Atithi Devo Bhava Movie Press Release Event: Producer Miryala Ravinder Reddy Speech - Sakshi
Sakshi News home page

అతిథి.. నిరాశపరచదు

Published Fri, Jan 7 2022 5:19 AM | Last Updated on Fri, Jan 7 2022 9:05 AM

Miryala Ravinder Reddy Speech At Atithi Devo Bhava Pre - Sakshi

రవీందర్‌ రెడ్డి, జీవిత, రాజశేఖర్, ఆది, నాగేశ్వర్, కార్తికేయ

‘‘అతిథి దేవోభవ’ సినిమా చాలా బాగుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఈ చిత్రం నచ్చితే ఓ పది మందికి చెప్పండి.. నచ్చకపోతే ఇరవై మందికి చెప్పండి’’ అని నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి అన్నారు. ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. రాం సత్యనారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నటుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘వందేమాతరం’ నుంచి సాయి కుమార్‌తో ప్రయాణం చేస్తున్నాను. వాళ్లబ్బాయి ఆదికి ‘అతిథి దేవోభవ’తో పెద్ద సక్సెస్‌ రావాలి’’ అన్నారు. ‘‘ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్‌ రావాలి’’ అన్నారు జీవితారాజశేఖర్‌. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఆది భావోద్వేగాలు బాగా పండించాడనిపిస్తోంది’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మంచి సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్‌. ‘‘మా సినిమా ఫస్ట్‌ హాఫ్‌ వినోదంగా, సెకండాఫ్‌ కొత్తగా ఉంటుంది’’ అన్నారు పొలిమేర నాగేశ్వర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement