Hollywood director
-
ఇక సినిమాల్లో చేయడానికి ఏమీ లేదు: హాలీవుడ్ దర్శకుడు
హాలీవుడ్ సినీ చరిత్రలో దర్శకుడు-నటుడు ఉడీ అలెన్‌ది ప్రముఖ స్థానం. ముఖ్యంగా రొమాంటిక్ జానర్లో ఆయన తెరకెక్కించిన ‘అన్నీహాల్, మాన్ హాట్టన్, మిడ్నైట్ ఇన్ ప్యారిస్, టు రోమ్ విత్ లవ్, ఏ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించిన ఉడీ అలెన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘రొమాన్స్ ఆఫ్ ఫిల్మ్‌మేకింగ్ ఈజ్ గాన్’ అన్నారు. ఇక సినిమాల పరంగా చేయడానికి ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు 88 ఏళ్ల ఉడీ. ఆయన తెరకెక్కించిన ‘కూప్ ది చాన్స్’ గత ఏడాది ఫ్రాన్స్‌లో విడుదలైంది. దర్శకుడిగా ఉడీకి ఇది 50వ చిత్రం. ఇదే చివరి చిత్రం అన్నట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రం రిలీజ్ నార్త్ అమెరికాలో లేట్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఉడీ అలెన్ మాట్లాడుతూ..‘నేనొక సినిమా చేశాక దాని గురించి పట్టించుకోను. డిస్ట్రిబ్యూషన్ అనేది నా పని కాదు. ఇప్పుడు పంపిణీ అంటే ఏ మూవీ అయినా రెండు వారాలే. ఒకప్పుడు నా ‘అన్నీహాల్’ సినిమా న్యూయార్క్ థియేటర్లో ఏడాది ఆడింది. ఒక థియేటర్లో 6,7 నెలలు ఆడాక వేరేవాళ్లు తీసుకునేవారు. అక్కడ కొన్ని నెలలాడేది. కానీ ఇప్పుడు సినిమా వ్యాపారం మారిపోయింది.ఈ మార్పు ఆకర్షనీయంగా లేదు’ అన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుంది: హాలీవుడ్ టాప్ డైరెక్టర్
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల రేంజ్ పెరిగిపోయింది. హాలీవుడ్ నుంచి కూడా ఈ హీరోలకు పిలుపు వస్తోంది. తాజాగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ తారక్‌తో కలిసి పని చేయాలని ఉందని మనసులోని మాట బయటపెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఆయనకు ఏ ఇండియన్ స్టార్‌తో మీరు కలిసి పని చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీకి జేమ్స్ మాట్లాడుతూ.. 'గతేడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్ఆర్ఆర్లో సూపర్‌గా కనిపించిన ఆ హీరో ఎవరు? అతడి పేరు ఏంటి? పులులతో కలిసి బోనులో నుంచి ఓ వ్యక్తి బయటకు వస్తాడు కదా! అతడితో కలిసి పని చేయాలనుంది. తను చాలా అద్భుతంగా నటించాడు. ఫిదా అయిపోయా. అతడికి ఎలాంటి పాత్ర ఇవ్వాలనేదాని గురించి ఆలోచించడానికి కొంత సమయం పడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే జేమ్స్ గన్.. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు. అతడు డైరెక్ట్ చేసిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ మూడో సీక్వెల్ మే 5న రిలీజ్ కానుంది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీలో నటించేందుకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తారక్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 20న రీరిలీజ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ అయిన ఆస్ట్రేలియా మెల్బోర్న్లో సింహాద్రిని ప్రదర్శించబోనున్నారు. చదవండి: మైసూర్ నవాబ్ మనవరాలిని సజీవ సమాధి చేసిన భర్త -
రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తిన జేమ్స్ కామెరూన్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, హాలీవుడ్ దిగ్గజం, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వారిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టాలీవుడ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు కామెరూన్. ఆర్ఆర్ఆర్ను రెండుసార్లు చూసినట్లు రాజమౌళితో చెప్పారు. దీంతో జక్కన్న వల్లే తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడుతూ.. మీ సినిమాలు టైటానిక్, టర్మినేటర్తో పాటు అవతార్-2 చూశానని తెలిపారు. మీరే నాకు ఆదర్శమని కామెరూన్‌ను కొనియాడారు. మీ ప్రశంసలు అవార్డ్ కంటే గొప్పవని రాజమౌళి అన్నారు. మీరు సినిమా చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని కామెరూన్‌తో ముచ్చటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మీరు అనలైజ్ చేయడం బాగుందన్నారు. దీనికి కామెరూన్ స్పందిస్తూ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. మీ సినిమా చూసినప్పుడు అద్భుతంగా అనిపించిందన్నారు. ఈ స్టోరీ తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్నారు. సినిమాలోని ట్విస్టులు, స్నేహితుల పాత్రలు మలిచిన విధానం అద్భుతమని కొనియాడారు. అక్కడే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. మీరు అందించిన మ్యూజిక్ అద్భుతమన్నారు. ఆర్ఆర్ఆర్ గతేడాది థియేటర్లలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్.. తాజాగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు గెలుచుకున్న తర్వాత జేమ్స్ కామెరూన్ ఏకంగా రాజమౌళిని మెచ్చుకోవడం చిత్రబృందానికి దక్కిన మరో గౌరవంగా టాలీవుడ్ అభిమానులు భావిస్తున్నారు. "If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2— RRR Movie (@RRRMovie) January 21, 2023 -
రాజమౌళిపై ‘ది గ్రే మ్యాన్’ డైరెక్టర్స్ ఆసక్తికర ట్వీట్.. జక్కన్న రిప్లై చూశారా?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు జక్కన్న. ఆయన దర్శకత్వానికి, హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ చూసి హాలీవుడ్ డైరెక్టర్స్, నటీనటులు సైతం రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే అవెంజర్స్ వంటి క్రేజీ సిరీస్‌ను తెరక్కించిన రూసో బ్రదర్స్ తాజాగా రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూసో బ్రదర్స్ తాజాగా ది గ్రే మ్యాన్ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. చదవండి: టాలీవుడ్‌పై ‘సహజనటి’ జయసుధ సంచలన వ్యాఖ్యలు రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించాడు. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్‌లో జక్కనన్ను కలిసిన రూసో బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. వారి ట్వీట్‌పై జక్కన్న స్పందిస్తూ.. తమను కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరోసారి మిమ్మల్ని కలిసి మీ క్రాప్ట్స్ నుంచి కొంత పని నేర్చుకోవాలని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు హఠాన్మరణం Such an honor getting to meet THE great S.S. Rajamouli… https://t.co/TXly90zGt3 — Russo Brothers (@Russo_Brothers) July 29, 2022 The honour and pleasure are mine..🙏🏼 It was a great interaction . Looking forward to meet and learn a bit of your craft. https://t.co/NxrzuCv1w3 — rajamouli ss (@ssrajamouli) July 30, 2022 -
మాజీ భార్యతో కలిసి డైరెక్టర్లకు విందు ఇచ్చిన స్టార్ హీరో..
Aamir Khan Special Dinner To Russo Brothers: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా నటించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. స్టార్ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా, అలాగే ధనుష్‌తో కలిసి ఈ మూవీని వీక్షించేందుకు రూసో బ్రదర్స్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు భారతదేశానికి మొట్ట మొదటిసారిగా రావడంతో మంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గురువారం (జులై 21) ఇండియా వచ్చిన ఈ అన్నదమ్ములను స్వయంగా వారి ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్‌తోపాటు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. అయితే అమీర్-కిరణ్ రావు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో విడిపోయిన స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్ చెప్పిన మాటలకు ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది. ఇక ఈ విందులో అతిథులకు ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలను రుచి చూపించాడని టాక్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Laal Singh Chaddha (@aamirkhanuniverse) -
ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు..
The Gray Man Directors Russo Brothers: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో పర్వాలేదనిపించిన ధనుష్.. హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ త్వరలో ఇండియాకు రానున్నారు. అది కూడా ధనుష్ కోసం భారత్‌కు వస్తున్నట్లు వాళ్లు తెలిపారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో ఇండియాకు వస్తున్నట్లు రూసో బ్రదర్స్ చెప్పుకొచ్చారు. ''మేం తెరకెక్కించిన కొత్త సినిమా 'ది గ్రే మ్యాన్' వీక్షించేందుకు, మా స్నేహితుడు ధనుష్‌ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం'' అని తెలిపారు. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్', 'కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్', 'అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్', 'అవేంజర్స్: ఎండ్ గేమ్' వంటి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. కాగా మార్క్ గ్రీన్ రాసిన పుస్తకం ఆధారంగా రూసో బ్రదర్స్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాకు తగిన విధంగా జో రూసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ఫీల్ స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమా జులై 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ప్రముఖ డైరెక్టర్.. ముగ్గురం ఒకేసారి బెడ్ షేర్ చేసుకుందామన్నాడు
జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది 'నో టైమ్ టు డై'. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన ఈ చివరి మూవీకి క్యారీ జోజీ ఫుకునాగా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ డైరెక్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు క్యారీపై ముగ్గురు మహిళలు తమపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. తనతో లైంగిక సంబంధం కోసం ఒత్తిడి చేశాడని 18 ఏళ్ల అమ్మాయి గతవారం మొదటిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్యారీతో దిగిన సెల్ఫీని పంచుకుంటూ 'నాకు గతిలేక 30 ఏళ్ల క్యారీతో లైంగిక సంబంధం కొనసాగించాను. అతను రోజు నాతో పడకసుఖం అనుభవించేవాడు. అతనికి భయపడుతూనే సంవత్సరాలు గడిపాను' అని తెలిపింది. అయితే తమ రిలేషన్షిప్ గురించి ఎవరైనా అడిగితే అందరిముందు తన మేనకోడలు, బంధువు లేదా సోదరిగా నటించమని క్యారీ చెప్పాడని ఆమె పేర్కొంది. తన గురించి ఎవరికీ నిజం చెప్పేవాడు కాదని రాసుకొచ్చింది. అతనితో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత ఆ రిలేషన్ నుంచి బయటపడ్డానని, తనకు పీటీఎస్డీ ఉన్నట్లు గుర్తించి ఒక సంవత్సరం పాటు చికిత్స తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే మరో ఇద్దరు మహిళలు సైతం క్యారీపై లైంగిక ఆరోపణలు చేశారు. '20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు క్యారీ డైరెక్ట్ చేసిన ఒక షోలో కలిసి పనిచేశాం. ఆ సమయంలో అతడు మూడేళ్లుగా మమ్మల్ని లైంగికంగా వేధించాడు. ఓ సారైతే క్యారీ ఇంటికి వచ్చి, అక్కడ ముగ్గురం కలిసి బెడ్ షేర్ చేసుకుందామని అడిగాడు. దానికి మేము ఒప్పుకోలేదు' అని ఆ ఇద్దరు నటీమణులు ఫేస్బుక్లో సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై డైరెక్టర్ క్యారీ జోజీ ఇప్పటివరకు స్పందించలేదు. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘పవన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించబోయే 27 వ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల పవన్ బర్త్‌డే(సెప్టెంబర్ 2) సందర్భంగా దర్శకుడు క్రిష్ ట్విట్టర్ వేదికగా పవన్ 27వ సినిమా ప్రి లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అప్పట్లో జరిగిన పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుందంటూ.. పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ 27: అభిమానులకు మరో ట్రీట్) ఇక హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్ బెన్‌లాక్ ఈ సినిమాకు (వీఎఫ్ఎక్స్)విజువల్ ఎఫెక్ట్స్ అందించనున్నారు. ఈ మేరకు ఆయన గత వారమే ట్విటర్లో స్పందించారు. ‘పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. క్రిష్, పవన్ కల్యాణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ దర్శకుడు ఈ సినిమాకు ఎంటర్ అవ్వడంతో మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోయాయి. కాగా బెన్‌లాక్ తెలుగులో పనిచేయడం ఇదే తొలిసారి. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తూ.. బెన్లాక్కు ఆల్ దబెస్ట్ చెబుతున్నారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని కోరుతున్నారు. (ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?) Happy Birthday to @PawanKalyan. It was a pleasure working with you and @DirKrish on the epic #PSPK27 🙏 pic.twitter.com/o0lRFcYbBE — Ben Lock (@benlock) September 2, 2020 -
హాలీవుడ్ దర్శకుడు అలెన్ పార్కర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెన్ పార్కర్ (76) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ‘బగ్స్ మాలోనే, మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ఎవిత, ఫేమ్, ద కమిట్మెంట్స్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు అలెన్. ఆయన 14 సినిమాలు తెరకెక్కించారు. వాటిలో సుమారు 19 బాఫ్తా అవార్డులు, పది గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, 6 అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఉన్నాయి. అలెన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
పోర్న్ స్టార్‌గా మారిన దర్శకుడి కుమార్తె..అరెస్ట్
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కుమార్తె మికేలాపై గృహహింస కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త చక్పాంకో(50) ధృవీకరించారు. మికేలాపై శనివారం కేసు నమోదైందని, 1000 డాలర్ల పూచికత్తుపై బెయిల్ కూడా వచ్చిందన్నారు. మరో 12 గంటల్లో మికేలా విడుదలకానుందని తెలియజేశారు. కాగా, 23 ఏళ్ల మికేలా పోర్న్‌స్టార్‌గా కెరీర్ ఆరంభించాలని నిర్ణయం తీసుకున్న రెండు వారాలకే అరెస్ట్ కావడం గమనార్హం. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో గృహహింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మికాలె కాబోయే భర్త చక్ పాంకో కూడా ధ్రువీకరించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. (చదవండి : పోర్న్ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె.) మికేలాను స్పీల్బర్గ్ ఆయన భార్య కేట్ కాప్షా దత్తత తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తాను పోర్న్ స్టార్‌గా మారానని ప్రకటించిన మికాలే.. అలా మారడం తనకు మానసికంగా చాలా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదని వెల్లడించింది. కాబోయే భర్త చక్ పాంకో (47) సైతం పోర్న్ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. -
పోర్న్ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె..
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కుమార్తె మికేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోర్న్ స్టార్‌గా కెరీర్ ఎంట్రీని ఆరంభించాలని నిర్ణయించుకున్న 23 ఏళ్ల మికేలాను స్పీల్బర్గ్ ఆయన భార్య కేట్ కాప్షా దత్తత తీసుకున్నారు. మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన స్ర్టిప్ క్లబ్లో ఎంట్రీ కోసం స్ర్టిప్పర్ లైసెన్స్ పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మికేలా తన స్టేజ్ నేమ్‌ను షుగర్ స్టార్‌గా ఎంచుకున్నారని ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ వెల్లడించింది. ఈ వృత్తి పట్ల వ్యామోహం ఉండటం సిగ్గుపడే విషయం ఎంతమాత్రం కాదని, తానిప్పుడే అడల్ట్ వినోద కెరీర్‌ను చేపట్టానని ఇది సానుకూల, సాధికారిక నిర్ణయమని అన్నారు. సురక్షిత, పరస్పర అంగీకారమైన పనులు చేపట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తన నిర్ణయానికి తల్లితండ్రులు విస్మయం చెందలేదని చెప్పుకొచ్చారు. కాబోయే భర్త చక్ పాంకో (47) సైతం పోర్న్ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. కాగా, చిన్నతనంలో తాను కుంగుబాటుకు గురయ్యానని లైంగిక వేధింపులకు లోనయ్యానని ది సన్తో మాట్లాడుతూ ఆమె వెల్లడించారు. -
కాల్ సెంటర్లో ఏమైంది?
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్పెరీ చిన్ దర్శకుడు. మంచు విష్ణు నిర్మాణంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణుకి చెల్లెలిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. రుహానీ సింగ్ హీరోయిన్. ఈ సినిమాకు ‘కాల్ సెంటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. కథ కాల్ సెంటర్ చుట్టూ తిరుగుతుందా? వేచి చూడాలి. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ సినిమా ద్వారా సునీల్ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. -
నెక్ట్స్ ఏంటి?
‘డంకర్క్’ తర్వాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఏ జానర్లో ఉంటుందో అనే ఆసక్తి హాలీవుడ్ ఇండస్ట్రీలో, ఆయన అభిమానుల్లో ఉంది. లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తేంటంటే.. నోలన్ ఓ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్టు హాలీవుడ్ సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందట. ‘బ్లాక్లాన్స్మేన్’ చిత్రంలో హీరోగా నటించిన జాన్ డేవిడ్ వాషింగ్టన్ ఇందులో హీరోగా నటించనున్నారట. ‘ట్విలైట్’ కథానాయిక రోబర్ట్ పాటిసన్ హీరోయిన్గా నటిస్తారట. నోలన్, అతని భార్య ఎమ్మా థామస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ ఈ చిత్రాన్ని జూలై 17, 2020లో విడుదల చేస్తామని ప్రకటించారు. -
జూలై సెంటిమెంట్
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తదుపరి సినిమా ఏంటా? అని ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నోలన్ ఎప్పటిలానే ఏం చేస్తున్నాడో, ఎవరితో చేస్తున్నాడో అన్న విషయం ఇంకా ప్రకటించలేదు. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించేశారు. 2020 జూలై 17న నోలన్ కొత్త చిత్రం రాబోతోందని నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ కంపెనీ ప్రకటించింది. నోలన్ రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలను ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. నోలన్ తన సినిమాలను జూన్– జూలై సీజన్లో రిలీజ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ సెంటిమెంట్‌నే మళ్లీ రిపీట్ చేశారు. నోలన్ గత ఐదు చిత్రాల్లో 4 సినిమాలు జూలైలో రిలీజ్ కావడం విశేషం. -
ట్వీటే చేటాయెనె?
ట్వీటర్‌ని మన అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అలా అభిప్రాయాలు పంచుకోవడమే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కొంప ముంచింది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయన వేసిన కొన్ని జోక్స్ వల్ల హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ’ సినిమాకి డైరెక్టర్‌గా ఆయన సీట్‌కే ఎసరొచ్చింది. విషయంలోకి వెళ్తే.. దాదాపు పదేళ్ల క్రితం ‘రేప్, చైల్డ్ అబ్యూస్ (చిన్నపిల్లలపై లెంగిక వేధింపులు) వంటి అంశాల గురించి కొన్ని ట్వీట్స్ పోస్ట్ చేశారు దర్శకుడు జేమ్స్ గన్. ఆయన ట్వీట్లు పలువురి మనోభావాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ జేమ్స్ గన్ను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాల్ట్ డిస్నీ చైర్మన్ అలన్ హార్న్ పేర్కొన్నారు. ఆయన చేసిన పాత ట్వీట్స్ గురించి జేమ్స్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ట్వీట్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దానికి క్షమాపణలు కోరుతున్నాను. అప్పటికీ ఇప్పటికీ కంప్లీట్‌గా డిఫరెంట్ పర్శన్‌ని అయ్యాను’’ అన్నారు. మరి.. జేమ్స్ ఇచ్చిన ఈ వివరణకు అలన్ హార్న్ కూల్ అవుతారా? ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ 3’ బాధ్యతలను తిరిగి ఇచ్చేస్తారా? ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? కాలమే చెప్పాలి. -
‘గాంధీ’ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో ఇక లేరు
-
‘గాంధీ’ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ చిత్రం ద్వారా మనదేశంలో సుప్రసిద్ధుడూ అయిన రిచర్డ్ అటెన్‌బరో (90) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం మధ్యాహ్న సమయంలో తుది శ్వాస విడిచారు. దాదాపు అర్ధశతాబ్దం పైగా నటునిగా, దర్శకునిగా హాలీవుడ్‌కి రిచర్డ్ అందించిన సేవలు కొనియాడదగ్గవి. ‘ఇన్ విచ్ వియ్ సర్వ్’ చిత్రం ద్వారా 1942లో నటునిగా చిత్రరంగప్రవేశం చేశారు రిచర్డ్. అయితే, ఆ చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ఆ తర్వాత లండన్ బిలాంగ్స్ టు మీ, మార్నింగ్ డిపార్చర్, బ్రైటన్ రాక్ తదితర చిత్రాల ద్వారా నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం 1950లో దర్శక, నిర్మాత బ్రయాన్ ఫోర్బ్స్తో కలిసి ఓ నిర్మాణ సంస్థ ఆరంభించి, ‘లీగ్ ఆఫ్ జెంటిల్‌మేన్’, ‘ది యాంగ్రీ సెలైన్స్’, ‘విజిల్ డౌన్ ది విండ్’ తదితర చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే దర్శకునిగా మారారు రిచర్డ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఓ! వాట్ ఎ లవ్లీ వార్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత దర్శక, నిర్మాతగా కొనసాగడంతో దాదాపుగా నటన తగ్గించేశారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా ఆయన దర్శకత్వం వహించిన ‘గాంధీ’ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల కితాబులు అందుకుంది. ఈ చిత్రానికి ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఆ చిత్రంలో గాంధీ పాత్ర పోషించిన బెన్ కింగ్స్లే ‘నా జీవితాంతం గుర్తుంచుకోదగ్గ చిత్రం ఇది. అటెన్‌బరోని మర్చిపోలేను’ అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే పుస్తకరూపంలో కూడా దొరుకుతోంది. ‘గాంధీ’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘చాప్లిన్’ ఒకటి. చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం రూపొందించారు. దర్శక, నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే ‘జురాసిక్ పార్క్’లో చేసిన జాన్ హమ్మొండ్ పాత్రకు అభినందనలు అందుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘పకూన్’. 2002లో ఇది విడుదలైంది. దర్శక, నిర్మాతగా ‘క్లోజింగ్ ది రింగ్’ చివరి చిత్రం. 2007లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత అటెన్‌బరో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన ఓ నర్సింగ్ హోమ్‌లో ఉంటూ, అక్కడే తుది శ్వాస విడిచారు. ఈ నెల 29న రిచర్డ్ అటెన్‌బరో తన 91వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఈలోపే ఈ విషాదం సంభవించింది. 90 నిండి 91లోకి అడుగుపెట్టాల్సి ఉండగా, అనారోగ్యం ఆయనను కబళించింది. రిచర్డ్ మరణం పట్ల ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామరూన్ సంతాపం వ్యక్తం చేస్తూ ‘గాంధీ’ చాలా గొప్ప చిత్రమనీ, అటెన్‌బరో మరణం హాలీవుడ్‌కి తీరని లోటని పేర్కొన్నారు.