
‘ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ "దిల్ రూబా"లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్‌ని చెప్పాం’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram). ‘క’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→"దిల్ రూబా"( Dilruba Movie)లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్ లో కథ రివీల్ చేశాం. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఈ సినిమా చేసేప్పుడు నేను కూడా కొంత మారాను. ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువ తీయొద్దు అనుకున్నాను
→ ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ "దిల్ రూబా"ను బాగా ఇష్టపడతారు. 2గంటల 20నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తారు. "క" కంటే ముందు చేసిన సినిమా కదా ఇందులో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 టు 20 పర్సెంట్ సీన్స్ ఎక్కడైనా చూసినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది.
→ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. నేను చేసిన సిద్ధు క్యారెక్టరైజేషన్ మీకు కంప్లీట్ గా నచ్చుతుంది. నేను ఇలాంటి హై క్యారెక్టర్ చేయలేదు. గతంలో నేను చేసిన చిత్రాల్లో సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చూశారు. ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తా. ఎక్కువ రివీల్ చేయొద్దని ట్రైలర్ లో కొన్ని సీన్స్ కట్ చేయలేదు. థియేటర్ లో మూవీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది.
→ మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్ లో మా మూవీ వెళ్తుంటుంది. తమిళ సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు.
→ సినిమా నా పేరు మీద థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి నేను మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడివరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా. ఈ ఇయర్ నావి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ ఇయర్ నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తా. దిల్ రూబా తర్వాత వెంటనే కె ర్యాంప్ మూవీ ఉంటుంది.
→ గతంలో కొన్ని మూవీస్ మొహమాటానికి చేసినవి ఉన్నాయి. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ఇకపై మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. క సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమా చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ జర్నీ చేస్తా. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. 3 పార్ట్ మూవీగా తీస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment