
Actress Amber Heard Cries At Court: ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై వేసిన పరువు నష్టం దావా కేసుపై ప్రస్తుత కోర్టులో విచారణ జరుగుతోంది. వారు కలుసున్నపుడు జానీ డేప్ తరచూ కొడుతుండేవాడని, తాను గృహహింస బాధితురాలిని అంటూ అంబర్ హెర్డ్ ఇటీవల తను రాసిన ఓ వ్యాసంలో వెల్లడించింది. దీంతో తనపై అంబర్ తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంటూ జానీ ఏప్రిల్ 20న మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది.
చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా!
ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన హియరింగ్‌లో అంబర్, జానీ డేప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. జానీ తనను తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించింది అంబర్. ‘మా కొద్దిపాటి వైవాహిక జీవితంలో జానీ తరచూ కొట్టేవాడు. అంతేకాదు అసభ్యపదజాలంతో దూషించేవాడు. మొదటి సారి తన టాటూను చూసి నవ్వానని కొట్టాడు. ఆయన శరీరంపై చెదిరిన ఉన్న టాటూ ఏంటని అడగ్గా విన్నో(జానీ డేప్ మాజీ ప్రియురాలు విన్నోనా రైడర్ పేరు) అని సమాధానం ఇచ్చాడు. అది జోక్ అనుకుని నవ్వేశాను. దీంతో నా చెంపపై కొట్టి నీకు ఇది సరదాగా ఉందా? అంటూ అభ్యంతరకర పదం(బీ..) వాడాడు’ అని పేర్కొంది.
చదవండి: సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా?
ఆ సమయంలో తనకు ఏం అర్థం కాలేదని, షాక్‌తో అతనివైపే ఉండిపోయాను’ అని చెప్పింది. అంతేగాక జానీ తనపై పలుమార్లు దాడి చేశాడని, మద్యం, మాదకద్రవ్యాల మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ భౌతికంగా గాయపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇతర యువతుల పట్ల సన్నిహితంగా ఉన్న సంఘటనలు గురించి తరచూ తన దగ్గర ప్రస్తావించేవాడని పేర్కొంది. ఈ క్రమంలో ఓ రోజు తన జీవితంలో అంత్యంత చేదు సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేని చెప్పింది. ఓ రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకుని ఫుల్ మత్తులో ఉన్న జానీ తన బట్టలు చించి, శరీరా భాగాల్లో కోకైన్ కోసం వేతికాడంటూ నాటి చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అంబర్.