
ఈ మధ్య సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్లా సవాళ్లు విసురుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తమ కథపై వారికి ఉన్న నమ్మకమే అలా మాట్లాడిస్తుంది. అయితే అన్ని సందర్భాలో వారి నమ్మకం ఫలించదు. కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి.మరికొన్ని సార్లు అంచనా వేయలేని విజయాన్ని అందిస్తాయి. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం మేకర్స్ అంతా తమది గొప్ప కళాఖండమే అని చెప్పుకోవడంలో తప్పులేదు. చివరికి ఆ సినిమా హిట్టా? ఫట్టా అనేది డిసైడ్ చేసేది ఆడియన్ మాత్రమే. ఈ విషయం మేకర్స్‌కి కూడా తెలుసు కానీ ఆడియన్‌ని థియేటర్‌కి రప్పించేందుకు ఇలాంటి ‘సవాళ్ల’ని ఎదుర్కొవాల్సిందే.
తాజాగా హీరో నాని(Nani) ప్రేక్షకులకు విసిరిన సవాల్ నెట్టింట బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘కోర్ట్’(Court ) సినిమా నచ్చకపోతే ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాని చూడకండి అని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇక కోర్ట్ సినిమాని రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడయాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. నాని ఊహించినట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనేది నేటి సాయంత్రంతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నారు.
(చదవండి: నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ ఎలా ఉందంటే?)
ఇక నాని ‘కోర్ట్’కి పోటీగా బరిలోకి దిగాడు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ‘దిల్‌రూబా’(Dilruba ) మూవీ కూడా మార్చి 14నే విడుదల కానుంది. ఈ సినిమాపై కిరణ్ కంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ రవినే నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని సవాల్ విసిరాడు. ఈయన కామెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కోర్ట్‌తో పాటు దిల్‌రూబాకి కూడా పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఈ మూవీ రిజల్ట్ వచ్చేస్తుంది. సవాళ్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా? లేదా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment