Russo Brothers
-
మళ్ళీ అవెంజర్స్ కి మంచి రోజులు వస్తాయి.?
-
రాజమౌళిపై ‘ది గ్రే మ్యాన్’ డైరెక్టర్స్ ఆసక్తికర ట్వీట్.. జక్కన్న రిప్లై చూశారా?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు జక్కన్న. ఆయన దర్శకత్వానికి, హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ చూసి హాలీవుడ్ డైరెక్టర్స్, నటీనటులు సైతం రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే అవెంజర్స్ వంటి క్రేజీ సిరీస్‌ను తెరక్కించిన రూసో బ్రదర్స్ తాజాగా రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూసో బ్రదర్స్ తాజాగా ది గ్రే మ్యాన్ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. చదవండి: టాలీవుడ్‌పై ‘సహజనటి’ జయసుధ సంచలన వ్యాఖ్యలు రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించాడు. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్‌లో జక్కనన్ను కలిసిన రూసో బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. వారి ట్వీట్‌పై జక్కన్న స్పందిస్తూ.. తమను కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరోసారి మిమ్మల్ని కలిసి మీ క్రాప్ట్స్ నుంచి కొంత పని నేర్చుకోవాలని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు హఠాన్మరణం Such an honor getting to meet THE great S.S. Rajamouli… https://t.co/TXly90zGt3 — Russo Brothers (@Russo_Brothers) July 29, 2022 The honour and pleasure are mine..🙏🏼 It was a great interaction . Looking forward to meet and learn a bit of your craft. https://t.co/NxrzuCv1w3 — rajamouli ss (@ssrajamouli) July 30, 2022 -
ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' రివ్యూ..
టైటిల్: ది గ్రే మ్యాన్ నటీనటులు: రేయాన్ గాస్లింగ్, క్రిస్ ఎవాన్స్, ధనుష్, అనా డి అర్మాస్, జూలియా బట్టర్స్ కథ: మార్క్ గ్రీన్ (ది గ్రే మ్యాన్ నవల ఆధారంగా) సంగీతం: హెన్రీ జాక్మన్ సినిమాటోగ్రఫీ: స్టీఫెన్ ఎఫ్ విన్‌డన్ ఎడిటింగ్: జెఫ్ గ్రోత్, పియట్రో స్కాలియా దర్శకత్వం: రూసో బ్రదర్స్ (ఆంటోని రూసో-జో రూసో) విడుదల తేది: జులై 22, 2022 (నెట్‌ఫ్లిక్స్) కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్రలో నటించిన లేటేస్ట్ హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'.అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజర్స్ ఎండ్ గేమ్ వంటి పలు మార్వెల్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంటోని రూసో-జో రూసో) ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించడం, సౌత్ స్టార్ ధనుష్ ఒక కీ రోల్ పోషించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. మార్క్ గ్రీన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అవిక్ సాన్గా ధనుష్ అలరించిన 'ది గ్రే మ్యాన్' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: కోర్ట్ జెంట్రీ (రేయాన్ గాస్లింగ్) నేరం చేసిన జైళ్లో శిక్ష అనుభవిస్తాడు. అతన్ని అమెరికన్ సీఐఏ (సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) ఏజెంట్ సిక్స్‌గా డొనాల్డ్ ఫిట్జ్రాయ్ (బిల్లీ బాబ్) తీసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక క్రిమినల్‌ను చంపమని ఏజెంట్ సిక్స్‌కు టార్గెట్ వస్తుంది. ఆ క్రిమినల్‌ను చంపేటప్పుడు అతను కూడా ఒక సీఐఏ ఏజేంట్ అని సిక్స్‌కు తెలుస్తోంది. తాను ఏజెంట్ ఫోర్ అని చెప్పి అతని దగ్గర ఉన్న ఒక పెండ్రైవ్ను సిక్స్‌కు ఇస్తాడు. ఆ పెండ్రైవ్‌లో ఏముంది ? దాంతో ఏజెంట్ సిక్స్ ఏం చేశాడు? ఆ ప్రెండైవ్ను సాధించేందుకు అత్యంత క్రూరుడు లాయిడ్ హాన్సన్ (క్రిస్ ఇవాన్స్) ఏం చేశాడు? అతని నుంచి సిక్స్ ఎలా తప్పించుకున్నాడు ? ఇందులో అవిక్ సాన్ (ధనుష్) పాత్ర ఏంటీ? అనేది తెలియాలంటే 'ది గ్రే మ్యాన్' చూడాల్సిందే. విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన అవేంజర్స్ సిరీస్, పలు మార్వెల్ సినిమాలను డైరెక్ట్ చేసిన రూసో బ్రదర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్భుతమైన గ్రాఫిక్స్, వండర్ఫుల్ విజువల్స్‌తో ఆ సినిమాలను రూపొందించిన రూసో బ్రదర్స్ ఆ జోనర్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి రూపొందిన చిత్రమే ఇది. అయితే ఎంతో పేరు ఉన్న దర్శకద్వయం ఒక రొటీన్ స్టోరీకి యాక్షన్ అద్దారు. ఇలాంటి తరహాలో వచ్చిన జేమ్స్ బాండ్ సిరీస్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లను ఇదివరకే చూసిన ప్రేక్షకులకు ఈ మూవీ అంతగా రుచించదు. సినిమాలోని వైల్డ్ యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. దానికి తగినట్లుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరో-విలన్ మధ్య వచ్చే సీన్లు అంతగా థ్రిల్లింగ్‌గా లేవు. క్లెయిర్ ఫిట్జ్రాయ్ (చైల్డ్ ఆర్టిస్ట్ జూలియా బట్టర్స్), ఏజెంట్ సిక్స్ మధ్య వచ్చే కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి. ఇక అవిక్ సాన్, లేన్ వూల్ఫ్‌గా ధనుష్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్‌తో కొద్దిసేపు అలరించిన ధనుష్ పాత్ర అంతగా ఇంపాక్ట్ చూపించినట్లు అనిపించలేదు. ఎవరెలా చేశారంటే? ఏజెంట్ సిక్స్‌గా రేయాన్ గాస్లింగ్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. అయితే క్యారెక్టర్లో కొత్తదనం లేకపోవడంతో అంతలా ఎఫెక్టివ్‌గా అనిపించదు. కెప్టెన్ అమెరికా రోల్ ఫేమ్ క్రిస్ ఇవాన్స్ సైకో విలన్‌గా బాగా నటించాడు. అక్కడక్కడా తను చూపించే అట్టిట్యూడ్ ఆకట్టుకుంటుంది. ఏజెంట్ సిక్స్‌కు హెల్ప్ చేసే డాని మిరండా పాత్రలో అనా డి అర్మాస్ నటన బాగుంది. అవిక్ సాన్, లేన్ వూల్ఫ్‌గా ధనుష్ యాక్టింగ్ బాగుంది. ధనుష్ ఉన్నంతసేపు వైల్డ్ యాక్షన్ ఉంటుంది. ఇక మిగతా క్యాస్టింగ్ కూడా పరిధి మేర బాగా నటించారు. హెన్రీ జాక్మెన్ బీజీఎం, స్టీఫెన్ ఎఫ్ విన్‌డన్ సినిమాటోగ్రఫీ, జెఫ్ గ్రోత్, పియట్రో స్కాలియా ఎడిటింగ్ కూడా ఓకే. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే కథ పక్కనపెట్టి యాక్షన్‌ను ఇష్టపడే వారిని ఎంటర్టైన్ చేసే 'ది గ్రే మ్యాన్'. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
మాజీ భార్యతో కలిసి డైరెక్టర్లకు విందు ఇచ్చిన స్టార్ హీరో..
Aamir Khan Special Dinner To Russo Brothers: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా నటించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. స్టార్ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా, అలాగే ధనుష్‌తో కలిసి ఈ మూవీని వీక్షించేందుకు రూసో బ్రదర్స్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు భారతదేశానికి మొట్ట మొదటిసారిగా రావడంతో మంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గురువారం (జులై 21) ఇండియా వచ్చిన ఈ అన్నదమ్ములను స్వయంగా వారి ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్‌తోపాటు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. అయితే అమీర్-కిరణ్ రావు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో విడిపోయిన స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్ చెప్పిన మాటలకు ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది. ఇక ఈ విందులో అతిథులకు ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలను రుచి చూపించాడని టాక్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Laal Singh Chaddha (@aamirkhanuniverse) -
'ది గ్రే మ్యాన్' కోసం కొత్త ప్రపంచం.. తొమ్మిదేళ్లు కష్టపడ్డారట
ధనుష్ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన ఈ చిత్రం జులై 22న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే.. ఇదొక యాక్షన్ బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది. ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. అయితే ఈ చిత్రం కోసం రూసో బ్రదర్స్ తొమ్మిదేళ్లుగా కష్టపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే చెప్పారు. తాజాగా ఆంటోని, జో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేయడానికి మాకు తొమ్మిదేళ్లు పట్టింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా కుదరలేదు. అయితే... మార్క్ గ్రీనీ రైటింగ్, రీసెర్చ్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ జానర్ సినిమా అయినా ఆసక్తిగా మలచాలని మేము ప్రయత్నిస్తాం. సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ, వ్యవస్థపై తిరుగుబాటు చేసే రెబల్స్ పోరాటం, ప్రపంచంపై మాకు ఉన్న భయాలతో డిఫరెంట్ జానర్ సినిమాగా 'ది గ్రే మ్యాన్'ను తీర్చిదిద్దాం. ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. ఇందులో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. ప్రేక్షకులు ఉత్కంఠగా చూసేలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది' అని చెప్పారు.