Russo Brothers Talk About The Gray Man Movie - Sakshi
Sakshi News home page

The Gray Man: ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక కొత్త ప్రపంచం

Published Tue, Jul 19 2022 1:47 PM | Last Updated on Tue, Jul 19 2022 2:44 PM

Russo Brothers Talk About The Gray Man Movie - Sakshi

రూసో బ్రదర్స్‌

ధనుష్‌ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్‌’. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన  ఈ చిత్రం జులై 22న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది. ఇందులో  ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్,  అనా డి ఆర్మాస్, ధనుష్‌ ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే.. ఇదొక యాక్షన్‌ బ్లాక్‌ బస్టర్‌ అని అర్థమవుతుంది. ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక ప్రపంచాన్ని క్రియేట్‌ చేశారు. అయితే ఈ చిత్రం కోసం రూసో బ్రదర్స్‌ తొమ్మిదేళ్లుగా కష్టపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే చెప్పారు.

తాజాగా ఆంటోని, జో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేయడానికి మాకు తొమ్మిదేళ్లు పట్టింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా కుదరలేదు. అయితే... మార్క్ గ్రీనీ రైటింగ్, రీసెర్చ్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ జానర్ సినిమా అయినా ఆసక్తిగా మలచాలని మేము ప్రయత్నిస్తాం. సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ, వ్యవస్థపై తిరుగుబాటు చేసే రెబల్స్ పోరాటం, ప్రపంచంపై మాకు ఉన్న భయాలతో డిఫరెంట్ జానర్ సినిమాగా 'ది గ్రే మ్యాన్'ను తీర్చిదిద్దాం. ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. ఇందులో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. ప్రేక్షకులు ఉత్కంఠగా చూసేలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది' అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement