
– దర్శకుడు విశ్వ కరుణ్
‘‘సినిమా ఇండస్ట్రీపై ఓ నమ్మకంతో ఇక్కడికి వచ్చి... కష్టాలు పడలేక ఎంతో మంది తిరిగి వెళ్లిపోవడం చూశాను. మీరు ధైర్యంగా ఉండండి... తప్పకుండా నాలా మీరు కూడా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. సినిమా మీద ప్యాషన్‌తో పల్లెల నుంచి హైదరాబాద్‌కి వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా సాయం చేస్తాను... అది వసతి అయినా సరే లేకుంటే భోజనం కానీ, అవకాశాలు కానీ... నా చేతనైన సాయం వారికి చేస్తాను’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్తవాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాను. ఇకపైనా చాన్స్ ఇస్తాను’’ అన్నారు. విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దిల్ రుబా’లో కొత్త కిరణ్‌ని చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఎంతోమంది మా ‘దిల్ రూబా’ని రిలీజ్ చేస్తామని అడిగినా మూవీపై నమ్మకంతో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం’’ అని రవి తెలిపారు. ‘‘ఈ మూవీతో కిరణ్‌గారికి, మా టీమ్‌కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు రాకేశ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment