'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి | Jr NTR Fan Died While Watching Devara Movie In Kadapa, Deets Inside | Sakshi
Sakshi News home page

Devara Movie: కడపలో తారక్ అభిమాని మృతి.. అదే కారణం

Published Fri, Sep 27 2024 10:23 AM | Last Updated on Fri, Sep 27 2024 11:32 AM

Ntr Fan Died Watching Devara Movie In Kadapa

ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తూ అభిమాని మృతి చెందాడు. కడపలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు సీకే దీన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. 'దేవర' రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. దీనికి వచ్చిన మస్తాన్.. మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువకరించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య విషాదఛాయలు అలుముకున్నాయి.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

ఇక కడపలోనే పాత బస్టాండ్ దగ్గరున్న రాజా థియేటర్‌లో అర్ధరాత్రి ఫ్యాన్స్-యాజమాన్యం మధ్య గొడవ జరిగింది. చాలామంది టిక్కెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో పూర్తిగా హాలు పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్, సిబ్బందిని చితకబాదారు. అలానే తెర ముందు కూడా పలవురు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

పోలీసులు రంగ ప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే చాలామంది యువకులకు గాయాలయ్యాయి. వీళ్ల వల్ల సినిమా చూడటానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు బెదిరిపోయారు. యువకుల తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోనే షోను కాసేపు నిలిపేశారు.

(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement