భార్యను చంపేందుకు పోలీసుకే సుపారీ | Indian-American Narsan Lingala Plotted To Kill Wife | Sakshi
Sakshi News home page

నా భార్యను చంపేయాలి!

Published Fri, Feb 8 2019 4:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Indian-American Narsan Lingala Plotted To Kill Wife - Sakshi

ప్రియురాలు సంధ్యారెడ్డితో నర్సన్‌(ఫైల్‌)

వాషింగ్టన్‌: విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి ప్లాన్‌ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులు దొరికిపోయారు. అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్‌ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి(52) అనే ప్రియురాలు ఉంది. ఈ నేపథ్యంలో మిడిలెసెక్స్‌ కౌంటీ కోర్టుహౌస్‌లో 2018, జూన్‌లో ఓ కేసు విచారణ సందర్భంగా ‘నా మాజీ భార్యను చంపాలి. నీకు ఎవరైనా కిరాయి హంత`కుడు తెలుసా?’ అని సహచర ఖైదీని నర్సన్‌ అడిగాడు. నర్సన్‌తో సరే అని చెప్పినా, తర్వాత ఆ విషయాన్ని ఆ ఖైదీ జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు. దీంతో ఓ అండర్‌కవర్‌ ఏజెంట్‌ రంగంలోకి దిగాడు.

గతేడాది ఆగస్ట్‌లో కిరాయి హంతకుడిలా వచ్చిన పోలీస్‌ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌ మాల్‌లో నర్సన్,  సంధ్య కలిశారు. ‘నా జీవితం నుంచి ఆమె(మాజీ భార్య) శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఇక ఎప్పుడూ తిరిగి రాకూడదు’ అని నర్సన్‌ అతడితో చెప్పాడు. ఈ సందర్భంగా భార్య పూర్తి వివరాలను అందించాడు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందని నర్సన్‌ అడగ్గా..‘దాదాపు 10,000 డాలర్లు ఖర్చువుతుంది. ముందే డౌన్‌పేమెంట్‌ ఇవ్వాలి’అని అధికారి అన్నాడు. దీంతో ముందు వెయ్యి డాలర్లు ఇస్తానని నర్సన్‌ చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. డీల్‌ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేరం రుజువయితే వీరిద్దరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement