
మాజీ భార్య తనను వేధింపులకు గురి చేస్తోందంటూ ప్రముఖ మలయాళ నటుడు బాలా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో పాటు మరో యూట్యూబర్‌పై కొచ్చి పోలీసులను ఆశ్రయించారు. అయితే అతని మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ నటుడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. తనను బాలా వేధించడంతో పాటు అత్యాచారం చేశాడంటూ ఎలిజబెత్ ఉదయన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై నటుడు బాలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. అంతకుముందే నటుడి భార్య కోకిల సైతం తన భర్తపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎలిజబెత్‌ను కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
బాలా వీడియోలో మాట్లాడుతూ.."దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. ఈ వివాదంపై ఇది నా చివరి వీడియో కావాలని కోరుకుంటున్నా. ప్రియమైన ఎలిజబెత్.. మీ కుటుంబం పట్ల నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది సోషల్ మీడియా అటెన్షన్ కాదు.. ఈ సమయంలో మీకు వైద్యం చాలా అవసరం. మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉన్నట్లయితే సరైన వైద్యం తీసుకోండి. లేదంటే మీ సోదరులు, తల్లిదండ్రులతో కలిసి వైద్యుని వద్దకు కెళ్లండి. తనపై తప్పుడు ప్రచారం మానేయండి. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి. లేని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకాడను' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. నటుడు బాలా.. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట విడిపోయారు. అయితే ఈ విషయంలో కొందరు ఎలిజబెత్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మీవల్లే ఎలిజబెత్ అలా ప్రవర్తిస్తోందని నటుడు బాలాపై కొందరు విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment