
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్‌గా కనిపించనుంది. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ చేశారు.
'సూరులైనా.. అసురులైనా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇది ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో ఆది సాయి కూమార్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment