Johnny Depp Files Defamation Case Against His Ex-Wife Amber - Sakshi
Sakshi News home page

Johnny Depp : మాటల్లో చెప్పలేని తిట్లు, భౌతిక దాడి చేసింది.. వాపోయిన హీరో

Published Thu, Apr 21 2022 8:38 PM | Last Updated on Fri, Apr 22 2022 8:50 AM

Johnny Depp Says Ex Wife Amber Heard Beat Him, Cost Him Everything - Sakshi

మాజీ భార్య రాసిన వ్యాసంపై ప్రముఖ హాలీవుడ్‌ హీరో జానీ డేప్‌ రూ. 380 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. వివరాల్లోకి వెళితే... మూడేళ్ల డేటింగ్‌ అనంతరం నటి అంబర్‌ హెర్డ్‌ను 2015లో హీరో జానీ డేప్‌ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరి వైవాహిక జీవితంలో కలతలు రావడంతో 2017లో వీరు విడిపోయారు. అయితే అంబర్‌ హెర్డ్‌ తాను గృహహింస బాధితురాలని అంటూ రాసిన వ్యాసంపై  డేప్‌ ఏకంగా రూ. 380కోట్ల పరువు నష్టం దావా వేశాడు.

తాను అంబర్‌ను ఏ రకంగా హింసించలేదని డేప్‌ తెలిపారు. 'పెళ్లయిన ఏడాది తర్వాతి నుంచి మా మధ్య తరుచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అంబర్‌ నన్ను దౌర్జన్యంగా, హింసాత్మకంగా, మాటల్లో చెప్పలేని తిట్లతో అవమానించేది. టీవీ రిమోట్‌, వైన్‌ గ్లాస్‌ తలపై విసిరేది. మానవ మలం బెడ్‌పై ఉంచేది' అని వర్జీనియా కోర్టులో వాపోయాడు. ప్రస్తుతం వర్జీనియాలో జరుగుతున్న ఈ పరువు నష్టం కేసు ఇప్పుడు రెండో వారానికి చేరుకుంది. ఈ కేసులో తర్వాతి సాక్షులుగా పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, నటులు జేమ్స్ ఫ్రాంకో, పాల్ బెటనీలు హాజరు కానున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement