రాజమౌళి తనయుడి ట్వీట్.. నెటిజన్స్ ఆగ్రహం! | Netizens Slams Rajamouli Son Karthikeya For Japan Earthquake Post | Sakshi
Sakshi News home page

Karthikeya: కార్తికేయ ట్వీట్‌.. ఇండియా బోర్డర్‌కు వెళ్లమంటోన్న నెటిజన్స్!

Mar 21 2024 3:34 PM | Updated on Mar 21 2024 3:52 PM

Netizens Slams Rajamouli Son Karthikeya For Japan Earthquake Post - Sakshi

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం ప్రస్తుతం జపాన్‌లో ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్‌ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. జపాన్‌లో ఒక భారీ  బిల్డింగ్ 28వ ఫ్లోర్‌లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా  అనిపించిందని  కార్తికేయ రాసుకొచ్చాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా  భూకంపం ద్వారా కలిగే అనుభూతిని పొందానని రాసుకొచ్చారు.

మండిపడ్డ నెటిజన్స్..

అయితే ఇది చూసిన నెటిజన్స్ ఎస్ఎస్ కార్తికేయ తీరుపై మండిపడుతున్నారు. భూకంపం అంటే అదేమైనా జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ రాస్తూ భూకంపం అనేది నీ బకెట్ లిస్ట్‌లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్‌ విషయాన్ని ఫన్నీగా ట్వీట్ చేయడంపై కార్తికేయపై మండిపడుతున్నారు. అలాగే ఇండియా బోర్డర్‌కు వెళ్లి బాంబుల మోత కూడా ఆస్వాదించు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కార్తికేయ భూకంపంపై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఊపేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement