మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి | RRR Director SS Rajamouli Tweet On Japan Audience Response | Sakshi
Sakshi News home page

SS Rajamouli: మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి

Published Fri, Mar 22 2024 7:36 PM | Last Updated on Fri, Mar 22 2024 8:19 PM

RRR Director SS Rajamouli Tweet On Japan Audience Response - Sakshi

దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్‌ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్‌లో 100 ఏళ్లనాటి పురాతన  మ్యూజికల్‌ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

రాజమౌళి ట్విటర్‌లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్‌ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్‌ థియేటర్‌లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్‌ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్‌ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్‌లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా'  అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. 

కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్‌ అనే టైటిల్‌ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా.. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్‌ నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement