'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా? | Is Jr NTR Breaks Rajamouli Curse With Devara Movie? | Sakshi
Sakshi News home page

NTR-Rajamouli: రాజమౌళి సెంటిమెంట్.. కొడుకు కార్తికేయ ట్వీట్ వైరల్

Published Fri, Sep 27 2024 12:29 PM | Last Updated on Sat, Sep 28 2024 12:40 PM

Is Jr NTR Breaks Rajamouli Curse With Devara Movie?

టాలీవుడ్‌లో ఫేమస్ సెంటిమెంట్ ఒకటుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి హీరోకైనా సరే నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుంది. రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ.. ఇలా ఏ హీరో కూడా దీని బారి నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటిది 'దేవర' మూవీతో ఎన్టీఆర్ దీన్ని బ్రేక్ చేస్తాడా లేదా? అని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. మరి 'దేవర' రిలీజైపోయింది. ప్రేక్షకులు ఏమంటున్నారు? రాజమౌళి కొడుకు దీనిపై ఏం ట్వీట్ చేశాడు?

(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజ్‌కి ముందు మరీ ఎక్కువ అంచనాలు ఏర్పడటం వల్లనో ఏమో గానీ మిశ్రమ స్పందన వస్తోంది. చాలా బాగుందని అనట్లేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పట్లేదు. రెండు మూడు రోజులు ఆగితే ఫెర్ఫెక్ట్ టాక్ బయటపడుతుంది. ఒకవేళ యావరేజ్ వచ్చినా సరే వసూళ్లు రావడంతో పాటు సెంటిమెంట్ కూడా బ్రేక్ అయినట్లే.

ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేశాడని ట్వీట్ వేశాడు. '23 ఏళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్లీ అతడే దీన్ని బ్రేక్ చేశాడు. అతడిని చూస్తూ పెరిగాను. ఇప్పుడు తెలుగు సినిమాలో అతడు చేస్తున్న అద్భుతాల్ని కళ్లారా చూస్తున్నాను. అస్సలు మాటలు రావట్లేదు. అభిమానులకు ఒకటే చెబుతున్నా. 'దేవర' రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకునే అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఇక నుంచి సినిమానే మాట్లాడుతుంది. ఆల్ హైల్ ద టైగర్' అని రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement