ex wife
-
Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం మాజీ భార్యాభర్తల మధ్య రాజకీయ యుద్ధానికి వేదికగా మారింది! బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ సౌమిత్రఖాన్పై ఆయన మాజీ భార్య సుజాత మోండల్ బరిలో దిగారు. ఆమె టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సౌమిత్ర విజయం కోసం అన్నీ తానై కష్టపడ్డ సుజాత, ఈసారి తన గెలుపు గ్యారంటీ అంటున్నారు. ఈ మాజీ దంపతుల దంగల్‌లో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. బిష్ణుపూర్‌లో మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది... రాజకీయ విడాకులు...! సౌమిత్ర ఖాన్ 2014లో తృణమూల్ పార్టీ తరఫున విజయం సాధించి బిష్ణుపూర్పై వామపక్షాల పట్టును బద్దలు కొట్టారు. తరువాత బీజేపీలో చేరి 2019లోనూ గెలిచారు. అనంతరం ఆయన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. ఉద్యోగాల ఆశ చూపి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ముందు సౌమిత్రపై కేసు నమోదైంది. బీజేపీలోకి మారినందునే మమత సర్కారు తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసు కారణంగా 2019 ఎన్నికలప్పుడు ఆయన బంకురా జిల్లాలోకి ప్రవేశించకుండా కలకత్తా హైకోర్టు నిషేధించింది. దాంతో భర్త కోసం సుజాత అన్నీ తానై బిష్ణుపూర్‌లో ప్రచారం చేశారు. ఆమె కారణంగానే 2019లో ఖాన్ విజయం సాధించారంటారు. అయితే బీజేపీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ సుజాత 2020లో పార్టీని వీడారు. ఈ విషయంలో భర్త తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయనకూ దూరమయ్యారు! ఆమె టీఎంసీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో సౌమిత్ర విడాకులిచ్చారు. ఆ వెంటనే సుజాత తన పేరు నుంచి ఖాన్‌ను తొలగించుకున్నారు. స్థానిక ఎన్నికల బరిలో దిగి బంకురా జిల్లా పరిషత్ సభ్యురాలిగా గెలిచారు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట బిష్ణుపూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2014 దాకా సీపీఎంకు కంచుకోట. దీని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి! తృణమూల్ రెండింట్లోనే గెలిచింది. ఈసారి సీపీఎం శీతల్ కెబర్టా అనే టీచర్‌ను బరిలో దింపింది. ఆమెకు కూడా నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాను గొప్ప పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుద్యోగం, నీటి కొరత సమస్యలను పరిష్కరిస్తానన్న హామీలకు ప్రజలు బాగా స్పందిస్తున్నారు. సౌమిత్రపై అసంతృప్తి... తాగునీటి ఎద్దడి, రోడ్ల దుస్థితి బిష్ణుపూర్‌లో ప్రధాన సమస్యలు. ఎంపీగా ఇచ్చిన హామీలేవీ సౌమిత్రా నెరవేర్చలేదనే విమర్శ ఉంది. ఎన్నికల తర్వాత ఆయన కని్పంచనే లేదన్నది స్థానికుల ఆరోపణ. రోడ్ల దుస్థితికి తోడు నేత కార్మికుల దుస్థితి కూడా ఈ చారిత్రాత్మక పట్టణంలో మరో పెద్ద సమస్య. బిష్ణుపూర్ పట్టు చీరలకు ప్రసిద్ధి. కానీ చేనేత ఉత్పత్తులను సేకరణకు ఏర్పాట్లే లేవని కారి్మకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు తనదేనని సుజాత విశ్వాసంతో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలాన్ మస్క్‌పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై మాజీ భార్య గ్రిమ్స్ పిటిషన్ వేస్తూ శాన్ఫ్రాన్సిస్కోలోని సుపీరియర్ కోర్టుని ఆశ్రయించింది. ఇందులో తమ ముగ్గురి పిల్లల సంరక్షణను చూసుకోవాలని డిమాండ్ చేస్తూ దావా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కెనడాకు చెందిన మ్యుజిషియన్ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్ 2018 నుంచి 2021 వరకు డేటింగ్ చేసాడు. ఈ ఇద్దరికీ ముగ్గురు పిల్లలున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మస్క్ బయోగ్రఫీ బుక్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2021 నాటికి వీరు విడిపోయారు. అప్పటి వరకు వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్న విషయం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ వారిద్దరికీ మూడో బిడ్డ ఉన్నట్లు, అతని పేరు టెక్నో మెక్నానికస్ అని స్వయంగా ఎలన్ మస్క్ వెల్లడించాడు. ముగ్గురు పిల్లల్లో ఒకరిపై తనకు ఎటువంటి అధికారాలు లేవని మస్క్ ఆరోపిస్తున్నట్లు గ్రిమ్స్ తెలిపింది. అంతే కాకుండా అతన్ని చూడటానికి కూడా నన్ను అనుమతించడం లేదని, తనకు కూడా ప్యారంటల్ రైట్స్ కల్పించాలని కోరింది. మస్క్‌తో డేటింగ్ చేసిన రోజుల్ని మరిచిపోలేనని చెప్పింది. ఇదీ చదవండి: రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది! నిజానికి ఎలాన్ మస్క్‌కు ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు. ప్రస్తుతం ముగ్గురికి విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రిమ్స్ వేసిన ఓపిటిషన్ మీద మస్క్ స్పందించలేదు. కాగా ఇటీవల మస్క్ టర్కీ అధ్యక్షుడు 'తయ్యిప్ ఎర్డోగాన్' అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మస్క్ అతనితో సమావేశమయ్యారు. ఆప్పుడు అతనితో తన కొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఇది చూసి ఎర్డోగాన్ మీ భార్య ఎక్కడ అని ప్రశ్నించగా.. ఆమె శాన్ఫ్రాన్సిస్కోలోని ఉందని, ప్రస్తుతం విడిపోయామని తెలిపాడు. -
మరో పెళ్లి గురించి కాదనుకుంటా!?
మరో పెళ్లి గురించి కాదనుకుంటా!? -
సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు. ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్‌పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్‌లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్‌ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!
ఇటీవల కాలంలో జంటలు పలు కారణాల రీత్యా విడిపోతుండటం చూస్తున్నాం. ఐతే విడిపోయేటప్పుడూ భర్త మాత్రం పెద్ద మొత్తంలో భార్యకు భరణం చెల్లించాల్సిందే. అది అందరికీ తెలిసిందే. ఇక్కడమ మాత్రం కోర్టు చాలా విచిత్రమైన అంశం లేవనెత్తి..గొప్ప తీర్పు ఇచ్చింది. ఇక్కడొక జంట ఏవో కారణాల రీత్యా విడాకుల కోసం కోర్టు మెట్లేక్కారు. అయితే ఆ కోర్టు భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. అలా ఇలాకాదు ఇన్నాళ్లు తనకు జీతభత్యం లేకుండా ఇంటి పనిచేసి, కుటుంబాన్ని చూసినందుకు కోటీ రూపాయాలు చెల్లాంచమంటూ ఆదేశించింది. ఈఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే...ఓ జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లై ఇన్నేళ్లైనా.. ఆమె ఎలాంటి జీతం భత్యంలేని కుటుంబ సేవకు అంకితమైంది కాబట్టి ఆమెకు వివాహం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ కార్మికుడు ఇచ్చే కనీస వేతనం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం కోటి రూపాయాల లెక్కించింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల భాగస్వామ్యంలో ఆమెకంటూ ఎలాంటి సంపాదన లేదు. ముఖ్యంగా ఇంటి పనుల్లోనే నిమగ్నమైంది. ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోయింది. పిల్లలకు నెలవారి భత్యంతో సహా ఆమె వివాహం జరిగిన సంవత్సరం 1995 నుంచి 2020 వరకు ఆమెకు రోజువారి కూలికి చెల్లించే వేతనం చట్టం ప్రకారం అయినా ఆమెకు చెల్లించాల్సిన మొత్తం లెక్కించి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆ భర్తను ఆదేశించింది. ఈ మేరకు సదరు మహిళ మాట్లాడుతూ.. "నా భర్త బయట ఉద్యోగం చేసేందుకు అనుమతించ లేదు. ఇంటికే పరిమితం చేయడమే గాక తమ స్వంత జిమ్‌లోనే పనిచేసేందుకు అనుమతించేవాడు. తనను కుంటుంబం, ఇల్లు వాటికే పరిమితం అయ్యేలా చేశాడు. నిజంగా నన్ను ఇంకేమి చేయలేని స్థితిలోకి తీసుకొచ్చేశాడు. నిజంగా ఈ తీర్పు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సరైనదే అని ఆనందంగా చెబుతోందామే". (చదవండి: తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు) -
'22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'
లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్, సీనియర్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌ను పోలీసులు గత వారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త బ్రెజిల్‌తో పాటు యావత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆటను విపరీతంగా ప్రేమించే డానీ అల్వెస్లో ఇలాంటి కోణం కూడా ఉందా అని అభిమానులు నివ్వెరపోయారు. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకు బెయిల్ ఇవ్వొద్దని స్పానిష్ కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం డానీ అల్వెస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. డానీ అల్వెస్ మాజీ భార్య డానా డినోర్హా మాత్రం అతనికి మద్దతుగా నిలబడింది. ఒక టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ''డానీ ఈ పని చేశాడంటే నేను నమ్మను. ఎందుకంటే మా ఇద్దరికి 22 ఏళ్ల పరిచయం ఉంది. 10 ఏళ్ల పాటు కలిసి జీవించాం. అతని వ్యక్తిగత జీవితం ఎలా సాగిందన్న దానిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. కచ్చితంగా తప్పు చేసి ఉండడన్న నమ్మకం నాకుంది. అయితే డానీ అల్వెస్ అరెస్ట్ నన్ను, నా పిల్లలను మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది. మాకు ఇది కష్టకాలం కావొచ్చు.. అతను నిర్దోషిగా బయటకు వస్తాడని మాత్రం చెప్పగలను. డానీ అల్వెస్ తరపు లాయర్‌ను సంప్రదించా. కేసుపై వర్క్ చేస్తున్నట్లు ఆమె చెప్పినట్లు'' తెలిపింది. డానీ అల్వెస్ అరెస్ట్ విషయానికి వస్తే.. డిసెంబర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్లబ్లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఆమె అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా కథనంగా ప్రసారం చేసింది. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డానీపై కేసు నమోదు చేశారు. అయితే అల్వెస్ మాత్రం''ఆ సమయంలో తాను ఆ క్లబ్లో కొంతమందితో కలిసి ఉన్నానని, కానీ తాను ఏ తప్పు చేయలేదని ఈ ఫుట్‌బాలర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేతప్ప ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలనని'' పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. బ్రెజిల్ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్ జట్టు తరపున 126 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేశాడు.ఇక 2022లో ఖతర్‌లో జరిగిన ఫిఫి వరల్డ్ కప్ ఆడిన బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. క్వార్టర్ ఫైనల్లో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడిన పెద్ద వయస్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన డానీ 2021-22 సీజన్లో స్పానిష్ క్లబ్‌కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్ క్లబ్ అయిన పుమాస్ యూనమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "Dani would never, ever, ever do this. Never. I'm telling you because I've known him for 22 years and I've been married to him for ten." Dana Dinorah, Dani Alves' ex-wife, has gone on television to defend the Brazilian footballer amid sexual assault allegations. pic.twitter.com/LUESGNsLya — Football España (@footballespana_) January 23, 2023 చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్‌బాలర్ ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. -
88వ పెళ్లికి సిద్ధమవుతున్న వృద్ధుడు...మరోసారి మాజీ భార్యతో
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు నిలబడటం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి స్థితుల్లో ఇక్కడొక వ్యక్తి ఒకటి రెండు కాదు ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇండోనేషియాలోని వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వృద్ధుడు 88వ పెళ్లికి సద్ధమవుతున్నాడు. అది కూడా తన మాజీ భార్యనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్ ఇలా చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని ప్లేబాయ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఆయన ఒక సామాన్య రైతు. అతను 14 ఏళ్ల వయసులో తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పకపోవడంతో కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఈ సంఘటన తర్వాత తనకు చాలా కోపం వచ్చిందని అప్పుడే చాలా మంది మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకునే తెలివతేటలు సంపాదించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను మహిళలకు ఇబ్బంది కలిగించేవి, చేయనని, వారి భావోద్వేగాలతో కూడా ఆడుకోననని అందువల్లే చాలా మంది తన ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న తన మాజీ భార్య తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసులను తిరస్కరించలేనని చెప్పాడు. ఐతే 87 పెళ్లళ్లు చేసుకున్న ఖాన్ తనకు ఎంతమంది పిల్లలున్నారనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
రేప్ కేసు రద్దు.. మాజీ భర్తకు వెరైటీ శిక్ష
ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ. అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. నోయిడా, మయూర్ విహార్‌లో బర్గర్ సింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
మాజీ భార్యతో కలిసి డైరెక్టర్లకు విందు ఇచ్చిన స్టార్ హీరో..
Aamir Khan Special Dinner To Russo Brothers: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా నటించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. స్టార్ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా, అలాగే ధనుష్‌తో కలిసి ఈ మూవీని వీక్షించేందుకు రూసో బ్రదర్స్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు భారతదేశానికి మొట్ట మొదటిసారిగా రావడంతో మంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గురువారం (జులై 21) ఇండియా వచ్చిన ఈ అన్నదమ్ములను స్వయంగా వారి ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్‌తోపాటు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. అయితే అమీర్-కిరణ్ రావు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో విడిపోయిన స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్ చెప్పిన మాటలకు ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది. ఇక ఈ విందులో అతిథులకు ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలను రుచి చూపించాడని టాక్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Laal Singh Chaddha (@aamirkhanuniverse) -
రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య
Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్డౌన్ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్ రోటీన్‌గా అనిపించింది. చదవండి: బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్? ఉదయం లేవడం వర్క్‌కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్డౌన్లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది. చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఓ స్టార్ హీరోయిన్ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్-సారికలు కొంతకాలం రిలేషన్లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. -
జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి
Actress Amber Heard Cries At Court: ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై వేసిన పరువు నష్టం దావా కేసుపై ప్రస్తుత కోర్టులో విచారణ జరుగుతోంది. వారు కలుసున్నపుడు జానీ డేప్ తరచూ కొడుతుండేవాడని, తాను గృహహింస బాధితురాలిని అంటూ అంబర్ హెర్డ్ ఇటీవల తను రాసిన ఓ వ్యాసంలో వెల్లడించింది. దీంతో తనపై అంబర్ తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంటూ జానీ ఏప్రిల్ 20న మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా! ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన హియరింగ్‌లో అంబర్, జానీ డేప్పై సంచలన ఆరోపణలు చేసింది. జానీ తనను తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించింది అంబర్. ‘మా కొద్దిపాటి వైవాహిక జీవితంలో జానీ తరచూ కొట్టేవాడు. అంతేకాదు అసభ్యపదజాలంతో దూషించేవాడు. మొదటి సారి తన టాటూను చూసి నవ్వానని కొట్టాడు. ఆయన శరీరంపై చెదిరిన ఉన్న టాటూ ఏంటని అడగ్గా విన్నో(జానీ డేప్ మాజీ ప్రియురాలు విన్నోనా రైడర్ పేరు) అని సమాధానం ఇచ్చాడు. అది జోక్ అనుకుని నవ్వేశాను. దీంతో నా చెంపపై కొట్టి నీకు ఇది సరదాగా ఉందా? అంటూ అభ్యంతరకర పదం(బీ..) వాడాడు’ అని పేర్కొంది. చదవండి: సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా? ఆ సమయంలో తనకు ఏం అర్థం కాలేదని, షాక్‌తో అతనివైపే ఉండిపోయాను’ అని చెప్పింది. అంతేగాక జానీ తనపై పలుమార్లు దాడి చేశాడని, మద్యం, మాదకద్రవ్యాల మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ భౌతికంగా గాయపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇతర యువతుల పట్ల సన్నిహితంగా ఉన్న సంఘటనలు గురించి తరచూ తన దగ్గర ప్రస్తావించేవాడని పేర్కొంది. ఈ క్రమంలో ఓ రోజు తన జీవితంలో అంత్యంత చేదు సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేని చెప్పింది. ఓ రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకుని ఫుల్ మత్తులో ఉన్న జానీ తన బట్టలు చించి, శరీరా భాగాల్లో కోకైన్ కోసం వేతికాడంటూ నాటి చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అంబర్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మాజీ భార్యపై రూ. 380కోట్ల పరువునష్టం దావా వేసిన హీరో
మాజీ భార్య రాసిన వ్యాసంపై ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ రూ. 380 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. వివరాల్లోకి వెళితే... మూడేళ్ల డేటింగ్ అనంతరం నటి అంబర్ హెర్డ్‌ను 2015లో హీరో జానీ డేప్ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరి వైవాహిక జీవితంలో కలతలు రావడంతో 2017లో వీరు విడిపోయారు. అయితే అంబర్ హెర్డ్ తాను గృహహింస బాధితురాలని అంటూ రాసిన వ్యాసంపై డేప్ ఏకంగా రూ. 380కోట్ల పరువు నష్టం దావా వేశాడు. తాను అంబర్‌ను ఏ రకంగా హింసించలేదని డేప్ తెలిపారు. 'పెళ్లయిన ఏడాది తర్వాతి నుంచి మా మధ్య తరుచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అంబర్ నన్ను దౌర్జన్యంగా, హింసాత్మకంగా, మాటల్లో చెప్పలేని తిట్లతో అవమానించేది. టీవీ రిమోట్, వైన్ గ్లాస్ తలపై విసిరేది. మానవ మలం బెడ్‌పై ఉంచేది' అని వర్జీనియా కోర్టులో వాపోయాడు. ప్రస్తుతం వర్జీనియాలో జరుగుతున్న ఈ పరువు నష్టం కేసు ఇప్పుడు రెండో వారానికి చేరుకుంది. ఈ కేసులో తర్వాతి సాక్షులుగా పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, నటులు జేమ్స్ ఫ్రాంకో, పాల్ బెటనీలు హాజరు కానున్నారు. -
మూడో భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్ చేసిన నటుడు నరేష్
సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే నరేశ్ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఉదయం దీనిపై వివరణ ఇస్తూ ఉదయం ఓ వీడియో వదిలారు. ఈ సందర్భంగా రమ్య జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మరోసారి స్పష్టం చేశాడు. ‘రమ్య రఘుపతి గారి ఇష్యూ(ఫైనాన్షియల్ ఇష్యూ) బయట పడినప్పటి నుంచి నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరితమైన ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లైయింది. చదవండి: స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్‌పై తీసుకొచ్చే ప్లాన్‌లో ప్రభాస్? మనస్పర్థల కారణంగా రెండూ, మూడేళ్లకే విడిపోయాం. ఇలాంటివి జరుగుతాయనే భయంతోనే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనంతపురం, హిందూపురం ఇష్యూ తర్వాత ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయానే ఉద్దేశంతోనే 2, 3 నెలల క్రితమే ఓ ప్రకటన ఇచ్చాను. తనతో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, ఆర్థికంగా కూడా. ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ భయంతో ఉన్నారు. డబ్బు తీసుకోవడం, మోసం చేయడం వంటివి ఇంతవరకు మా కుటుంబాల్లో ఎక్కడ లేదు. నేను చెప్పేదే ఒక్కటే రమ్య రఘపతి కేసులో నాకు, నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు. చదవండి: 11వ బిడ్డకు జన్మనివ్వబోతోన్న ప్రముఖ సింగర్ నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. -
నటుడు నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు.. కోట్లలో మోసం!
నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. తాజాగా ఈ వివాదంపై స్పందించిన నటుడు నరేష్.. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. కాగా ప్రస్తుతం నరేష్‌తో రమ్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. -
15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి, విడాకులు.. చెరుకు తోటలోకి లాక్కెళ్లి!
సాక్షి, మండ్య(కర్ణాటక): విడిపోయి ఉంటున్న మాజీ భార్యను కిరాతక భర్త దారుణంగా గొంతు కోసి చంపాడు. ఈ దుర్ఘటన మండ్య తాలూకాలోని రాగిముద్దనహళ్ళి గ్రామంలో చోటుచేసుకుంది. హతురాలు షాలిని (32), కాగా నిందితుడు సురేష్ (40). వివరాలు.. వీరిద్దరూ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య, అలాగే అత్త– కోడలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాలుగైదు సంవత్సరాల క్రితం షాలిని భర్త నుంచి విడాకులు తీసుకుని తన ఇంట్లోనే పిల్లలతో ఉంటూ కూలిపనులకు వెళ్లేది. డ్రైవర్ అయిన సురేష్ శుక్రవారం సాయంత్రం కూలి పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న షాలినిని దగ్గర్లోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి చాకుతో గొంతుకోసి ప్రాణాలు తీశాడు. తరువాత పరారయ్యాడు. మండ్య గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య? -
పెగాసెస్: ప్రిన్సెస్ ఫోన్ హ్యాక్ చేసిన మాజీ భర్త
దుబాయ్: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయా బింట్, ఆమె న్యాయవాదుల ఫోన్లను హ్యాక్ చేయమని ఆదేశించినట్లు తెలిసింది. వారి పిల్లల కస్టడీకి సంబంధించిన ఇంగ్లండ్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్ కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీని విచారణలో భాగంగా మొహమ్మద్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయాను వెంటాడి.. బెదిరింపులకు గురి చేసినట్లు ఇంగ్లండ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రిన్సెస్ హయా ఫోన్ హ్యాక్ చేయడం కోసం మహమ్మద్ అధునాతన "పెగసస్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ జాతీయ భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవడానికి దేశాల కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది. ఇది మనదేశలో కూడా పెగాసస్ పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొహమ్మద్.. తన మాజీ భార్య, జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి ప్రిన్సెస్ హయా బింట్ అల్-హుస్సేన్‌తో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నట్లు తెలిసింది (చదవండి: మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..) మొహమ్మద్ కోసం పనిచేస్తున్న వారు బ్రిటిష్ రాజధాని సమీపంలోని హయా ఎస్టేట్‌కి ప్రక్కనే ఒక భవంతిని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ చర్యలను ఇంగ్లండ్ కోర్టు తప్పుపట్టింది. హయాను వెంటాడే ఈ చర్యల వల్ల ఆమె ఎంతో అసురక్షితంగా ఫీలవుతుందని.. ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది అని కోర్టు అభిప్రాయపడింది. మొహమ్మద్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాడని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడమే కాక వారి ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడని కోర్టు నిర్ధారించిన 19 నెలల తర్వాత తాజాగా తీర్పులు వెల్లడించింది. ఈ సందర్భంగా "తాజాగా వెల్లడయిన అంశాలు విశ్వాసాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి" అని ఇంగ్లండ్, వేల్స్‌లోని కుటుంబ విభాగం అధ్యక్షుడు జడ్జి ఆండ్రూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. (చదవండి: ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు.. ) మొహమ్మద్ షేక్ కోర్టు తీర్మానాలను తిరస్కరించారు, అవి అసంపూర్ణ వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. "నాపై చేసిన ఆరోపణలను నేను ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నాను.. ఇప్పుడు కూడా అదే చేస్తాను" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నేళ్ల క్రితం హయా(47), తన ఇద్దరు పిల్లలు జలీలా(13), జాయెద్‌లను తీసుకుని బ్రిటన్ పారిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీకి సంబంధించి మొహమ్మద్, హయాల మధ్య సుదీర్ఘమైన, ఖరీదైన న్యాయపోరాటం జరుగుతుంది. అంతేకాక హయా తన బ్రిటిష్ అంగరక్షకులలో ఒకరితో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హ్యాకింగ్‌కు గురి అయిన వారిలో హయా తరఫు న్యాయవాది ఫియోనా షాక్లెటన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్) హ్యాకింగ్ వార్తలు వెలుగు చూసిన తర్వాత పెగసస్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభించినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని.. యూఏఈతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎన్ఎస్ఓ వెల్లడించినట్లు హయా తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై ఎన్ఎస్ఓ స్పందించలేదు. చదవండి: ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది -
పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం
వాషింగ్టన్/ఫ్లోరిడా: విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు అతడి మాజీ భార్యపై ఎక్కడో ఓ చోట కాస్త అసహనం, కోపం, అనుమానం ఉంటాయి. తన భర్త మాజీ భార్యను మళ్లీ కలుస్తున్నాడేమో.. వారిద్దరు మాట్లాడుకుంటున్నారేమో అనే అనుమానం సహజం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తి విరుద్ధం. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఆ వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌కు డెబ్బీ నీల్-స్ట్రిక్ల్యాండ్తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది నవంవర్ 22న జిమ్, డెబ్బీ వివాహం చేసుకున్నారు. ఇక జిమ్ మాజీ భార్య మైలాన్(59) గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కేవలం 8 శాతం పని చేయడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. మైలాన్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. కానీ మ్యాచ్ కాలేదు. అప్పటికి కేవలం రెండు రోజుల ముందే జిమ్, డెబ్బీల వివాహం జరిగింది. మైలాన్ పరిస్థితి తెలుసుకున్న డెబ్బీ ఆమెకు తన కిడ్నీ దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ ఇద్దరు మహిళలకు కేవలం ముఖ పరిచయం మాత్రమే. వారి మధ్య పెద్దగా స్నేహం కూడా లేదు. ఇక మైలేన్ ఆస్పత్రిలో చేరే నాటికి ఆమె కుమార్తె గర్భవతి. ఇలాంటి సమయంలో మైలాన్ తన కుమార్తె దగ్గర లేదు అనే ఊహే డెబ్బీకి నచ్చలేదు. ఆ పరిస్థితిని మార్చాలని భావించింది. గతంలో తన సోదరుడు కూడా ఇలానే ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఎదురు చూస్తూ.. డెబ్బీ కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో డెబ్బీకి తెలుసు. అందుకే తన కిడ్నీ దానం చేయాలని భావించింది. ఇక డాక్టర్లు డెబ్బీకి రక్తం, కణజాల టెస్ట్ చేశారు. ఈ రెండు మ్యాచ్ అయ్యాక అత్యంత క్లిష్టమైన మరో టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో భాగంగా పైప్ ద్వారా 24 గంటల పాటు డెబ్బీ మూత్రాన్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు. అన్ని మ్యాచ్ కావడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌కు సిద్ధం చేశారు వైద్యులు. జిమ్, డెబ్బీల వివాహం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. స్పృహలోకి వచ్చాక మైలాన్, డెబ్బీ ఒకరి యోగ క్షేమాల గురించి ఒకరు ఆరా తీశారు. ఆ తర్వాత మైలాన్ తన కుమార్తె ఇంటికి.. డెబ్బీ జిమ్ ఇంటికి వచ్చారు. ఇకపైన జీవితాంతం తామిద్దరం కిడ్నీ సిస్టర్స్‌గా ఉంటామన్నారు. చదవండి: ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక -
భార్యను చంపేందుకు పోలీసుకే సుపారీ
వాషింగ్టన్: విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి ప్లాన్ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులు దొరికిపోయారు. అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి(52) అనే ప్రియురాలు ఉంది. ఈ నేపథ్యంలో మిడిలెసెక్స్ కౌంటీ కోర్టుహౌస్‌లో 2018, జూన్‌లో ఓ కేసు విచారణ సందర్భంగా ‘నా మాజీ భార్యను చంపాలి. నీకు ఎవరైనా కిరాయి హంత`కుడు తెలుసా?’ అని సహచర ఖైదీని నర్సన్ అడిగాడు. నర్సన్తో సరే అని చెప్పినా, తర్వాత ఆ విషయాన్ని ఆ ఖైదీ జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు. దీంతో ఓ అండర్‌కవర్ ఏజెంట్ రంగంలోకి దిగాడు. గతేడాది ఆగస్ట్‌లో కిరాయి హంతకుడిలా వచ్చిన పోలీస్ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్లో నర్సన్, సంధ్య కలిశారు. ‘నా జీవితం నుంచి ఆమె(మాజీ భార్య) శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఇక ఎప్పుడూ తిరిగి రాకూడదు’ అని నర్సన్ అతడితో చెప్పాడు. ఈ సందర్భంగా భార్య పూర్తి వివరాలను అందించాడు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందని నర్సన్ అడగ్గా..‘దాదాపు 10,000 డాలర్లు ఖర్చువుతుంది. ముందే డౌన్‌పేమెంట్ ఇవ్వాలి’అని అధికారి అన్నాడు. దీంతో ముందు వెయ్యి డాలర్లు ఇస్తానని నర్సన్ చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. డీల్ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేరం రుజువయితే వీరిద్దరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది. -
భార్యను ముక్కలుగా నరికి కూర వండాడు.!
మెక్సికో: ఓ కసాయి భర్త తాను మనిషిని అన్న విషయాన్ని మరచిపోయి తన మాజీ భార్యను అత్యంత క్రూరంగా హతమార్చాడు. మొదట గొంతు నులిమి చంపి, ఆ తరువాత కన్న బిడ్డల ముందే ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెసర్ లోపేజ్, మెగ్డలీనాలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లలు మాత్రం అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు వెళ్లి వచ్చేవాళ్లు. ఈ నేపథ్యంలో ఓసారి మాజీ భర్త దగ్గర ఉన్న పిల్లలను తీసుకొచ్చేందుకు మెగ్డలీనా ...అతని ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెసర్ లోపేజ్ ఇంటికి వెళ్లి పరిశీలించగా మెగ్డలీనా శరీరం ముక్కలు ముక్కులగా నరికి ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె కొన్ని శరీర భాగాలు ఫ్రిజ్‌లో, మరికొన్ని భాగాలు ప్రెషర్ కుక్కర్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా హంతకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు పరారీలో ఉన్న సెసర్ లోపేజ్ కోసం గాలిస్తున్నారు. -
కూతుర్ని చూడనివ్వలేదని..
సింగపూర్: మాజీ భార్య గొంతుకోసిన కరుణాకరణ్ అనే భారతీయ వ్యక్తికి 8 సంవత్సరాల జైలుతో పాటు తొమ్మిది బెత్తం దెబ్బలను సింగపూర్ కోర్టు శిక్షగా విధించింది. కరుణాకరణ్‌కు సింగపూర్‌కు చెందిన భూమిచెల్వి రామస్వామితో 2011లో వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగినా తరువాత వివాదాలు మొదలయ్యాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకునే నాటికి వీరికి ఏడాది వయసున్న పాప ఉంది. తన పాపను చూడటానికి మాజీ భార్య అనుమతించడం లేదని కోపం పెంచుకున్న కరుణాకరణ్ 2013 అక్టోబర్‌లో ఆమె గొంతుకోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ కేసులో శనివారం తుదితీర్పు వెల్లడించిన న్యాయమూర్తి చన్ సెంగ్ ఓన్ కరుణాకరణ్‌కు 8 ఏళ్ల జైలు, 9 బెత్తం దెబ్బల శిక్షను ఖరారు చేశారు. కూతురుని చూడాలని అంతగా కోరుకుంటే న్యాయస్థానం ద్వారా ప్రయత్నించాల్సింది కానీ.. దాడికి పాల్పడటం ఎంతమాత్రం సరికాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
అనారోగ్యంతో ఉన్న మాజీ భార్యపై..
న్యూఢిల్లీ: మాజీ భార్యపై లైంగిక దాడి జరిపిన ఓ వ్యక్తి ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. తనపై మాజీ భార్త అఘాయిత్యాన్ని ధైర్యంగా వెల్లడించిన బాధితురాలు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కోర్టు పేర్కొంది. దక్షిణ ఢిల్లీ వాసి అయిన దోషికి జైలుశిక్షతోపాటు రూ. 20వేల జరిమానా విధించింది. జరిమానాను బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది. 'ఆమె అనారోగ్యంతో బలహీనంగా ఉండటం వల్ల నిందితుడు బలాత్కారం చేసినా.. ప్రతిఘటించలేకపోయింది. ఈ విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నది. అదేవిధంగా ప్రాసిక్యూషన్ నిందితుడిపై మోపిన అభియోగాలన్నిటినీ రుజువుచేయడంలో విజయవంతమైంది. కాబట్టి నిందితుడు ఐపీసీ సెక్షన్ 376 (రేప్) కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారిస్తున్నది' అని అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ తెలిపారు. 'బాధితురాలి ప్రైవేటు అంగాలపై ఎలాంటి గాయాలు లేనంతమాత్రాన.. ఇది లైంగిక దాడి నేరం కాబోదనడానికి లేదు' అని స్పష్టం చేశారు. 'ఘటన జరిగిన వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫిర్యాదు నమోదు చేయడంలో ఎలాంటి జాప్యానికి పాల్పడలేదు. నిందితుడిపై ఈ కేసులో ఆమె స్థిరంగా వ్యవహరించింది' అని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ ప్రకారం నిందితుడు 2013లో బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ఆమె వద్ద నుంచి రూ. 50వేలు తీసుకున్నాడు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగడంతో ఆమె ఇంటికి వచ్చిన అతను.. ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.