మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.
మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్‌లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది.
అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్ కానుంది.
The #Barroz3D Hindi trailer is here! Thrilled to present this magical adventure in Hindi, brought to you in collaboration with #Penstudios. The Hindi version hits theatres on December 27. https://t.co/3pgb0ku861#Barroz
— Mohanlal (@Mohanlal) December 11, 2024
Comments
Please login to add a commentAdd a comment