
హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ (ఫైల్)
వాషింగ్టన్: ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో దేశాధినేతలు, సెలబ్రిటీలూ బెంబేలెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ (69) కరోనా వైరస్ కాంప్లికేషన్స్‌తో మరణించారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. క్రొకడైల్ డూండీ, డెస్పరేట్లీ సీకింగ్ సుశాన్ వంటి మూవీలతో పాటు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘యూ’తో మార్క్ బ్లమ్ విశేష ప్రాచుర్యం పొందారు. తన భర్త కోవిడ్-19 లక్షణాలతో న్యూయార్క్ ప్రిబిటేరియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని బ్లమ్ భార్య జనిత్ జరిష్ ధ్రువీకరించారు. అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించిన బ్లమ్ 1970లో థియేటర్, టీవీ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1983లో లవ్‌సిక్ మూవీతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అమెజాన్ సిరీస్ మోజర్ట్ ఇన్ ది జంగిల్‌లో బ్లమ్ యూనియన్ బాబ్‌గా నటించగా, నెట్‌ఫ్లిక్స్ డ్రామా యూలో మూనీగా తన నటనతో ప్రేక్షకులను ఆయన విశేషంగా ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment