pre-release event
-
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్
‘‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా బాధగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ‘దేవర’ సినిమా గురించి చె΄్పాలని, ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టాన్ని వివరించాలని చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. కానీ భద్రతా పరమైన కారణాల వల్ల ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది... ఎక్కువ కూడా’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఇది.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించాలనుకున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రతా కారణాల వల్ల రద్దు అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మీరు నాపై కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను.ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ‘దేవర’ సినిమా నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను బ్లేమ్ చేయడం తప్పని నా భావన. కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబరు 27న మనందరం కలవబోతున్నాం. ‘దేవర’ చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్లే... మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందాన్ని నా మాటల్లో చెప్పలేను. ఈ సెప్టెంబరు 27న అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి. అందరూ ఆనందించండి.మీ ఆశీర్వాదం ఈ ‘దేవర’కు చాలా అవసరం. నాకూ చాలా అవసరం. దయచేసి మీ అశీర్వాదాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకొక్కమాట.. మీరందరూ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్లాలని ఇంకొక్కసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...‘దేవర’ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్‌లో ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని’ అనే డైలాగ్ ఒకటి. -
హీరో నాని 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్లో 50వ సినిమా.ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను. ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ చేయాలనుంది. నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్‌బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజు మాట్లాడుతున్నారంటే కారణం మీరే సార్
-
పండుగకు నా సామిరంగను ఆదరించండి..!
-
ఎనర్జిటిక్ స్పీచ్ మాట్లాడిన శ్రద్ధ శ్రీనాథ్..!
-
ప్రతి ఒక్కరి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది
-
వైజాగ్.. భలే హుషారు
విశాఖపట్నం: వైజాగ్ వస్తే చాలా హుషారుగా ఉంటుందని హీరో వెంకటేష్ అన్నారు. సైంధవ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి సినిమా నుంచి వైజాగ్ ప్రేక్షకులు తనను ఆదరిస్తూ వస్తున్నారన్నారు. చాలా సినిమాలు వైజాగ్‌లో షూటింగ్ చేశామన్నారు. తన 75వ సినిమా సైంధవ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సైంధవ్ సినిమాకు హీరో సారా పాప అని చెప్పారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ తనకు వైజాగ్ బాగా కలిసి వచ్చిందన్నారు. సైంధవ్ సినిమాను స్టీల్‌ప్లాంట్ కాలనీలో 40 రోజులు షుటింగ్ చేశామన్నారు. హిట్, హిట్–2 సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసి మంచి విజయం సాధించామన్నారు. వెంకీమామను ప్రేక్షకులను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూపించామన్నారు. వెంకీమామ 75 సినిమా తనకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, నటీనటులు పాల్గొన్నారు. -
టీజర్.. ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి
‘‘మార్క్ ఆంటోనీ’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్. విశాల్ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్. ‘‘నా లైఫ్‌లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్’’ అన్నారు నటుడు సునీల్. -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
త్రిష అందానికి కార్తీ ఫిదా..
-
ఐశ్వర్య రాయ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో చుడండి..
-
దిల్ రాజు మాటలకు ఐశ్వర్య రాయ్ ఎలా నవ్వుతుందో చుడండి..
-
'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నవ్వులతో నవరాగాలు ఒలికిస్తున్న నివేదా థామస్ (ఫోటోలు)
-
‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్‌చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్‌ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్‌కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి, ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి, ప్రకాశ్‌రాజ్‌కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్‌కుమార్, హిందీలో రాజ్‌కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
డీజే టిల్లు మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
అతిథి.. నిరాశపరచదు
‘‘అతిథి దేవోభవ’ సినిమా చాలా బాగుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఈ చిత్రం నచ్చితే ఓ పది మందికి చెప్పండి.. నచ్చకపోతే ఇరవై మందికి చెప్పండి’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. రాం సత్యనారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘వందేమాతరం’ నుంచి సాయి కుమార్‌తో ప్రయాణం చేస్తున్నాను. వాళ్లబ్బాయి ఆదికి ‘అతిథి దేవోభవ’తో పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆది భావోద్వేగాలు బాగా పండించాడనిపిస్తోంది’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మంచి సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘మా సినిమా ఫస్ట్ హాఫ్ వినోదంగా, సెకండాఫ్ కొత్తగా ఉంటుంది’’ అన్నారు పొలిమేర నాగేశ్వర్. -
‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ-రిలీజ్ వేడుక ఫోటోలు
-
శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా: చిరు
‘‘ఒక యాక్టర్ కొడుకు యాక్టర్, డాక్టర్ కొడుకు డాక్టర్, రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు కావాలనుకుంటారు. కానీ ఓ రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకోడు. రైతు కొడుకు కూడా గర్వంగా నేను రైతే అవుతాను అనే రోజులు మళ్లీ రావాలి. ఆ రోజు వస్తుందనే ఆశాభావం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. వ్యవసాయ జీవితం నేపథ్యంలో శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిశోర్ బి. దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీకారం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా. తను చిన్నప్పుడు నాతో కలసి థమ్స్అప్ యాడ్ చేశాడు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో అతిథి పాత్ర చేశాడు. ఆ రకంగా తన నటనకి శ్రీకారం చుట్టింది నేనే. చూస్తుండగానే సినిమా సినిమాకి పరిణతి సాధిస్తూ సినిమాలు చేస్తున్నాడు. మన చదువుతోటి వ్యవసాయానికి అధునాతన టెక్నాలజీని జోడిస్తే వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లొచ్చు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ–‘‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి ఫ్యాన్. ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ వేడుక ఇంత పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగడానికి ప్రధాన కారణం చిరంజీవి. ‘ఆచార్య’ షూటింగ్ కొంతైనా ఖమ్మంలో చేయాలని ఆయన్ని కోరడంతో ఇల్లందులోని మైన్స్ వద్ద షూటింగ్ చేస్తున్నారు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘బాస్ (చిరంజీవి) ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది. ‘శర్వా... నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడు’ అని చిరంజీవిగారు చెప్పిన మాటను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంకల్పమే నన్ను స్టార్‌ని చేసి నా స్టార్‌ని మార్చింది. వారసత్వం ద్వారా చాలామందికి ఆస్తులు వస్తాయి. కానీ చిరంజీవిగారి క్యారెక్టర్, ఆ వారసత్వం నా స్నేహితుడు రామ్‌చరణ్ తేజ్‌కి వచ్చింది.. అది ఇంకెవ్వరికీ దక్కదు’’ అన్నారు. దర్శకుడు కిశోర్ మాట్లాడుతూ – ‘‘శర్వానంద్గారిని ఒక హీరోలా కాదు.. నా అన్నలా భావిస్తున్నాను’’ అన్నారు. గోపీ ఆచంట మాట్లాడుతూ –‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, పాటల రచయితలు పెంచల్ దాస్, కేకే, భరద్వాజ, నిర్మాత చెరుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవికి శర్వా పాధాభివందనం -
మా స్నేహం అలానే ఉంది
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే. ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమన్నాను. ఉదయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ రష్ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్ గారు పిలిచి వెబ్ సిరీస్ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్ చాన్స్ అని చెప్పాను’’ అన్నారు. స్వప్నాదత్ మాట్లాడుతూ– ‘‘పార్టనర్షిప్ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్షిప్ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వనీదత్‌గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్ సినిమా స్టైల్లో ఉదయ్ ‘మెయిల్’ను తెరకెక్కించారు’’ అన్నారు.