బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు జక్కన్న. ఆయన దర్శకత్వానికి, హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇటీవల రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ చూసి హాలీవుడ్ డైరెక్టర్స్, నటీనటులు సైతం రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే అవెంజర్స్ వంటి క్రేజీ సిరీస్‌ను తెరక్కించిన రూసో బ్రదర్స్ తాజాగా రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూసో బ్రదర్స్ తాజాగా ది గ్రే మ్యాన్ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే.
చదవండి: టాలీవుడ్‌పై ‘సహజనటి’ జయసుధ సంచలన వ్యాఖ్యలు
రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించాడు. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్‌లో జక్కనన్ను కలిసిన రూసో బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘ది గ్రేట్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. వారి ట్వీట్‌పై జక్కన్న స్పందిస్తూ.. తమను కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరోసారి మిమ్మల్ని కలిసి మీ క్రాప్ట్స్ నుంచి కొంత పని నేర్చుకోవాలని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు హఠాన్మరణం
Such an honor getting to meet THE great S.S. Rajamouli… https://t.co/TXly90zGt3
— Russo Brothers (@Russo_Brothers) July 29, 2022
The honour and pleasure are mine..🙏🏼 It was a great interaction . Looking forward to meet and learn a bit of your craft. https://t.co/NxrzuCv1w3
— rajamouli ss (@ssrajamouli) July 30, 2022
Comments
Please login to add a commentAdd a comment