మరో హాలీవుడ్‌ అవకాశం? | Dhanush to star alongside Robert Downey Jr in Avengers | Sakshi
Sakshi News home page

మరో హాలీవుడ్‌ అవకాశం?

Published Wed, Aug 7 2024 12:04 AM | Last Updated on Wed, Aug 7 2024 7:13 AM

Dhanush to star alongside Robert Downey Jr in Avengers

హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో తమిళ నటుడు ధనుష్‌ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్‌ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్‌: డూమ్స్‌ డే, అవెంజర్స్‌: సీక్రెట్‌ వార్‌’ రానున్నాయని, ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్‌ (ఆంథోనీ రూసో, జోసెఫ్‌ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్‌ సంస్థ ప్రకటించింది.

‘అవెంజర్స్‌: డూమ్స్‌ డే’లో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించనున్నారు. మరో లీడ్‌ రోల్‌లో ధనుష్‌ నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్‌’లో ధనుష్‌ ఓ లీడ్‌ రోల్‌ చేశారు. మరి... ‘అవెంజర్స్‌: డూమ్స్‌ డే’లోనూ ఈ ఇండియన్‌ హీరో నటిస్తారా? వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement