సందీప్, ప్రకాశ్‌రాజ్, ధనుష్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, సురేష్‌బాబు, జాన్వీ
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్‌లో 50వ సినిమా.
ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను.
ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ చేయాలనుంది.
నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్‌కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్‌బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment