఎక్కువ ప్రచారం అవుతుంటాయి. ఉదాహరణకి సెలబ్రిటీల విడాకులు, మరణాలు, వింత సంఘటనలు అంటూ పలు పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి. ఈ పుకార్లకు బాధితులైనవారు స్పందించకుండా ఉండలేరు. ఇక మరణించినట్లు వచ్చిన వార్తలపై అయితే వారు 'మేము బతికే ఉన్నాం' అని చెప్పినా సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పరిచయం అక్కర్లేని పేరు మిస్టర్ బీన్. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్నారు. ఆయన అసలు పేరు రోవన్ అట్కిన్సన్. ఆయన పోషించిన పాత్ర పేరు 'మిస్టర్ బీన్'. ఈ పాత్ర తొలిసారిగా 1990లో పరిచయం అయింది. దీని తర్వాత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. అప్పటినుంచి రోవన్ అట్కిన్సన్ను అందరూ మిస్టర్ బీన్ అనే పిలిచేవారు. అయితే ఇటీవల ఈ బ్రిటీష్ నటుడు ఇక లేరంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. రోవాన్ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ ప్రసారం కూడా చేసింది. ఈ వార్త చూసిన రోవన్ అభిమానులు కలత చెందారు. ఆయన చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది రిప్ (RIP) మిస్టర్ బీన్ అని పోస్ట్‌లు కూడా పెట్టారు. తర్వాత ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిసి ఫైర్ అయ్యారు. 'ఫాక్స్ న్యూస్' తన ట్విటర్ అకౌంట్లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ (రోవన్ అట్కిన్సన్) 58 సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో మరణించారు’ అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేసింది. తప్పుడు వార్తని ప్రచారం చేసినందుకు అంతర్జాతీయంగా ఉన్న రోవన్ అభిమానులు ఆ న్యూస్ ఛానల్‌పై మండిపడ్డారు. అయితే రోవన్ అట్కిన్సన్ మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. మిస్టర్ బీన్ 18 మార్చి 2017న రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఇంతకు ముందు కూడా వార్తలు రాగా ఆయన బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రోవన్ ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు. -
నిక్ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వచ్చిన వార్త షికారు కొట్టిన సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఈ వార్తపై తెగ చర్చ జరిగింది. ఇందుకు కారణం ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో నిక్ జోనాస్ పేరు తొలగించడమే. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ వార్తలను ఖండించింది ప్రియాంక తల్లి మధు చోప్రా. అవన్ని వట్టి పుకార్లే అని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది ప్రియాంక. ఇదీ చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్ జొనాస్‌ను తన కామెంట్లతో ఓ ఆట ఆడేసుకుంది. నిక్ జొనాస్‌కు, ఆయన సోదరుల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తనకే ఉన్నారని తెలిపింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్ బ్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: కూతురి విడాకుల వార్తలపై మధు చోప్రా స్పందన 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడు నిక్. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పితే, సక్సెస్ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్ బ్రదర్స్‌ను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక అభిమానులకు గుడ్ న్యూస్.. అదేంటో తెలుసా ?
Priyanka Chopra Shares Her First Look Poster Of Matrix Resurrections Movie: బాలీవుడ్, హాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ది మ్యాట్రిక్స్' సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్'. సినిమాలో ప్రియాంక పాత్ర ఎలా ఉండనుందో ఈ పోస్టర్లో చూపించారు. ఇందులో ప్రియాంక ఎరుపు రంగు ప్యాంటు, నలుపు బూట్లతో బ్లూ కలర్ టాప్ ధరించి ఉన్నారు. ఆమె హేయిర్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో ఎప్పుడూ కనపడే నెంబర్ కోడ్స్ ఎరుపు, నీలం రంగుతో వేవ్స్ రూపంలో ఉండటం చూడొచ్చు. ఈ పోస్టర్‌ను ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ 'ఆమె ఇక్కడ ఉంది. రీ-ఎంటర్' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ ఈ హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక ఎలా ఉండనుందో అని ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రియాంక షేర్ చేసిన 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' థియేటర్ రిలీజ్ పోస్టర్లో కూడా తాను లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ప్రియాంక మీరెక్కడ' అని కూడా ఓ అభిమాని కామెంట్ చేశాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక కళ్లద్దాలు ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాలుగో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 22న ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో పేరు మార్చిన సంగతి తెలిసిందే. చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? -
విజువల్ వండర్‌గా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్..
Spider Man: No Way Home Trailer Out: స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్‌లకు వరల్డ్‌వైడ్‌గా ఎంతో ఆదరణ ఉంది. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్టశక్తులతో స్పైడీ చేసే పోరాట విన్యాసాలు ఎప్పుడూ ఆకట్టుకుంటునే ఉంటాయి. ఇప్పుడు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'. జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హోలాండ్, జెండీయా, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఒక విజువల్ వండర్‌గా సాగింది. యాక్షన్ సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో లీడ్ రోల్ చేసిన టూబే మాగ్యూర్, ఆండ్య్రూ గారీఫీల్డ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో మాత్రం వారెవరూ కనిపించలేదు. కానీ హీరో స్పైడీ నలుగురు విలన్లతో పోరాడనున్నట్లు తెలుస్తోంది. చదవండి: స్పైడర్ మ్యాన్-నో వే హోమ్ పోస్టర్ విడుదల.. ఇవి గమనించారా..! -
మార్వెల్ క్యారెక్టర్ చేయలని ఉందన్న డీసీ హీరో
డీసీ మూవీస్‌లో సూపర్ మ్యాన్‌గా పాపులర్ అయిన హెన్రీ కావిల్కు ఓ పాత్ర పోషించాలని ఆసక్తిగా ఉందని తెలిపాడు. అదేంటంటే.. మార్వెల్ సూపర్ హీరో కెప్టెన్ బ్రిటన్ క్యారెక్టర్ చేయాలని ఉత్సాహపడుతున్నట్లు చెప్పాడు కావిల్. ఆధునీకరించిన కెప్టెన్ బ్రిటన్ వర్షన్ ఎంతో సరదాగా ఉంటుందని, కెప్టెన్ అమెరికాకు ఏ మాత్రం తీసిపోదన్నాడు. జెమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో డానియల్ క్రేగ్ తర్వాతి బాండ్ ఎవరనే జాబితాలో కావిల్ పేరు వినిపించింది. ఇప్పుడు ఎమ్‌సీయూ నుంచి మరొక సూపర్ హీరోగా నటించాలని ముచ్చట పడుతున్నాడు. 'ఇది వరకు పోషించిన మార్వెల్ క్యారెక్టర్స్ గురించి నేను మాట్లడను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అయితే నేను కెప్టెన్ బ్రిటన్ గురించి కొన్ని పుకార్లు విన్నాను. ఇంటర్నెట్లో చూశాను. కెప్టెన్ అమెరికాను ఆధునీకరించినట్టే, కెప్టెన్ బ్రిటన్ క్యారెక్టర్‌ను ఆధునీకరిస్తే ఎంతో సరదాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాను.' అని హెన్రీ తెలిపారు. కెప్టెన్ బ్రిటన్ అంటే కెప్టెన్ అమెరికాకు సమానం. అతని అసలు పేరు బ్రియాన్ బ్రాడాక్. అతను అర్ధూరియన్ మెజిషియన్ మెర్లిన్, అతని కూతురు రోమా నుంచి మ్యాజికల్ పవర్స్‌ను పొందినవాడు. ఆ పవర్స్ అతన్ని మరింత బలిష్టంగా చేస్తుంది. మానవాతీత బలం, సత్తువ, వేగం, ఎగరడం వంటి సామర్థ్యాలు వచ్చేలా చేస్తాయి. డీసీ సంస్థలో సూపర్ మ్యాన్‌గా మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం గురించి కావిల్ చెప్పాడు. ఐకానికి సూపర్ హీరోగా తాను చేయడానికి ఇంకా చాల కథలు ఉన్నాయన్నాడు. అవి చేసే అవకాశాన్ని ఇష్టపడతానని తెలిపాడు. సూపర్ మ్యాన్ కాకుండా హెన్రీ కావిల్ ఎనోలా హోమ్స్‌లో షేర్లాక్ హోమ్స్‌గా, టీవీ షో ది విట్చర్లో గెరాల్ట్ ఆఫ్ రివియాగా పేరు తెచ్చుకున్నాడు. -
హాలీవుడ్ స్టార్ సాహసం.. బుర్జ్ ఖలీఫా భవనం ఎక్కి..
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఓ సాహసకృత్యం చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పైకి ఎక్కాడు. 2,909 మెట్ల ద్వారా 160 అంతస్తును చేరుకున్నాడీ బ్యాడ్ బ్యాయ్స్ హీరో. అతని బరువు తగ్గించే విధానాన్ని డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరిస్తున్నాడు విల్. 'బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్' అనే కొత్త యూట్యూబ్ సిరీస్‌లో భాగంగా బుర్జ్ ఖలీఫా ఎక్కినట్టు పేర్కొన్నాడు. 2,909 మెట్ల ద్వారా చివరి అంతస్తును చేరుకునే సరికి తన కార్డియో వర్క్అవుట్ పూర్తయిందని తెలిపాడు. 160 అంతస్తులు ఉన్న ఈ భవనం పెకి ఎక్కడానికి 51 నిమిషాలు పట్టిందట. బుర్జ్ ఖలీఫాలో ముందుకు సాగుతున్నప్పుడు చెమటలు పట్టి అలసిపోయాడు. 160వ అంతస్తు చేరుకున్నప్పుడు, అతను సాధించేది ఇంకా ఉందని అనుకున్నాడట. హార్నెస్, హెల్మెట్ కట్టుకుని నిచ్చెన ద్వారా శిఖరంపైకి ఎక్కాడు. శిఖరంపైకి చేరుకున్నాక 'భూమిపై మానవులు నిర్మించిన వాటిలో మనుషులు ఉండగల వ్యక్తిగత స్థానం' అని విల్ అభిప్రాయపడ్డాడు. అలాగే విల్ స్మిత్ యూట్యూబ్ సిరీస్ గ్రామీ అవార్డ్ గెలుచుకున్న నటుడు ఫిట్నెస్, ఆరోగ్యం ప్రయాణంపై ఉంటుందట. 'బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్' మొదటి రెండు ఎపిసోడ్లు నవంబర్ 8న విడుదలయ్యాయి. మిగిలిన 4 ఎపిసోడ్లు విల్ స్మిత్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రతిరోజు ప్రదర్శితమవుతాయి. -
మాటల్లో వర్ణించలేని అనుభూతి: లెజెండరీ నటుడు
అప్పుడు రీల్ లైఫ్‌లో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది!. అందుకే ఆ పెద్దాయన భావోద్వేగానికి గురయ్యారు. 11 నిమిషాల అంతరిక్షయానాన్ని తన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే అనుభవమని వ్యాఖ్యానించారు. కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్ సహా నలుగురు బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. తద్వారా తొంభై ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడాయన. జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌ఏజెన్సీ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయాణ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. నటుడు విలియమ్ షాట్నర్తో పాటు బ్లూ ఆరిజిన్ ఎగ్జిక్యూటివ్ ఆడ్రే పవర్స్, ప్లాంట్ లాబ్స్ కో ఫౌండర్ క్రిస్ బోషుజెన్, మెడిడేటా సొల్యూషన్కు చెందిన గ్లోన్ డె వ్రైస్ 11 నిమిషాల అంతరిక్ష యానంలో పాల్గొన్నారు. ‘‘ఇదొక అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేను. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంతో అందంగా కనిపించింది. అదేటైంలో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” ఎమోషనల్ అయ్యారు షాట్నర్. పశ్చిమ టెక్సాస్ నుంచి అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.49నిమిషాల సమయంలో బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్(ఎన్ఎస్-18) నింగిలోకి ఎగిసింది. దాదాపు 66 మైళ్ల ఎత్తులో అంతరిక్షంలో గడిపాక.. తిరిగి భూమ్మీదకు చేరుకుంది. ఇదిలా ఉంటే క్యాప్సూల్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్లను బయటకు ఆహ్వానించాడు జెఫ్ బెజోస్. అత్యంత వయస్కుడు 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్లో ఆయన నటన అమోఘం. అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది.. ఇప్పుడు 90 ఏళ్ల వయసున్న షాట్నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. వీరాభిమాని స్టార్ ట్రెక్కు వీరాభిమాని అయిన జెఫ్ బెజోస్.. తన తొమ్మిదేళ్ల వయసులో ఈ టీవీ సిరీస్ మీద గీసిన ఓ బొమ్మను అపురూపంగా దాచుకోవడం విశేషం. అంతేకాదు స్పేస్ డ్రామాలను ఇష్టపడే బెజోస్.. 2016 స్టార్ టెక్ బియాండ్‌లో ఏలియన్ రోల్లో తళుక్కున మెరిశాడు కూడా. ప్రస్తుత బ్లూ ఆరిజిన్ ప్రయోగం ద్వారా ఇప్పటిదాకా 600 మంది అంతరిక్షయానం పూర్తి చేసుకున్నట్లు అయ్యింది. ఈ ప్రయోగం(బ్లూ ఆరిజిన్ మొదటిది జులైలోనే పూర్తైంది) సక్సెస్ కావడంతో స్పేస్టూరిజంలో బలమైన పోటీ ఇవ్వనుందనే సంకేతాలు పంపింది బ్లూ ఆరిజిన్. చదవండి: దేశీ స్పేస్ పోటీ.. ఆసక్తికరం -
ఆ హీరోయిన్ అంటే క్రష్, కానీ నరకం కనిపించింది: హాలీవుడ్ స్టార్
టాప్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్‌తో పని చేయడం నరకమని చెప్తున్నాడు హాలీవుడ్ స్టార్ జేక్ గైలెన్హల్. వీరిద్దరూ 2002లో వచ్చిన 'ద గుడ్ గర్ల్' అనే సినిమాలో కలిసి నటించారు. తాజాగా హోవార్డ్ స్టెర్న్ షోకు హాజరైన జేక్ ఆనాటి సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జెన్నిఫర్‌తో కలిసి పని చేయడం టార్చర్ అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆమె అంటే ఎంతో ఇష్టం ఉన్న అతడికి తనతో లవ్ సీన్లలో నటించడం కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉండేదన్నాడు. పైగా సెట్స్‌లో 30 నుంచి 50 మంది వరకు మనల్ని చూస్తున్నప్పుడు ప్రేమ సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా ఉండేదని తెలిపాడు. అయితే అప్పుడు పిల్లో టెక్నిక్‌తో కొన్ని అభ్యంతరకరమైన సీన్లను ఎలాగోలా షూట్ చేశామని పేర్కొన్నాడు. మా ఇద్దరి మధ్యలో దిండు పెట్టాలన్న ఐడియా కూడా జెన్నిఫర్దేనంటూ ఆమెకే క్రెడిట్ ఇచ్చాడు. కాగా జేక్.. జెన్నిఫర్ అంటే క్రష్ ఉందన్న విషయాన్ని 2016లో బయటపెట్టాడు. కొన్నేళ్లపాటు ఆమెను క్రష్‌గా ఆరాధించడమే కాక ఆమెతో కలిసి పనిచేసే అవకాశాన్ని కూడా కొట్టేశాడు. ఇదిలా వుంటే జెన్నిఫర్ ఆనిస్టన్.. 2000వ సంవత్సరంలో నటుడు బ్రాడ్ పిట్‌ను పెళ్లాడింది. 2005లో అతడికి విడాకులిచ్చేసిన అనంతరం జస్టిన్ థెరూక్స్తో కొత్త జీవితాన్ని ఆరంభించింది. అయితే ఆమె గతంలో సంగీతకరారుడు జాన్ మేయర్, నటుడు విన్స్ వేగన్తో కూడా డేటింగ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. -
అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రష్యా చిత్ర బృందం అక్టోబర్ 5 న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు అంతరిక్ష యాత్రకు సిధ్దమయ్యాడు. స్పేస్ టూరిజం పరుగులు..! పలు అంతరిక్ష సంస్థలు బ్లూ ఆరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రెండో అంతరిక్ష యాత్రను త్వరలోనే చేపట్టనుంది. ఈ యాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియమ్ షట్నర్ పాలుపంచుకొనున్నాడు. విలియమ్ షట్నర్ స్పందిస్తూ..ఈ అంతరిక్ష యాత్ర పట్ల ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. అంతేస్థాయిలో కొంచెం భయం కూడా వేస్తోందని విలియమ్ షట్నర్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష యాత్ర అక్టోబర్ 12 న జరగనుంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. స్టార్ ట్రెక్ సినిమాతో ఫేమస్...! స్టార్ ట్రెక్ సినిమాలో కెప్టెన్ జేమ్స్ టి. కిర్క్ పాత్రను విలియమ్ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్ ట్రెక్ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. విలియమ్ షట్నర్ సినిమాలో పొందిన అనుభూతిని ఇప్పుడు నిజజీవితంలో అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాడు. అతి పెద్ద వయస్కుడిగా రికార్డు...! ఒకవేళ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ప్రయోగం విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్ షట్నర్ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్ షట్నర్ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. We can’t wait for your mission to space on #NewShepard @williamshatner. See you at Launch Site One. https://t.co/4MLt2yaKh4 — Blue Origin (@blueorigin) October 5, 2021 చదవండి: ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..! -
సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ముంబైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాంలో శుక్రవారం దాడులు చేసినట్టుగా ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోనూ సూద్‌కు చెందిన మరిన్ని నివాసాలపై వరసగా మూడో రోజు దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలిపాయి. రియల్ ఎస్టేట్‌కు చెందిన ఒక ఒప్పందం, మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు వివరించాయి. కరోనా సంక్షోభ సమయంలో వలసదారుల్ని తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చడంలో ఎంతో సాయం చేసిన సోనూ సూద్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనపై ఐటీ శాఖ చేస్తున్న దాడులకి రాజకీయ పరమైన కారణాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
విషాదం: డ్రగ్స్ మధ్యలో నటుడి మృతదేహం
Michael K. Williams Death News: డ్రగ్స్ మత్తు మరో మంచి నటుడిని బలి తీసుకుంది!. హాలీవుడ్ సీనియర్ నటుడు మికాయిల్ కెన్నెత్ విలియమ్స్(54) డ్రగ్స్‌కు బానిసై కన్నుమూశాడు. హెచ్‌బీవో బ్లాక్‌బస్టర్ డ్రామా ‘ది వైర్’లో ఒమర్ లిటిల్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు మికాయిల్ కె విలియమ్స్. బ్రూక్లిన్‌లోని అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన మృతిని.. సోమవారం మధ్యాహ్నం పోలీసులు ప్రకటించారు. దశాబ్దాలుగా టీవీ ఆడియొన్స్‌ను అలరించిన మికాయిల్ కె విలియమ్స్.. ఐదుసార్లు ప్రైమ్‌టైం ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2021లోనూ ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’కి ఎమ్మీ నామినేషన్ దక్కించుకున్నారాయన. రెండురోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దగ్గరి బంధువు ఒకరు సోమవారం మైకేల్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. అక్కడ డ్రగ్స్ ప్యాకెట్స్ మధ్య విలియమ్స్ మృతదేహాంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు ఆ బంధువు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మికాయిల్ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్దారణ అయ్యింది. డ్రగ్స్ నుంచి బయటపడలేక.. ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తో ఆడియొన్స్‌కు బాగా గుర్తుండిపోయిన మికాయిల్ కె విలియమ్స్.. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్నారు. అయితే కొన్ని నెలలుగా ఆయన డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ అలవాటు గురించి ప్రస్తావించి.. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారాయన. బుల్లెట్లో మికాయిల్(కుడి చివర) 1966 నవంబర్‌లో బ్రూక్లిన్‌లో పుట్టిన మికాయిల్ విలియమ్స్.. 22 ఏళ్లకు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. సుమారు 50కిపైగా మ్యూజిక్ వీడియోలు చేశారు. 1996లో ‘బుల్లెట్’ మూవీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపైనా రాణించారు. మార్టిన్ స్కొర్సెజే డైరెక్షన్‌లోనూ.. ‘చాకీ, బ్రాడ్‌వాక్ ఎంపైర్, బెస్సీ, 12 ఇయర్స్ ఏ స్లేవ్’ లాంటి సినిమాల్లో నటనతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారాయన. అయితే మికాయిల్కు గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు దక్కింది మాత్రం ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తోనే. చదవండి: అబ్బాయి నుంచి అమ్మాయిగా.. -
నాలుగేళ్లుగా డేటింగ్: పెళ్లి జరగదంటున్న నటుడు
'ఫ్రెండ్స్: ద రీయూనియన్' స్టార్ మాథ్యూ పెర్రీ తన ప్రేయసి మోలీ హర్విట్జ్తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవని, అందులో ఈ పెళ్లి కూడా ఒకటని పేర్కొన్నాడు. మోలీకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 51 ఏళ్ల వయసున్న నటుడు ఈ మధ్యే వచ్చిన 'ఫ్రెండ్స్: ద రీయూనియన్' వెబ్‌సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతడు 2018 నుంచి 29 ఏళ్ల మోలీతో డేటింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో 2019లో వీళ్లిద్దరూ హాలీడేస్‌ను బాగా ఎంజాయ్ చేశారు. తను మోలీని పెళ్లి చేసుకోబోతున్నానని, త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు గతేడాది నవంబర్‌లో మీడియాకు వెల్లడించాడు. కానీ అంతలోనే నిశ్చితార్థం జరగడం లేదని చెప్తూ అభిమానులకు షాకిచ్చాడు. కాగా మాథ్యూ గతంలో లిజ్జీ కాప్లాన్‌తో ఆరేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2012లో విడిపోయారు. చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో! -
బ్రెయిన్ ట్యూమర్‌తో హ్యారీపోటర్ నటుడి మృతి
హాలీవుడ్ నటుడు పాల్ రిట్టర్(54) కన్నుమూశారు. బ్రెయన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను తెలియజేయడానికి చింతిస్తున్నామని కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. అతడి మరణవార్త తెలిసిన హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "పాల్ అద్భుతమైన మనిషి. అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు. నాతో కలిసి పని చేసిన వారిలో అతడు గ్రేట్ నటుడు. ఆయన మన మధ్య లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను" అని ఫ్రైడే నైట్ డిన్నర్ రచయిత రాబర్ట్ పాపర్ ట్వీట్ చేశారు. పాల్ రిట్టర్ 1992లో 'ద బిల్' చిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించారు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్, సన్ ఆఫ్ రాంబో, హ్యారీపోటర్, హాఫ్ బ్లడ్ ప్రిన్స్ వంటి పలు చిత్రాల్లో నటించారు. చెర్నోబిల్ సిరీస్‌లో తన అద్భుత నటనకుగానూ అభిమానుల ప్రశంసలు దక్కించుకున్నారు. 'ఫ్రైడే నైట్ డిన్నర్'లోనూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. చదవండి: పెళ్లికి ముందే గర్భవతినని చెప్పాలనుకున్నా: హీరోయిన్ లాస్య గ్రాండ్ పార్టీ: రచ్చ లేపిన బిగ్‌బాస్ కంటస్టెంట్లు -
'ఆ హీరో నాపై 4 గంటలపాటు అత్యాచారం చేశాడు'
హాలీవుడ్ నటుడు ఆర్మీ హ్యామర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నటుడు హ్యూమర్ తనను శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడని 24 ఏళ్ల ఎఫీ అనే మహిళ ఆరోపించింది. 2016లో ఫేస్బుక్ ద్వారా హ్యూమర్‌ని కలిసానని, అప్పటినుంచి తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24, 2017న నటుడు ఆర్మీ హ్యూమర్ లాస్ఏంజిల్స్లో తనపై నాలుగు గంటల పాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని, తన తలను పదేపదే గోడకు కొట్టేవాడని పేర్కొంది. దీంతో తల, ముఖానికి బలంగా గాయాలైనట్లు మహిళ ఆరోపించింది. వీటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు తెలిపింది. కాగా ఎఫీ ఆరోపణల్ని నటుడు ఆర్మీ హ్యూమర్ ఖండించారు. ఎఫీతో పాటు ఇంతకుముందున్న సెక్సువల్ పార్టనర్స్ అందరితోనూ తన రిలేషన్ మ్యూచవల్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగాయన్నాడు. డేటింగ్‌పై ముందుగానే చర్చించి,ఇరువురి ఏకాభిప్రాయం ఉన్నప్పుడే ముందుకు వెళ్లామని పేర్కొన్నాడు. అతను ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేడు : హ్యూమర్ మాజీ భార్య కాగా 2010 ట్విన్స్ అనే రోల్ పోషించినందుకు గానూ ఆర్మీ హ్యూమర్‌కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా 2013లో వచ్చిన లోస్ రేంజర్ సినిమాతో ఎంతో ప్రసిద్ధి చెందాడు. అయితే ఇటీవలి కాలంలో ఆర్మీ హ్యూహర్పై వస్తోన్న లైంగిక ఆరోపణలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరిలోనూ హ్యూమర్ తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అతనితో చేసిన చాటింగ్ సంబాషణల్ని బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. అయితే వీటిని ఖండించిన హ్యూమర్...ఇవి తనపై జరుగుతున్న ఆన్లైన్ దాడులని కొట్టిపారేశాడు. కాగా 2020 జూలైలో భార్య ఎలిజబెత్ చాంబర్స్‌తో హ్యూమర్‌కు విడాకులు అయిన సంగతి తెలిసిందే. తనను తాను కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్స్ హ్యామర్‌లో ఉన్నాయని, అందుకే తన నుంచి విడిపోతున్నట్లు అతని భార్య ప్రకటించింది. చదవండి : మత్తుమందు కలిపి నాతో తాగించారు : హీరోయిన్ నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ నటి -
హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ ప్లమ్మర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత క్రిస్టోఫర్ ప్లమ్మర్ (91) నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా, టీవీల్లో, సినిమా నటుడిగా సుమారు 70 ఏళ్లు నటుడిగానే కొనసాగారాయన. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ (1965) చిత్రం ద్వారా నటుడిగా పాపులారిటీ సంపాదించారు ప్లమ్మర్. ఆస్కార్ అవార్డు అందుకున్న పెద్ద వయస్కుడిగానూ ప్లమ్మర్ పేరు మీద ఓ రికార్డు ఉంది. 2012లో వచ్చిన ‘బిగినర్స్’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అందుకున్నారాయన. ఈ అవార్డు అందుకునేప్పటికి ప్లమ్మర్కి 82ఏళ్లు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఎంత పేరు తెచ్చిపెట్టినా లీడ్ రోల్స్‌లో నటించడానికి అంగీకరించలేదాయన. సహాయ పాత్రల్లోనే నటించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని పేర్కొనేవారు ప్లమ్మర్. షేక్స్పియర్ కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా ప్లమ్మరే నటించడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం ప్రకటించారు. -
నేను ‘గే’ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు
హాలీవుడ్ నటులు, దంపతులు ఎమ్మా పోర్ట్నర్, ఇలియట్ పేజ్ విడాకులు తీసుకోబోతున్నారు. మూడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు ఈ జంట వెల్లడించారు. మ్యాన్‌హట్టన్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశామన్నారు. ఈ సందర్భంగా పేజ్ మాట్లాడుతూ.. ‘‘ఎంతో సుదీర్ఘ ఆలోచనలు.. చర్చ తర్వాత మేం ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. మేం విడాకులు తీసుకుని విడివిడిగా బతకాలని నిర్ణయించుకున్నాం. కానీ మా మధ్య స్నేహం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అలానే కొనసాగుతాయి. మేం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాం’’ అంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏడాది పాటు డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు గోప్యంగా ఉంచిన ఈ విషయాన్ని తర్వాత వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక మూడేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. (విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్) ఇక పేజ్ 2014లోనే తాను గేనని ప్రకటించారు. తాజాగా పేజ్ తనను తాను ట్రాన్స్‌మ్యాన్‌గా అంగీకరించారు. గతేడాది డిసెంబర్లో తనను తాను ట్రాన్స్ మ్యాన్‌గా గుర్తించానని.. తనకు మద్దతుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన నమ్మశక్యం కాని వ్యక్తులందరికి కృతజ్ఞతలు. నేను ఎవరనేది గుర్తించాను. నన్ను నేను గొప్పగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నాకున్న ఈ ప్రేమ ఎంత గొప్పదో వ్యక్తపర్చడానికి మాటలు చాలవు’’ అంటూ పేజ్ పోస్ట్ చేశారు. ఈ సమయంలో ఎమ్మా పోర్టనర్ పేజ్‌కి మద్దతు తెలిపారు. ‘‘పేజ్ లాంటి వ్యక్తులు దేవుడిచ్చిన బహుమతి.. వారిని గౌరవించాలి.. వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదు’’ అంటూ సపోర్ట్ చేశారు. ఇలా ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే వారు విడాకులు తీసుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Emma Portner (@emmaportner) -
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు. బాండ్‌కి బ్రాండ్ సీన్ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది జేమ్స్ బాండ్ సిరీస్ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు సీన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అయితే ‘బాండ్ జేమ్స్ బాండ్’ అంటూ తెరపై సందడి చేసిన సీన్ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట. అయితే చివరికి రిస్క్ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. సూపర్ బాండ్ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్ నవలా రచయిత ఇయామ్ ఫ్లెమింగ్ మాత్రం ఈ పాత్రకు సీన్ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్ నో’ ప్రీమియర్స్ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట. బాండ్ అంటే చిరాకొచ్చింది బాండ్ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్గానే ఎక్కువగా పేరు రావడం సీన్ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్. బియాండ్ బాండ్ బాండ్ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘మేల్’, ‘ది మ్యాన్ హూ ఉడ్ బీ కింగ్’, ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది అన్‌టచబుల్స్’, ‘ది నేమ్ ఆఫ్ ది రోజ్’, ‘ఇండియన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ సినిమాల్లో సీన్ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు సీన్ కానరీ. రిటైర్మెంట్ 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్ అంటే జోక్ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్ బిల్లీ’ అనే యానిమేషన్ చిత్రంలో సర్ బిల్లీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం 1930 ఆగస్ట్ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్ కానరీ. తండ్రి లారీ డ్రైవర్. తల్లి క్లీనింగ్ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారు. మోడలింగ్ చేస్తూ, మిస్టర్ యూనివర్స్ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్ చేశారు. 1954లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్ బ్యాక్’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ మైక్లిన్ రోక్బ్రూన్ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్ కానరీ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంతంగా కన్నుమూశారు ఈ ఏడాది ఆగస్ట్ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్ తనయుడు జాసన్ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్’’ అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. సెక్స్ సింబల్ సీన్ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్’గా ఓటు వేయబడ్డారు సీన్. ‘స్కాంట్ల్యాండ్ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్’ మేగజీన్ అయితే ‘సెక్సియస్ట్ మేన్ ఎలైవ్’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్ మేన్’ అని బిరుదులు ఇచ్చింది. -
లాక్డౌన్లో వెడ్ లాక్
‘క్రేజీ స్టుపిడ్ లవ్, అమేజింగ్ స్పెడర్ మేన్, లా లా ల్యాండ్’ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. మూడేళ్లుగా నటుడు, రచయిత డేవ్ మెక్యారీ, ఎమ్మా డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్డౌన్ వల్ల గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారనే వార్త ఈ మధ్య ప్రచారంలోకొచ్చింది. దానికి కారణం ఈ జంట మ్యాచింగ్ రింగులు ధరించి కనిపించడమే. ప్రచారంలోకొచ్చిన వార్త నిజమే. ఈ ఇద్దరూ లాక్డౌన్లో వెడ్లాక్లోకి ఎంటరయ్యారు. -
అంతరిక్ష ప్రయాణం
రిస్క్ తీసుకోవడం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కి మహా సరదా. తన సినిమాలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తారు. అవసరమైతే ప్రయాణిస్తున్న విమానం మీద నిల్చుంటారు. ఎల్తైన కట్టడం బూర్జ్ ఖలీఫా మీద ఫైటింగ్స్ చేస్తారు. తాజాగా ఓ సినిమా చిత్రీకరణను ఏకంగా అంతరిక్షంలోనే చేయాలనుకుంటున్నారు. దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్‌తో యూనివర్శల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందుకోసం అక్టోబర్ 2021లో అంతరిక్ష యానం చేయనున్నారు టామ్ క్రూజ్. ఈ చిత్రదర్శకుడు డౌగ్ లిమన్తో కలసి ఈ ప్రయాణం చేయనున్నారు టామ్. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత
-
బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత
‘బ్లాక్ పాంథర్’ నటుడు చాడ్విక్ బోస్మాన్(43) కన్నుమూశారు. గత కొంతకాలంగా కోలన్(పెద్దపేగు) క్యాన్సర్‌తో పోరాడుతున్న బోస్‌మెన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అతని మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ‘నిజమైన పోరాట యోధుడు, చాడ్విక్ పట్టుదలతో మీరు ఎంతో ప్రేమించిన అనేక చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాడు. చాడ్విన్ ఇంట్లోనే మరణించాడు" అని చాడ్విక్ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా చాడ్విక్ నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ నటుడు 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. (సంచలన దర్శకుడి ఇంట విషాదం) బోస్మాన్ దక్షిణ కరోలినాలోని అండర్సన్లో పుట్టి పెరిగాడు. 2013లో లెజండరీ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్సన్ కథతో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘42’ తో సినిమాల్లో వచ్చాడు. 2016లో వచ్చిన కెప్టెన్ అమెరికా: సివిల్ వార్‌లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా కనిపించి అంనతరం బోస్‌మెన్ అతని ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్,ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌లోని మరో రెండు పాత్రలతో అభిమానులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్ చివరి సారిగా కనిపించారు. బోస్మాన్ చివరి సారిగా ఆగస్టు 12న ట్వీట్ చేశాడు. డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ నామినేషన్‌ను అభినందిస్తూ ఈ ట్వీట్ చేశాడు. (వివాదంలో ప్రముఖ కామెడీ షో) చదవండి : గుండె పగిలింది : కమలా హారిస్ -
అతను లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నా..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో కరోనా కారణంగా అసువులు బాశారు. వైరస్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివారం ఆయన శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. 41 యేళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో కరోనా బారిన పడ్డారు. దీంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో గత నెల అతని కుడికాలిలో రక్తం గడ్డం కట్టడంతో వైద్యులు ఆయన కాలును సైతం తీసేశారు. తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. కాగా అతనికి భార్య అమండ క్లూట్స్, ఏడాది వయసున్న ఎల్విస్ ఎడ్యుర్డో ఉన్నారు. ఆయన మరణాన్ని భార్య అమండ క్లూట్స్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. "దేవుడు ఉండే స్వర్గానికి మరొకరు చేరుకున్నారు. నా ప్రియమైన భర్త నేడు ఉదయం చనిపోయాడు. అతడు ఈ లోకాన్ని వదిలిపెట్టే ముందు కుటుంబం అంతా ఎంతగానో ప్రార్థనలు చేశాం. (కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి) ప్రతీరోజు మిస్ అవుతూనే ఉంటాం అయినప్పటికీ మమ్మల్ని వీడి వెళ్లిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. కుమిలిపోతున్నాను. అతను లేకుండా జీవితాన్ని ఊహించలేకపోతున్నా. అతను మాకు వెలుగును విరజిమ్మే ఓ కాంతి పుంజం. అతను ప్రతి ఒక్కరికీ ఆప్త మిత్రుడు. అందరికీ సాయం చేయడానికి, మనసారా మాట్లాడటానికి ఎంతో ఇష్టపడేవాడు. అతను గొప్ప నటుడు, సంగీతకారుడు. ఒక భర్తగా, తండ్రిగా నిక్ తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎల్విస్(కుమారుడు), నేను ప్రతీరోజు అతన్ని మిస్ అవుతూనే ఉంటాం" అని అమండ రాసుకొచ్చింది. కాగా కార్డిరో.. బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్వే, రాక్ ఆఫ్ ఏజెస్, వెయిట్రస్, ఎ బ్రాంక్స్ టేల్ వంటి పలు చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై వచ్చే బ్లూ బ్లడ్స్, లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, లిలీహ్యామర్ సిరీస్‌లోనూ కనిపించారు. (ఎందుకీ ఆత్మహత్యలు) -
నటుడు ఇయాన్ ఇకలేరు
ప్రముఖ ఇంగ్లీష్ నటుడు ఇయాన్ హోల్మ్ (88) మృతి చెందారు. ‘‘ఇయాన్ హోల్మ్గారు ఇక లేరని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు’’ అని హోల్మ్ మేనేజర్ పేర్కొన్నారు. ఇక ఇయాన్ సినిమాల విషయానికి వస్తే... ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ఏలియన్’, ‘కింగ్ లియర్’, ‘ది స్వీట్ హియర్ ఆఫ్టర్’, ‘డ్రీమ్ చైల్డ్’, ‘డ్యాన్స్ విత్ ఏ స్ట్రేంజర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు ఇయాన్. ‘ఛారియట్స్ ఆఫ్ ఫైర్’ చిత్రంలో ఇయాన్ నటన ఆయన్ను ఆస్కార్ అవార్డ్ (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీ)కు నామినేట్ చేసింది. ఇయాన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. -
ఫ్రెడ్ విలియార్డ్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఫ్రెడ్ విలియార్డ్ ఇటీవల మరణించారు. 86 ఏళ్ల ఫ్రెడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ‘రాత్రి నిద్రలోనే మా నాన్నగారు ప్రశాంతంగా కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులోనూ ఆయన చాలా చలాకీగా ఉన్నారు. ఆయన్ని మేమంతా మిస్ అవుతాం’’ అని పేర్కొన్నారు హాప్ విలియార్డ్. ఫ్రెడ్ మంచి కామెడీ యాక్టర్ గా పేరు పొందారు. ‘ఎవ్రీబడీ లవ్స్ రేమండ్, మోడ్రన్ ఫ్యామిలీ’’ వంటి టీవీ షోల ద్వారా పాపులారిటీ పొందారు ఫ్రెడ్. ‘వాల్ – ఈ, యాంకర్ మేన్, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ బ్లాక్’’ వంటి సినిమాల్లో నటించారాయన. ఫ్రెడ్ మరణం పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. -
హాలీవుడ్ నటుడు కన్నుమూత
గోల్డెన్ గ్లోబ్ విజేత, అలనాటి ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రేన్ డెన్నీ(81) బుధవారం తన స్వగృహంలో కన్నుమూశారు. కాగా అతను కరోనా వైరస్ వల్ల మరణించలేదని, సహజ మరణమేనని కుటుంబీకులు స్పష్టం చేశారు. తండ్రి మరణం తమకు తీరని లోటని అతని కూతురు ఎలిజబెత్ విచారం వ్యక్తం చేసింది. బ్రేన్ డెన్నీ 1938లో కనెక్టికట్‌లోని బ్రిడ్గ్పోర్ట్లో జన్మించాడు. పన్నెండు సంవత్సరాలకే యూఎస్ మెరైన్స్లో పనికి కుదిరాడు. అలా ఒకినావా ద్వీపంలో కొంతకాలం పనిచేసిన అనంతరం న్యూయార్క్‌కు పయనమయ్యాడు. అక్కడ మార్థా స్టీవర్ట్‌తో కలిసి స్టాక్‌బ్రోకర్‌గా పని చేశాడు. అదే సమయంలో సినిమాలవైపు అడుగులు వేశాడు. అక్కడ జెన్నిఫర్ అనే యువతిని వివాహం చేసుకోగా వీరికి కొడుకు కార్మాక్, కూతురు ఎలిజబెత్ సంతానం.(భిక్షగాడి సాయం తీసుకున్న స్పైడర్ మ్యాన్) అతను ఫస్ట్ బ్లడ్, రోమియో అండ్ జూలియట్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో విశేష ప్రేక్షకాదరణ పొందాడు. నాలుగు దశాబ్ధాల కెరీర్లో టీవీ షోలలోనూ కనిపించి అభిమానులకు వినోదాన్ని అందించాడు. 1985లో స్కిఫి- కాకూన్ సినిమాలో ఏలియన్స్ లీడర్‌గా కనిపించాడు. 1996లో వచ్చిన రోమియో జూలియట్ సినిమాలో రోమియో తండ్రిగా నటించాడు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కన్నా ముందుగా ప్రకటించే ప్రముఖ గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఆయన తన ఖాతాలో వేసుకున్నాడు. (గురి మారింది) -
కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి
లాస్ ఏంజిల్స్ : కరోనా మహమ్మారికి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. హాలీవుడ్ నటుడు అలెన్ గార్ఫిల్డ్(80) కరోనా సమస్యల కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అలెన్‌కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గొప్ప నటుడు, నాష్విల్లెలో నాకు భర్తగా నటించిన వ్యక్తి కరోనా వల్ల ఈ రోజు(మంగళవారం) మరణించారు. అతని కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అని ఫేస్బుక్లో రాశారు. (కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి) నాష్విల్లే, ది స్టంట్ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్ బాక్సర్‌గా, స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఇక అలెన్.. విలన్ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వూడీ అలెన్, విమ్ వెండర్స్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్ జాబులో కనిపించారు. ఈ సినిమా 1986లో రూపొందించారు. (నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం? ) -
16 ఏళ్ల వయసులో నటుడి హఠాన్మరణం
వాషింగ్టన్: అమెరికన్ సూపర్‌హీరో టెలివిజన్ సిరీస్ ‘ది ష్లాష్’ నటుడు లాగాన్ విలియమ్స్ హఠాన్మరణం చెందాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ధ్రువీకరించారు. అదే విధంగా విలియమ్స్ ఏజెంట్ మిచెల్లీ గౌవిన్ ఇందుకు సంబంధించిన ప్రకటన గురువారం విడుదల చేశారు. విలియమ్స్ ఆకస్మిక మృతి తమను వేదనకు గురిచేసిందన్నారు. అయితే అతడి మరణానికి గల కారణాలు ఆమె వెల్లడించలేదు. కాగా ది ఫ్లాష్‌లో చిన్నారి బ్యారీ అలెన్‌గా మెప్పించిన విలియమ్స్ 16 ఏళ్ల వయస్సులోనే కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక విలియమ్స్ సహ నటులు కూడా అతడితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... నివాళులు అర్పిస్తున్నారు. ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. కాగా పదేళ్ల వయస్సులోనే నటనా జీవితం ప్రారంభించిన అనేక టీవీ షోల్లో నటించాడు. View this post on Instagram Just hearing the devastating news that Logan Williams has passed away suddenly. This picture was early in the filming of The Flash pilot episode back in 2014. I was so impressed by not only Logan’s talent but his professionalism on set. My thoughts and prayers will be with him and his family during what is I’m sure an unimaginably difficult time for them. Please keep Logan and his family in your thoughts and prayers during what has been a strange and trying time for us all. Sending love to everyone. ❤️ A post shared by Grant Gustin (@grantgust) on Apr 3, 2020 at 1:16pm PDT -
‘స్టార్ వార్స్’ నటుడు కరోనాతో మృతి
కరోనాతో మరో హాలీవుడ్ నటుడు మరణించారు. ఇటీవలే మార్క్ బ్లమ్ అనే నటుడు కరోనా సోకి మరణించారు. తాజాగా ‘స్టార్ వార్స్’ ఫేమ్ ఆండ్రూ జాక్ (76) కూడా కోవిడ్ –19 కారణంగానే చనిపోయారు. కరోనా పాజిటివ్ అని తేలిన రెండు రోజుల్లోనే ఆండ్రూ మరణించారని సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారాయన. ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘లార్డ్ అఫ్ ది రింగ్స్’, ‘థార్’ తదితర సినిమాల్లో నటించారాయన. -
మార్క్ బ్లమ్ ఇక లేరు
‘డెస్పరేట్లీ సీకింగ్ సుసాన్’, ‘క్రోకోడైల్ డూండీ’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ (69) ఇక లేరు. కరోనా వైరస్ సోకి, ఆయన ఆస్పత్రిలో చేరారు. వైరస్ కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల మార్క్ చనిపోయారని స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెబెక్కా డామన్ పేర్కొన్నారు. టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న మార్క్ మరణం తీరని లోటు అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు. -
మహమ్మారి కలకలం: హాలీవుడ్ నటుడు మృతి
వాషింగ్టన్: ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో దేశాధినేతలు, సెలబ్రిటీలూ బెంబేలెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ (69) కరోనా వైరస్ కాంప్లికేషన్స్తో మరణించారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. క్రొకడైల్ డూండీ, డెస్పరేట్లీ సీకింగ్ సుశాన్ వంటి మూవీలతో పాటు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘యూ’తో మార్క్ బ్లమ్ విశేష ప్రాచుర్యం పొందారు. తన భర్త కోవిడ్-19 లక్షణాలతో న్యూయార్క్ ప్రిబిటేరియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని బ్లమ్ భార్య జనిత్ జరిష్ ధ్రువీకరించారు. అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించిన బ్లమ్ 1970లో థియేటర్, టీవీ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1983లో లవ్సిక్ మూవీతో హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అమెజాన్ సిరీస్ మోజర్ట్ ఇన్ ది జంగిల్లో బ్లమ్ యూనియన్ బాబ్గా నటించగా, నెట్‌ఫ్లిక్స్ డ్రామా యూలో మూనీగా తన నటనతో ప్రేక్షకులను ఆయన విశేషంగా ఆకట్టుకున్నారు. చదవండి : కరోనాకు బలైన మరో పిన్న వయస్కురాలు -
‘నగ్న సీన్ల కోసం నా పై ఒత్తిడి చేశారు’
రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులకు సంబంధించి 2016లో బీబీసీ నెట్వర్క్ కోసం తీసిన ‘క్లోజ్ టు ది ఎనిమీ’ మినీ సిరీస్ షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ పొలియాకాఫ్ తనపై నగ్న సీన్ల చిత్రీకరణ కోసం ఒత్తిడి చేశారని 34 ఏళ్ల ఎమిలియా క్లార్క్ ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకుండా సిరీస్ నుంచి తప్పుకున్నానని తాజా హాలీవుడ్ చిత్రం ‘హ్యూమన్’లో హీరోయిన్గా నటించిన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సిరీస్‌కు రచయిత, దర్శకుడు స్టీఫెన్ పొలియాకాఫే. ఆయనకిప్పుడు 67 ఏళ్లు. ‘క్లోజ్ టు ది ఎనిమీ’ సిరీస్ నుంచి తప్పుకున్న ఆమె ‘సన్స్ ఆఫ్ లిబర్టీ’లో నటించారు. అది హిట్ కాకపోవడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. అయితే ఎమిలియా చేసిన ఆరోపణలను ‘బాఫ్టా’ అవార్డు గ్రహీత స్టీఫెన్ ఖండించారు. ఆమె ప్రస్తుతం ఉన్న స్థితికి చింతిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.‘నగ్న సీన్ల కోసం ఎంతసేపు బట్టలు లేకుండా ఉండాలి. ఏ పార్టులో బట్టలు లేకుండా ఉండాలి. నాపై లైట్ ఫోకస్ ఎలా ఉంటుంది?’ అని తానడగడంతో దర్శకుడికి కోపం వచ్చిందని, తాను ఏది ఎలా తీయదల్చుకుంటే అలాగే తీస్తానంటూ గొడవ చేశారని ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు. ఈ విషయమై పత్రిక స్టీఫెన్ వివరణ కోరగా ‘ఎమిలియా క్లార్క్ ప్రస్తుతమున్న స్థితికి నేను చింతిస్తున్నాను. ఆ రోజులో ఏం జరిగిందనేది వరుసగా నేను గుర్తు చేయదల్చుకోలేదు. వాస్తవానికి సినిమా షూటింగ్‌కు ముందే ఆమె పాత్ర గురించి మా మధ్య చర్చకు వచ్చింది. మగ వాళ్లయినా, ఆడవాళ్లయినా నగ్నంగా నటించాలంటే ఎంత బాధ పడతారో, ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. వారిని అలా నేను బాధ పెట్టను. నాది సున్నితమైన మనసు’ అని ఆయన వివరణ ఇచ్చారు. ‘మీటూ’ ఉద్యమం కింద ఎంతోమంది హాలీవుడ్ తారలు దర్శక, నిర్మాతలపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సెక్స్ సీన్లలో నటించడం ఇష్టం లేక తాను కూడా ఓ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గత డిసెంబర్ నెలలో బ్రిటీష్ తార రుత్ విల్సన్ ప్రకటించారు. -
ఆ హీరోను సోషల్ మీడియాలో చాలాసార్లు చంపేశారు!
ప్రముఖ హాలీవుడ్ నటుడు, మాజీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ డ్వేన్ జాన్సన్ మరణించారనే పుకార్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. దీంతో మరోసారి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్ర నిర్మాత డ్వేన్ బాధితుడిగా మారారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని కన్నుమూశారనే వార్తలు రావడం సినీ ఇండస్ట్రీలో కొత్తేమి కాదు, గతంలోనూ చాలా సార్లు అలా జరిగింది. డ్వేన్ 'ది రాక్' జాన్సన్ ఘోరంగా విఫలమైన స్టంట్ కారణంగా మరణించాడని బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రముఖ మీడియా సంస్థ అయిన బీబీసీ (బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) న్యూస్ లోగోను ఉపయోగించుకుని..యూట్యూబ్‌తో సహా పలు సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు. 'బీబీసీ: డ్వేన్ 'ది రాక్' జాన్సన్ 47 ఏళ్ల వయసులో స్టంట్ విఫలమైన కారణంగా అకాల మరణం చెందారని' ఒక వీడియోను పోస్ట్ చేశారు. బీబీసీ ప్రామాణికమైన వార్తా సంస్థ కావడంతో.. చాలామంది ప్రజలు, డ్వేన్ అభిమానులు ఈ వార్తను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొంతమంది ట్విటర్ మాధ్యమంగా డ్వేన్ అభిమానులు.. మరణించారనే వార్తను ధృవీకరించమని కోరారు. మరణించారనే తప్పుడు వార్తలపై స్పందించని డ్వేన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. దీంతో డ్వేన్ ప్రాణాలతో ఉన్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. జాన్సన్ మరణించాడని వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2011లో ఫేస్బుక్లో ఈ మాజీ వరల్డ్ రెజ్లింగ్ మెగా స్టార్ చనిపోయారంటూ పుకార్లు వచ్చాయి. అలానే 2014లో కూడా ఇదే విధమైన చేదు అనుభవం ఎదురైంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్7 చిత్ర షూటింగ్ సమయంలో ఒక స్టంట్ చేసే ప్రయత్నంలో నటుడు డ్వేన్ మరణించారనే అసత్య ప్రచారం జరిగింది. View this post on Instagram The Man in Black ⚡️ Like most kids growing up, I dreamed about being a superhero. Having cool superpowers, fighting for what’s right and always protecting the people. It all changed for me, when I was 10yrs old and was first introduced to the greatest superhero of all time - SUPERMAN. As a kid, Superman was the hero I always wanted to be. But, a few years into my fantasy, I realized that Superman was the hero, I could never be. I was too rebellious. Too rambunctious. Too resistant to convention and authority. Despite my troubles, I was still a good kid with a good heart - I just liked to do things my way. Now, years later as a man, with the same DNA I had as a kid - my superhero dreams have come true. I’m honored to join the iconic #DCUniverse and it’s a true pleasure to become, BLACK ADAM. BLACK ADAM is blessed by magic with the powers equal to SUPERMAN, but the difference is he doesn’t toe the mark or walk the line. He’s a rebellious, one of a kind superhero, who’ll always do what’s right for the people - but he does it his way. Truth and justice - the BLACK ADAM way. This role is unlike any other I’ve ever played in my career and I’m grateful to the bone we’ll all go on this journey together. BLACK ADAM 12.22.21 ⚡️ Huge thank you to my friends, @jimlee and @bosslogic for this first time ever bad ass collaboration. A post shared by therock (@therock) on Nov 14, 2019 at 9:06am PST కాగా డ్వేన్ ప్రస్తుతం నటిస్తున్న 'బ్లాక్ ఆడమ్' అనే చిత్రం 2021లో క్రిస్మస్ పండుగకు విడుదల కానుంది. ఇందులో తన పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని, ఎల్లప్పుడు యాక్షన్ సీన్స్ చేసే తాను.. ఈ చిత్రంలో అందుకు భిన్నంగా ఓ వైవిధ్యభరితమైన పాత్రలో నటించానని తెలుపుతూ.. బ్లాక్ ఆడమ్‌కు సంబంధించిన ఒక పోస్టర్‌ను డ్వేన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. -
నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!
పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర రక్షణ ఉంటుంది. కానీ కొందరి విషయంలో తల్లిదండ్రులే విలన్లు అవుతారు. హాలీవుడ్ నటి డెమీ మూర్ జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనకు ఆమె తల్లే కారణమయ్యారు. ఓ చాట్ షోలో ఆమె ఈ విషయం గురించి చెప్పారు. ‘‘నా టీనేజ్‌లో ఓ వ్యక్తి నాపై అత్యాచారం జరిపాడు. ఆ భయంకరమైన సంఘటనను నేనెప్పటికీ మరచిపోలేను. కూతురిపై అత్యాచారం జరగడానికి తల్లే కారణం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అంటూ ఆ షోలో భావోద్వేగానికి గురయ్యారు డెమీ మూర్. ఇంకా మాట్లాడుతూ – ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి నా పై అత్యాచారం జరిపాడు. దానికి కారణం మా అమ్మే. మద్యం కోసం అతని దగ్గర మా అమ్మ 500 డాలర్లు తీసుకుని, నన్ను బలి చేసింది. అయితే ఎక్కడో ఒక మూల మా అమ్మ ఈ నిర్ణయం తీసుకుని ఉండదనే ఫీలింగ్ ఉంది. నేరుగా ఈ ఒప్పందం జరిగి ఉండదని అనుకుంటున్నాను. అయితే ఈ సంఘటనకు దారి ఇచ్చింది తనే కదా. ఒక క్రూరమైన వ్యక్తికి నన్ను అప్పగించింది. ఆ వ్యక్తి మా అమ్మ చేసిన మోసం గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అలా నా బాల్యం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది’’ అని బాధపడ్డారు డెమీ. ‘‘టీనేజ్లోనే నేను ఇంటి నుంచి బయటికు వచ్చేశాను. చేతిలో చిల్లిగవ్వ లేదు. హాలీవుడ్లో సినిమా కెరీర్ మొదలుపెట్టాలనుకున్నాను. కానీ అనుభవం లేదు. అయితే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఆ ధైర్యంతోనే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. ‘జనరల్ హాస్పిటల్’ అనే టీవీ సిరీస్ నా జీవితానికి మంచి మలుపు అయింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా సినిమాల్లో బిజీ అయ్యాను. నా ధైర్యం, ప్రతిభ, కష్టపడే తత్వం నన్ను స్టార్‌ని చేశాయి’’ అని డెమీ తెలిపారు. -
రండి రండి.. దయ చేయండి
ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో మన దక్షిణాది చిత్రాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, సునీల్‌శెట్టి, వివేక్ ఒబెరాయ్.. వంటì నటులు మన సౌత్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు హాలీవుడ్ నటులు వస్తున్నారు. అనుష్క, మాధవన్, షాలినీ పాండే, అంజలి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మరో హాలీవుడ్ స్టార్ జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ‘బ్రేవ్ హార్ట్, ట్రాయ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు జేమ్స్ కాస్మో. ఆల్రెడీ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సౌత్ సినిమాలకు పని చేస్తున్న తరుణంలో ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ మన దక్షిణాది సినిమాలపై ఆసక్తి చూపించడం విశేషం. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని శశికాంత్, రామచంద్ర నిర్మిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు
ప్రముఖ హాలీవుడ్ హీరో, హాస్యనటుడు కెవిన్ హార్ట్(40) ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కెవిన్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని స్నేహితులు బ్లాక్, ఇంటర్నెట్ ఫిట్నెస్ మోడల్ ,బ్లాక్ ఫియాన్సీ రెబెక్కా కూడా తీవ్రంగా గాయపడ్డారు. వేరే వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. వాహనాన్ని నడుపుతున్న జేర్డ్ బ్యాక్(28) బ్లాక్ నియంత్రణ కోల్పోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి పక్కనే వున్న గోతిలోకి పడిపోయింది. దీంతో కెవిన్‌తోపాటు, బ్లాక్‌కు నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా..హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీనిపరిశీలించిన అధికారులు ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కాగా ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ మూవీలో జుమాన్జీ పాత్రలో కెవిన్ మెప్పించారు. 2019 ఆస్కార్ పండుగకు కెవిన్ హోస్ట్‌గా వ్యవహరించాల్సి వుంది కానీ స్వలింగ సంపర్కానికి సంబంధించిన ఆయన పాత ట్వీట్లు వెలుగులోకి రావడంతో ఆయన్ను తప్పించారు. -
మహేశ్... ఓ స్పై సినిమా చేద్దాం
సౌత్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఓ ఇంటర్నేషనల్ స్పై మూవీ చేయాలనే ఆలోచన ఉందని ట్వీటర్ వేదికగా చెప్పారు హాలీవుడ్ స్టార్ యాక్టర్ విలియమ్ హెన్రీ డ్యూక్. అమెరికన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ డ్యూక్ ‘యాక్షన్ జాక్సన్’ (1988), ‘నెవర్ ఎగైన్’ (2001), ‘మాండీ’ (2018) సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు తనకు మహేశ్‌తో సినిమా చేయాలని ఉందంటున్నారు. ‘‘మురుగదాస్, మహేశ్ మీరు లాస్ ఏంజిల్స్ వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్ లాస్ఏంజెల్స్)లో దిగి లంచ్‌కి రండి. ఇంటర్నేషనల్ స్పై సినిమా గురించి చర్చించుకుందాం. వంశీ పైడిపల్లి, మహేశ్ మీరు లాస్ ఏంజిల్స్ వచ్చినప్పుడు లంచ్‌కి వస్తే, ఇంటర్నేషనల్ స్పై మూవీ గురించి చర్చించుకుందాం’’ అని మరో ట్వీట్ చేశారు డ్యూక్. అలాగే మహిళల అక్షరాస్యత గురించి మాట్లాడుకుందామని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ఉద్దేశించి ట్వీట్ చేశారు డ్యూక్. ఐశ్వర్యను 2016లో ‘ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్’గా ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఎంపిక చేశారు. -
మ్యాడసన్ @ సైలెన్స్
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ముఖ్య తారలుగా హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘సైలెన్స్’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘కిల్ బిల్, హేట్‌ఫుల్ ఎయిట్, రిసర్వోయర్ డాగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు మ్యాడసన్. ‘‘టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. ఓ వినూత్నమైన సినిమాను చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాం. యూఎస్ఏలోని సీయోటల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిత్రీకరణ జరపబోతున్నాం. ఈ సినిమా టీజర్‌ను మేలో యు.ఎస్.ఏలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గమ్మత్తయిన కోచ్
ఏదైనా సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా డ్యాన్సింగ్‌కో, కొత్త భాష నేర్చుకోవడానికో నటీనటులు ట్రైనర్స్‌ని పెట్టుకుంటారు. అయితే హాలీవుడ్ యాక్టర్ నికొలస్ కేజ్ మాత్రం తాగడం కోసం ఓ కోచ్‌ను పెట్టుకున్నారు. ‘లీవింగ్ లాస్‌వేగాస్’ అనే చిత్రంలో మద్యానికి బానిసైన రచయితగా నికొలస్ నటించాలి. ఆ పాత్ర కోసం డ్రింకింగ్ కోచ్‌ని పెట్టుకోవల్సి వచ్చింది. సినిమా షూటింగ్ చేసే రోజులన్నీ అతన్ని సెట్లోనే ఉండమని, అతని ఆహార్యాన్ని గమనిస్తూ ఈ సినిమాను పూర్తి చేశారట. ఈ విషయాన్ని ఇటీవల నికొలస్ తెలిపారు. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా కేజ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు. అన్నట్లు.. నికొలస్‌కు మద్యం అలవాటు లేక కోచ్‌ని పెట్టుకున్నారను కుంటున్నారా? అదేం లేదు. అయితే బానిస అయిన వ్యక్తిగా నటించాలి కదా.. అందుకే. -
మోసానికి గురైన జేమ్స్ బాండ్ నటుడు
న్యూఢిల్లీ : పాన్ బహార్ ప్రకటనలో మెరిసిన, హాలీవుడ్ జేమ్స్ బాండ్ నటుడు పీర్స్ బ్రోస్నన్ ఆ కంపెనీపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. పాన్ మసాలా బ్రాండు తనను మోసం చేసిందని ఆరోపించాడు. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టి పాన్ మసాల బ్రాండు ఈ మోసానికి పాల్పడిందన్నాడు. ఢిల్లీ స్టేట్ టుబాకో కంట్రోల్ సెల్‌కు రాసిన లేఖలో.. ‘కంపెనీ నన్ను మోసం చేసింది. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని వెల్లడించలేదు. అంతేకాక ప్రకటన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను బహిర్గతం చేయలేదు’ అని పేర్కొన్నట్టు అదనపు డైరెక్టర్(హెల్త్) ఎస్కే అరోరా చెప్పారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం బ్రోస్నన్కు షోకాజు నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఈ లీగల్ నోటీసుకు స్పందించిన బ్రోస్నన్, కంపెనీతో తనకున్న ఒప్పందం ఎప్పుడో పూర్తయిందని, డిపార్ట్మెంట్కు అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బ్రోస్నన్ తెలిపారు. భవిష్యత్తులో హాని కలిగించే ఎలాంటి ఉత్పత్తుల కంపెనీలకు తాను సహకరించనని బ్రోస్నన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్టు అరోరా పేర్కొన్నారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద నిషేధించబడిన టుబాకో ఉత్పత్తుల ప్రకటనలకు సహకరించవద్దని సెలబ్రిటీలకు, మాస్ మీడియాకు అధికారులు ఆదేశించారు. సామాజిక బాధ్యతను సెలబ్రిటీలు తప్పక తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత వారిని సెలబ్రిటీలను దేవుడిలా భావించి, గుడ్డిగా అనుకరించకూడదని సూచించారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద టుబాకో ఉత్పత్తుల అన్ని ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటుడి సంచలన ట్వీట్
లండన్ : నటుడు బిల్లీ బాల్డ్విన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పార్టీలో ట్రంప్ తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో అతన్ని తన భార్య గెంటేసిందని బెల్లీ తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ అల్ ఫ్రాంకెన్పై లైంగిక ఆరోపణలు రాగా.. ట్రంప్ కొడుకు ట్విట్టర్లో తీవ్రంగా స్పందించాడు. ఆ వెంటనే బిల్లీ దానికి రీ-ట్వీట్ చేయటం విశేషం. మన్‌హట్టన్ హోటల్లో సుమారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ బిల్లీ సందేశం ఉంచాడు. ‘లైంగిక దాడులలో మీ నాన్నకు(ట్రంప్‌ను ఉద్దేశించి) బ్లాక్ బెల్ట్ ఇవ్వొచ్చు. ప్లాజా హోటల్లో ఓసారి నేను ఇచ్చిన పార్టీకి పిలవకపోయినా మీ నాన్న వచ్చాడు. నా భార్యతో లైంగికంగా ప్రవర్తించాడు. తన హెలికాప్టర్లో అట్లాంటాకు రావాలంటు పిలిచాడు.. అంటూ మరింత సమాచారంతో ఓ ట్వీట్ చేశాడు. 54 ఏళ్ల బిల్లీ చైన్నా ఫిలిప్స్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ట్రంప్‌తో స్నేహంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఎందుకనో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. అధ్యక్ష ఎన్నిక ప్రచారం నుంచే బిల్లీ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇక బిల్లీ సోదరుడు, నటుడు అయిన అలెక్ బాల్డ్విన్ కూడా ట్రంప్ మీద ఓ సెటైరిక్ టీవీ షో నిర్వహిస్తున్నాడు. Your Dad is a 5th degree black belt when it comes to sexual impropriety allegations. In fact… I once had a party at the Plaza Hotel… your father showed up uninvited & hit on my wife… invited her on his helicopter to Atlantic City. She showed his fat ass the door.#TrumpRussia https://t.co/A8BInetbbZ — Billy Baldwin (@BillyBaldwin) November 23, 2017 -
వైరల్.. నటుడిపై పోలీస్ కాల్పులు.!
సాక్షి : మనం చూసే కళ్లు కూడా ఒక్కొసారి మనల్ని మోసం చేస్తాయి. అలాంటి సంఘటన ఒకటి అమెరికాలోని ఇండియానాలో చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి ఓ నటుడిని దొంగ అనుకొని ఆయనపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ పక్కనున్న గోడకు తగలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటుడు జెఫ్ డఫ్ ఓ సినిమాలో దొంగ పాత్రలో నటిస్తున్నారు. అందులో భాగంగా అమెరికాలోని ఓ బ్యాంక్ ముందు సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ముఖానికి మాస్క్ వేసుకొని జెఫ్ డఫ్ బ్యాంక్‌ను రాబరి చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి జెఫ్ డఫ్ చేతిలో ఉన్న నకిలీ తుపాకీని చూసి నిజంగానే దొంగతనానికి వచ్చాడని ఆయనపై కాల్సులు జరిపాడు. దీంతో డఫ్ ఒక్కసారిగా బయంతో వణికిపోయాడు. బుల్లెట్ గురి తప్పి పక్కన ఉన్న గోడకు తగలడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న సినిమా బృందం అతను నిజమైన దొంగ కాదు. ఇది సినిమా షూటింగ్. గన్ను పారేయండని అరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆయనతో ఎవరూ మ్యాచ్ కాలేరు!
ఎదుటి వ్యక్తి మనస్తత్వం తెలుసుకోవడం చాలా కష్టం. అయితే వాళ్ల మాట తీరు, చూపులు, శారీరక భాషని పరిశీలిస్తే ఆ వ్యక్తి ‘ఇలాంటివాడు’ అని కొంతవరకూ అర్థమవుతుంది. ఇప్పుడు అనుష్కను తీసుకుందాం. ఆమెని చూడగానే మంచి అందగత్తె అనిపిస్తుంది. మాటలు కలిపితే ‘నైస్ పర్సన్’ అనుకోకుండా ఉండలేం. మరి.. ఎదుటి వ్యక్తిని అనుష్క ఎలా ఎనలైజ్ చేస్తారు? అనే విషయానికొస్తే.. కళ్లను పరిశీలిస్తారట. ఎలాంటి మగవాళ్లను ఇష్టపడతారు? అనే ప్రశ్న అనుష్క ముందుంచితే - ‘‘కళ్లల్లో నిజాయతీ కనిపించాలి. అలాంటి మగాళ్లంటే ఇష్టం. అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్న మగాళ్లతో మాట్లాడటం నాకిష్టం ఉండదు. మన కళ్లు మనం ఎలాంటి వ్యక్తో చెప్పేస్తాయ్. అలాగే, నవ్వు కూడా చెప్పేస్తుంది. స్వచ్ఛంగా నవ్వే అబ్బాయిలంటే ఇష్టం. జార్జ్ క్లూనీ (హాలీవుడ్ నటుడు) కళ్లల్లో నిజాయితీ కనిపిస్తుంది (నవ్వుతూ). నాకు సింపుల్‌గా ఉండటం ఇష్టం. నా చుట్టూ ఉన్నవాళ్లు అలానే ఉండాలనీ, నిజాయతీగా ఉండాలనీ కోరుకుంటాను. లక్కీగా నా సర్కిల్లో అందరూ అలాంటివాళ్లే ఉన్నారు’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మ్యాన్‌కి నిదర్శనం మా నాన్నగారు. ఆయన్ను మ్యాచ్ కావడం ఏ అబ్బాయి వల్లా కాదు’’ అని తండ్రి పట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని వ్యక్తపరిచారు అనుష్క. -
ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
కైరో: ప్రఖ్యాత ఈజిప్షియన్, హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్(83) శుక్రవారం కైరోలో గుండెపోటుతో మరణించారు. అల్జీమర్స్ వ్యాధి వల్ల కొంతకాలంగా ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఆయనకు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు (తారిఖ్ ఎల్ షరీఫ్) ఉన్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో నటన ద్వారా ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా ప్రసిద్ధినొందారు. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ గెలుచుకున్నారు. చే సినిమాలో చే గువేరా పాత్రనూ పోషించారు. 1953 నాటి ద బ్లేజింగ్ సన్ సినిమాలో తనతో పాటు నటించిన ఫాతెన్ హమామాను షరీఫ్ వివాహమాడారు. తనతో కలిసి అనేక సినిమాల్లో నటించిన హమామాను పెళ్లి చేసుకునేందుకు క్రై స్తవుడైన ఆయన ఇస్లాం స్వీకరించారు. చివరిసారిగా 2013లో రాక్ ద కాస్బా సినిమాలో నటించారు. -
నటన వీడి.. ఐఎస్‌తో పోరాడుతున్నాడు..
జోర్దాన్: మొన్నటివరకు 'స్టార్ట్ కెమెరా' అనగానే ఠక్కున మూడ్‌లోకి వెళ్లిపోయి దర్శకుడు కోరిన రీతిలో నటించి.. అందరినీ మెప్పించిన హాలీవుడ్ నటుడు.. ఇప్పుడు నిజం తుపాకి పట్టుకుని కదనరంగంలోకి దిగాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్ని అంతం చేయడమే తన లక్ష్యమని ప్రకటించాడు. ఇంకెప్పటికీ ఇంటికి రానని, రాలేనని కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పాడు. జానీ డెప్ హీరోగా నటించిన 'పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్', టామ్ క్రూజ్ 'నైట్ అండ్ డే', జాన్ ట్రొవాల్టో 'ఓల్డ్ డాగ్స్' తదితర చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించిన నటుడు మైఖెల్ ఎన్రైట్ ప్రస్తుతం సిరియాలో ఉంటున్నాడు. కుర్దూ దళాలతో కలిసి ఐఎస్ ఉగ్రవాదులతో పోరాడడుతున్నాడు. చక్కటి సినీ కెరీర్ ను కాదనుకుని ఇలా కదనరంగంలోకి దూకాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే.. ' కొన్ని నెలల కిందట ఐఎస్ ఉగ్రవాదులు ఓ అమెరికన్ జర్నలిస్టును తల నరికి ఆ దృశ్యాల్ని ఇంటర్నెట్లో ఉంచారు. అది నన్ను బాగా కదిలించింది. మనుషుల్ని అంత క్రూరంగా చంపి, ఆనందించేవాళ్లు భూమిమీద ఉండటానికి అనర్హులు. అందుకే ఆ ఉగ్రవాదుల్ని, ఐఎస్ సంస్థ మొత్తాన్నీ కూకలివేళ్లతో పెకిలించివేయాలనుకున్నా' అంటూ తను తుపాకి పట్టడానికి గల కారణాలు చెబుతాడు మైఖేల్. గత ఫిబ్రవరిలో సిరియా వచ్చిన మైఖేల్.. కదనరంగంలో దూసుకుపోతోన్న వీడియో ఒకదానిని కుర్దీష్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్(వైపీజీ) విడుదల చేసింది. అయితే మనవాడికి కాస్త మెంటల్ అని, అందుకోసం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడని మైఖేల్ సన్నిహితుడు ఒకరు మీడియాతో చెప్పారు. మతిస్థిమితం లేనందునే ముందూ వెనుకా చూడకుండా కుర్దూ దళాల్లో చేరిపోయాడని పేర్కొన్నారు. ఇటు కుర్దూ దళాలు కూడా మైఖేల్ తీరుతో ఇబ్బందులు పడుతున్నాయని, చెప్పిన మాట వినకుండా ఇష్టారీతిరగా ప్రవర్తించడం, క్రమశిక్షణ లేకపోవడం లాంటి అలవాట్లను మైఖేల్ మానుకోలేకపోయాడని, ఉగ్రవాదులతో పోరుకు ఆయన పనికిరాడని కుర్దూ సైనికాధికారులు భావిస్తున్నారట! ఈ మేరకు బ్రిటన్‌లో నివసిస్తోన్న కుటుంబసభ్యులకు లేఖలురాసి మైఖేల్‌ను ఇంటికి తీసుకుపోవాల్సిందిగా కోరారట! -
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ కు అలీ ఫజల్ దూరం
న్యూఢిల్లీ: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ నుంచి హాలీవుడ్ నటుడు అలీఫజల్ నిష్క్రమించాడు. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే సోనీ రజ్దాన్ దర్శకత్వంలో ఆయన ''లవ్ అఫైర్'' అనే సినిమా చేయబోతున్నాడు. ఈ కారణంతోనే అతడు ప్రమోషన్ కు హాజరుకావటంలేదని అలీఫజల్ సన్నిహితులు తెలిపారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ కు మాత్రం ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 సినిమా ప్రీమియర్ కు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని అలీఫజల్ తెలిపారు. ఇదిలాఉండగా ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 7 సినిమాలో అలీఫజల్ మూడు సీన్లలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ కూడా నటించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 భారత్ లో ఏప్రిల్ 2 వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ్ లోనూ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు
ఇండియానా జోన్స్ సినిమా సిరీస్ ద్వారా హాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరో హారిసన్ ఫోర్డ్ గురువారం నాడు ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రెండు సీట్ల చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. శాంటా మోనికా విమానాశ్రయానికి సమీపంలోని గోల్ఫ్‌కోర్టులో విమానం క్రాష్ ల్యాండింగ్ అవడం వల్ల హారిసన్ ఫోర్డ్ తలకు బలమైన గాయాలయ్యాయని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక దళం అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. తమకు సమాచారం అంది... తాము ప్రమాద స్థలానికి చేరుకునేలోగానే కూలిపోయిన విమానం నుంచి ఫోర్డ్‌ను స్థానికులు బయటకు తీస్తూ కనిపించారని ఆయన వివరించారు. అమెరికా నటుడైన హారిసన్ ఫోర్డ్ స్టార్ వార్స్ సిరీస్ ద్వారా హాలివుడ్‌లోకి ప్రవేశించారు. అపోకలిప్సీ నౌ, ది ఫుజిటివ్, బ్లేడ్ రన్నర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. విట్నెస్లో హీరోగా నటించిన ఫోర్డ్‌కు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును అందుకున్నారు. -
ఎవరు దోషి?
నిజాలు దేవుడికెరుక: కళ్లతో చూసేదంతా నిజం కాదు. నిజం అనుకుని పొరబడితే... ఆ పొరపాటు పెద్ద నష్టాన్నే చేస్తుంది. కొన్నిసార్లు జీవితాలనే నాశనం చేస్తుంది. అందుకు ఒకనాటి హాలీవుడ్ నటుడు రాస్కో అర్బకిల్ జీవితమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే... రాస్కో జీవిత పుటల్ని ఓసారి తిరగేసి చూడాలి. సెప్టెంబర్ 8, 1921. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రి. ఓ కారు శరవేగంగా వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు హడావుడిగా దిగారు. ముగ్గురూ కలిసి కారులోంచి ఓ అమ్మాయిని జాగ్రత్తగా దించారు. ఆమె నిలబడే స్థితిలో లేదు. అప్పటికే స్పృహ కోల్పోయినట్టుగా కాళ్లూ చేతులూ వేళ్లాడుతున్నాయి. ఆమెని తమ చేతులతో ఎత్తి పట్టుకుని లోనికి తీసుకొచ్చారు వాళ్లు. అది చూస్తూనే వార్డ్బోయ్ పరిగెత్తుకొచ్చాడు.‘‘ఏమైంది?’’ అన్నాడు కంగారుగా. ‘‘చెప్తాం. ముందు తనని డాక్టర్‌కి చూపించాలి. అర్జెంట్’’ అంది ఒకామె. ‘‘ఏంటి... ఏం జరిగింది’’... అప్పుడే అటుగా వెళ్తున్న డాక్టర్ ఇటు వస్తూ అన్నాడు. వాళ్ల దగ్గరకు వచ్చి ఆ అమ్మాయివైపు చూశాడు. ‘‘ఈమెనెక్కడో చూసినట్టుందే’’ అన్నాడు సాలోచనగా. ‘‘చూసేవుంటారు. తను నటి... వర్జీనియా ర్యాపే’’... చెప్పాడు తీసుకొచ్చిన అబ్బాయి. ‘‘ఎస్... కరెక్ట్. ఏమయ్యింది తనకి?’’ ముగ్గురూ ముఖాలు చూసుకున్నారు. నేను చెబుతాను అన్నట్టు సైగ చేసిందో అమ్మాయి. ‘‘తనని రేప్ చేశారు సర్’’ అంది తల దించుకుని. ‘‘వ్వా....ట్?’’ ‘‘అవును. తను రేప్‌కి గురయ్యింది. అప్పట్నుంచీ స్పృహలో లేదు. వెంటనే ఏదో ఒకటి చేయండి’’ ‘‘పోలీసులకి ఇన్ఫామ్ చేశారా?’’ ‘‘చేశాం. వచ్చేస్తూ ఉంటారు.’’ వర్జీనియా నాడి పరిశీలించాడు డాక్టర్. ‘‘నర్స్... థియేటర్ రెడీ చేయండి. బాయ్స్... ఆమెను తీసుకు రండి’’ అంటూ పరుగు తీశాడు. వెంటనే వార్డ్‌బోయ్స్ వచ్చి వర్జీనియాను స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్లారు. రెండు నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు. వాళ్లను చూస్తూనే ఒకమ్మాయి ఎదురెళ్లింది. ‘‘నేనే సర్ మీకు ఫోన్ చేసింది. నా పేరు బ్యాంబీనా. వర్జీనియా ఫ్రెండ్‌ని.’’ ‘‘అసలేం జరిగింది?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఈరోజు సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో పెద్ద పార్టీ జరిగింది సర్. దానికి మేమంతా వెళ్లాం. వర్జీనియా ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అంతా వెతికితే ఒక రూమ్‌లో కనిపించింది. మంచం మీద, రాస్కో చేతుల్లో... అచేతనంగా ఉంది’’... గడగడా చెప్పింది బ్యాంబీనా. ‘‘రాస్కోనా?’ ‘‘అవును సర్... రాస్కో అర్బకిల్. నటుడు, దర్శకుడు.’’ ఏదో అనబోతున్నవాడల్లా థియేటర్ తలుపులు తెరచుకోవడంతో ఆగిపోయాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ బయటకు రావడం చూసి అతడి దగ్గరకు వెళ్లాడు. ‘‘డాక్టర్.. ఆమె ఎలా ఉంది?’’ పెదవి విరిచాడు డాక్టర్. ‘‘చాలా సీరియస్... ఇప్పుడే ఏ విషయం చెప్పలేం. బ్లాడర్ బాగా రప్చర్ అయ్యింది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది.’’ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమైంది ఇన్స్పెక్టర్కి. మళ్లీ కలుస్తానని చెప్పి బయలుదేరాడు. బెల్ పదే పదే మోగడంతో విసుక్కుంటూ లేచాడు రాస్కో. టైమ్ చూసుకున్నాడు. తెల్లవారుజాము మూడవుతోంది. ‘‘అబ్బా... ఈ టైమ్‌లో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు’’ అనుకుంటూ మంచం దిగి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా ఉన్న పోలీసులను చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏంటి? ఏదైనా ప్రాబ్లెమా?’’ అన్నాడు అర్థం కానట్టుగా. ‘‘ప్రాబ్లెమే. మాక్కాదు, నీకు’’ అంటూ లోనికి వచ్చి గదంతా పరికించి చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘ఈ టైమ్‌లో వచ్చి నా రూమ్ సోదా చేస్తున్నారేంటి?’’ అన్నాడు రాస్కో అయోమయంగా. ‘‘సాక్ష్యాలు కావాలి కదా మిస్టర్ రాస్కో’’... వెటకారంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘సాక్ష్యాలా... దేనికి?’’ ‘‘నటి వర్జీనియా ర్యాపేని నువ్వు రేప్ చేశావని నిరూపించడానికి’’. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తనని రేప్ చేయడమేంటి? అది నిజం కాదు’’ అరిచినట్టే అన్నాడు రాస్కో. ‘‘అరిస్తే నిజాలు అబద్ధాలైపోవు మిస్టర్... యు ఆర్ అండర్ అరెస్ట్’’ అంటూ రాస్కో చేతులకు బేడీలు వేశాడు ఇన్స్పెక్టర్. మర్నాడు... ‘‘నో... వర్జీనియాని నేనేం చేయలేదు’’... రాస్కో అరుపులతో ఇంటరాగేషన్ సెల్ దద్దరిల్లిపోయింది. అప్పటికి అరగంట నుంచి అడుగుతున్నారు పోలీసులు. కానీ ఎన్నిసార్లు అడిగినా అతడదే చెబుతున్నాడు. దాంతో ఇన్స్పెక్టర్కి కబురు చేశారు. అతడు వడివడిగా వచ్చాడు. ‘‘టైము, టైమింగ్ విలువ నటుడివి నీకు తెలిసింతగా ఇంకెవరికి తెలుస్తాయి రాస్కో! అనవసరంగా సమయం వృథా చేయకుండా నిజం ఒప్పేసుకో.’’ అతడంత కఠినంగా మాట్లాడటం చూసి మౌనంగా అయిపోయాడు రాస్కో. ‘‘నేను మంచివాణ్ని కాబట్టి ఇంకా చేతికి పని చెప్పలేదు. నన్ను రెచ్చగొట్టొద్దు. ఏ తాగిన మత్తులోనో తప్పు చేసుంటావ్. ఒప్పుకుంటే నీకే మంచిది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? వర్జీనియా హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడిది రేప్ కేసు కాదు, మర్డర్ కేస్.’’ ఉలిక్కిపడ్డాడు రాస్కో. ‘‘వర్జీనియా చచ్చిపోయిందా?’’ అన్నాడు బెదురుగా చూస్తూ. ఇన్స్పెక్టర్ తలాడించాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాస్కోకి. రెండు క్షణాల తర్వాత అన్నాడు. ‘‘నేను నిర్దోషిని సర్. నన్ను నమ్మండి.’’ ‘‘నేరస్తులను నమ్మడం మొదలుపెడితే మేం యూనిఫాములు తీసేయాల్సి వస్తుంది మిస్టర్ రాస్కో. నీ సంగతి రేపు కోర్టు తేలుస్తుంది’’ అనేసి వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్. కటకటాల గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు రాస్కో. ‘‘ఈ కేసును వచ్చే నెల పన్నెండో తేదీకి వాయిదా వేస్తున్నాను. ముద్దాయి రాస్కో అర్బకిల్ని రిమాండ్‌కు తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను.’’జీవితం ఒక్కసారిగా చీకటైపోయినట్టు అనిపించింది రాస్కోకి. ఏం చేయాలో అర్థం కాక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చూస్తున్నవాళ్లంతా అవాక్కయిపోయారు. అతడికి శిక్ష పడాలి అని కోరుకున్నవాళ్లకు కూడా మనసు చలించింది ఆ ఏడుపు చూసి. అప్పుడైనా అతడి గురించి వేరే కోణంలో ఆలోచించి ఉంటే... రాస్కోకి న్యాయం జరిగివుండేది. కానీ ఎవ్వరూ అలా ఆలోచించలేదు. రాస్కో అర్బకిల్ మంచి నటుడు. చక్కని రచయిత. వైవిధ్యతను చూపించే దర్శకుడు. ఇండస్ట్రీలో అతడికి మంచి పేరుంది. పెద్ద సర్కిల్ ఉంది. కానీ అవన్నీ ఒక్క కేసుతో దూరమైపోయాయి. ఆరోజు షూటింగ్లో గాయపడటంతో విశ్రాంతి తీసుకోవడానికి, సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు రాస్కో. తర్వాతి రోజు రాత్రి ఓ నటుడు ఇచ్చిన పార్టీలో తను కూడా పాల్గొన్నాడు. కాసేపటి తర్వాత తన గదికి వెళ్లాడు. అప్పుడే అనుకోకుండా వర్జీనియా ర్యాపే గదిలోకి దూసుకొచ్చింది. బాగా తాగివుంది. బాత్రూమ్లోకి వెళ్లి వాంతులు చేసుకోసాగింది. దాంతో గబగబా వెళ్లి ఆమెకి సహకరించాడు. తీసుకొచ్చి మంచం మీద కూచోబెట్టాడు. తాగడానికి నీళ్లిచ్చాడు. మత్తులో పిచ్చిపిచ్చిగా ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే వర్జీనియా ఫ్రెండ్ బ్యాంబినో ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. రాస్కో గదిలో ఆమెను చూసి షాకయ్యింది. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాగా ఏడ్చినట్టుగా చెంపల మీద కన్నీటి చారికలు ఉన్నాయి. దానికి తోడు ఆమె రాస్కో చేతుల్లో ఉంది. దాంతో ఆమె పట్ల ఏం జరిగివుంటుందో ఊహించుకుంది. అంతలో వర్జీనియా స్పృహ కోల్పోవడంతో గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయింది. రేప్ జరిగింది అని బ్యాంబినా చెప్పిన ఒక్క మాటతో దర్యాప్తు మొత్తం ఆ దిశలోనే జరిగింది. రాస్కో గదిలో ఉంది కాబట్టి పోలీసులు అతడిని దోషిగా ఎంచారు. డాక్టర్ కూడా బ్లాడర్ గాయపడ డానికి, ఇంటర్నల్ బ్లీడింగ్‌కి దారుణంగా రేప్ చేయడమే కారణమని నిర్ణయించేశాడు. దాంతో కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు రాస్కో. కొన్ని రోజులకు బెయిల్ దొరికినా... కోర్టుల చుట్టూ తిరగడంతోనే జీవితం గడిచిపోయింది. అవకాశాలు తగ్గి పోయాయి. పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోయాయి. సంపాదించినదంతా లాయర్ ఫీజులకు కరిగిపోయింది. కానీ అదృష్టం... నిజం నిలకడ మీద బయటకు వచ్చింది. పార్టీలో పాల్గొన్న కొందరు వర్జీనియా ప్రవర్తన గురించి ఇచ్చిన సాక్ష్యం, రాస్కో నిర్దోషిత్వాన్ని బయటపెట్టింది. ఎక్కడ పార్టీ జరిగినా విచిత్రమైన వస్త్రధారణలో వచ్చేది వర్జీనియా. పీకల దాకా తాగేది. రచ్చ రచ్చ చేసేది. విపరీతంగా ఏడ్చేది. ఎక్కడ పడితే అక్కడ కక్కుకునేది. ఆమెను కొందరు సంస్కారం లేని మనిషి అంటే, కొందరు అందరి కళ్లలో పడటానికే అలాంటివి చేస్తుందనేవారు. ఈ విషయాలన్నీ కొందరు కోర్టులో చెప్పారు. దానికి తోడు రాస్కో ఎంత నెమ్మదస్తుడో, ఎంత నిజాయతీపరుడో కూడా చెప్పారు. అతడి మీద అంతవరకూ ఒక్క రిమార్కు కూడా లేకపోవడం కూడా కలిసివచ్చింది. దాంతో రీ పోస్ట్‌మార్టమ్‌కి ఆదేశించింది న్యాయస్థానం. అప్పుడు తెలిసి వచ్చింది... వర్జీనియా మీద అసలు అత్యాచారమే జరగలేదని, కొన్ని రోజుల ముందు జరిగిన అబార్షన్ వల్ల బ్లాడర్ దెబ్బతిందని! ఓ అమాయకుడిని పోలీసులు, వైద్యులు కలిసి ఎలా నేరస్తుణ్ని చేశారో ప్రపంచానికి తెలిసివచ్చింది. న్యాయస్థానం కేసు కొట్టేసింది. జరిగిన తప్పుకి రాస్కోకి క్షమాపణ చెబుతూ ఓ లేఖ కూడా వెలువరించింది. కానీ ఏం లాభం? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డబ్బు లేదు. పేరు లేదు. కెరీర్ లేదు. ఉన్నదల్లా... శూన్యం. ఆ శూన్యం అతడిని చాలా కుంగదీసింది. తన జీవితంపై పడిన నెత్తుటి మరకను తుడిచేసుకోలేక, పన్నెండేళ్లపాటు జీవచ్ఛవంలా బతికాడు. 1933, జూన్ 29న కన్నుమూశాడు. ఈ కేసులో అసలు దోషి ఎవరు? తన ఊహతో కథలు అల్లిన బ్యాంబినోనా? సరైన సాక్ష్యాలు లేకుండానే అతడిని నేరస్తుడిగా పరిగణించిన పోలీసులా? కనీస పరీక్షలు కూడా చేయకుండా అత్యాచారం జరిగిందని నిర్ధారించేసిన వైద్యుడా? ఎవరు?! - సమీర నేలపూడి -
సిల్వెస్టర్ స్టాలిన్ ఇంట్లో షూటింగ్...
సాయంత్రం ఆరు నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు జరిగే సంఘటనల సమాహారంతో రూపొందిన చిత్రం ‘హ్యాంగ్ అప్’. సుధాకర్ కొమాకుల, నటాలియా రౌత్, మహేష్ శ్రీరామ్ ముఖ్య తారలుగా హైదర్ బిల్ గ్రామి, తీర్థంకర్ దాస్ దర్శకత్వం వహించారు. ఫరూక్ దర్వాలా లైన్ ప్రొడ్యూసర్. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నామని హైదర్ బిల్ చెబుతూ -‘‘హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ స్వగృహంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించినప్పటికీ ముందు తెలుగులో ఆ తర్వాత మూడు నెలలకు హిందీలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. సుధాకర్ మాట్లాడుతూ -‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి ముందే ఈ సినిమా అంగీకరించా. థ్రిల్లర్ జానర్లో సాగే సినిమా. ఒక్క రోజులో జరిగే కథ కోసం 40 రాత్రులు షూటింగ్ చేశాం. ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన విషయం’’ అన్నారు.బేసికల్‌గా క్లాసికల్ డాన్సర్‌ని అని, కేంబ్రిడ్జ్లోనే మెడిసన్ చదువుకున్నానని, యూఎస్‌లోనే ఈ సినిమా తీయడం వల్ల యాక్ట్ చేయగలిగానని, తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే చేస్తానని నటాలియా తెలిపారు.