Aamir Khan Special Dinner To Russo Brothers, Dhanush With His Ex-Wife Kiran Rao - Sakshi
Sakshi News home page

Aamir Khan: మాజీ భార్యతో స్టార్‌ హీరో స్పెషల్‌ డిన్నర్‌.. ఫొటోలు వైరల్‌

Published Fri, Jul 22 2022 1:29 PM | Last Updated on Fri, Jul 22 2022 2:47 PM

Aamir Khan Special Dinner To Russo Brothers With His Ex Wife Kiran Rao - Sakshi

Aamir Khan Special Dinner To Russo Brothers: కోలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ధనుష్‌ ఒకరు. తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్‌ తాజాగా నటించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. స్టార్‌ హాలీవుడ్‌ డైరెక్టర్లు రూసో బ్రదర్స్‌ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా, అలాగే ధనుష్‌తో కలిసి ఈ మూవీని వీక్షించేందుకు రూసో బ్రదర్స్‌ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ హాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్లు భారతదేశానికి మొట్ట మొదటిసారిగా రావడంతో మంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌. గురువారం (జులై 21) ఇండియా వచ్చిన ఈ అన్నదమ్ములను స్వయంగా వారి ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్‌తోపాటు అమీర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. అయితే అమీర్‌-కిరణ్‌ రావు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో విడిపోయిన స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్‌ చెప్పిన మాటలకు ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది. ఇక ఈ విందులో అతిథులకు ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలను రుచి చూపించాడని టాక్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్‌.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్‌ హిట్‌..
బేబీ బంప్‌తో అలియా భట్‌ !.. లీకైన ఫొటోలు..
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement