shanmukha
-
దీపావళికి షణ్ముఖ
ఆది సాయికుమార్ హీరోగా అవికా గోర్ హీరోయిన్గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పాన్ ఇండియా మూవీగా షణ్ముగం సాప్పని దర్శకత్వలో సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. షణ్ముగం సాప్పని మట్లాడుతూ – ‘‘ఆది సాయికుమార్ కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీలా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందించిన చిత్రం ఇది. గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుంది. రవి బస్రూర్ ‘షణ్ముఖ’కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దీపావళి సీజన్లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాన్ ఇండియా మూవీని పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
పవర్ఫుల్ పోలీస్
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ– ‘‘డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందించాం. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటించారు. ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
ఓ రచయిత ప్రయాణం
‘‘రైటర్ పద్మభూషణ్’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయవాడలోని ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది’’ అని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అన్నారు. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో కథని అమ్మలానే చూస్తాను. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో ΄ాత్ర పేరు పద్మభూషణ్. తను రైటర్ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా? లేదా అనేదే కథ. దర్శకులు జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్లగార్ల సినిమాలంటే ఇష్టం. నా బలం కూడా కామెడీనే. మా సినిమాలో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు. -
సినీ గీతాల కన్నా సనాతన ధర్మమే ఆకట్టుకుంది
ఆర్ష సాహిత్యంపై దాడులు పెరుగుతున్నాయి మన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టొద్దు ‘సాక్షి’తో సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘సినీ పరిశ్రమలో పాటలు రాస్తున్న సమయంలోనే వైదిక వాజ్ఞ్మయంపై కొన్ని చానళ్లలో ప్రసంగించే అవకాశం వచ్చింది. దీంతో ప్రవచనాలతో బిజీ అయిపోయాను. సినిమాలకు పాటలు రాయడం కన్నా... సనాతన ధర్మప్రచారమే నన్ను ఆకట్టుకుంది. నా మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నా’నని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కొంతమూరులో ఆయన నిర్మించిన శ్రీవల్లభ గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరానికి వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టారు నేను రాసిన సినీగీతంలో ఒక పదం అర్థం కావడంలేదు కనుక, ఆ పదాన్ని మార్చమని ఓ నిర్మాత నన్ను అడిగారు. దాన్ని మార్చి మరో పదం రాశాను. పాడటానికి వచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పదాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందని నన్ను అడిగారు. నిర్మాత కోరిక మేరకు మార్చానని చెప్పాను. బాలు ఆ నిర్మాతకు చివాట్లు పెట్టి, పాత పదాన్నే ఉంచారు. బాపు, రమణలు ఎంతో ప్రోత్సహించారు భాగవతం సీరియల్‌కు పాటలు రాయడానికి బాపు, రమణలు నన్ను ఆహ్వానించారు. వారితో సంభాషణల్లో ఎక్కువగా భారత, భాగవత, రామాయణాల నుంచి కోట్ చేస్తుండేవాడిని. నా చేత వాళ్లు మళ్లీ మళ్లీ మాట్లాడించుకునేవారు. మంచిని తీసుకుందాం మన ప్రాచీన కావ్యాలు, ఆర్ష సాహిత్యంపై దాడులు ఎక్కువవుతున్నాయి. నేటి కాలానికి అన్వయించని విషయాలుంటే వాటిని పరిహరించి, మంచిని తీసుకుందాం. మన ధర్మాన్ని దెబ్బతీయడానికి కొందరు కుహనా మేధావులను పురిగొల్పుతున్నారు. ఈ కుహనా మేధావులు ఆర్షసాహిత్యాన్ని చూస్తున్న కోణంలో గతంలో ఎవరూ చూడలేదు. హృదయం నిర్మలంగా లేకుంటే అద్భుతాలు కూడా అసహ్యంగానే కనిపిస్తాయి. ఇవి ఉపాసనకు సంబంధించిన అంశాలు గణపతి కల్యాణం, హనుమంతుని కల్యాణం ఇత్యాదులు కథాపరమైన అంశాలు కావు. ఉపాసనకు సంబంధించిన అంశాలు. హనుమ జ్ఞానమూర్తి. జ్ఞానం ఉన్నచోట వర్చస్సు ఉంటుంది. కనుక హనుమంతునికి, సువర్చలకు వివాహం జరిపిస్తున్నాం. గణపతి బుద్ధిప్రదాత కనుకనే సిద్ధిబుద్ధిలతో గణపతి కల్యాణం జరిపిస్తున్నాం. చాగంటిని కులాల ఉచ్చులోకి లాగొద్దు సరస్వతీపుత్రుడు చాగంటి కోటేశ్వరరావు మీద కువిమర్శలు సనాతనధర్మంపై జరుగుతున్న దాడులుగానే భావించాలి. చాగంటికి కులపరమైన ఉద్దేశాలు అంటగట్టడం మంచి పద్ధతి కాదు. -
'ఆదిత్య' ఆడియో ఆవిష్కరణ
-
ఆదిత్య మూవీ స్టిల్స్
-
ఓవరాల్ చాంప్స్ మనీషా, షణ్ముఖ
అండర్-16 చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అండర్-16 సెలక్షన్ కమ్ చెస్ టోర్నమెంట్లో ఓవరాల్ బాలికల టీమ్ టైటిల్‌ను ఎం.మనీషా చౌదరి కైవసం చేసుకుంది. అండర్-16 బాలుర ఓవరాల్ టైటిల్‌ను పి.షణ్ముఖ తేజ చేజిక్కించుకున్నాడు. వన్ గోల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్స్ ఫలితాలు: బాలికల విభాగం: అండర్-13: 1.సముద్రాల దేవిక, 2.పి.శ్రావణి, అండర్-10: 1.జె.ఎ.ఎస్.శర్వాణి. అండర్-8: 1.యజ్ఞ ప్రియ, 2.ప్రణీత ప్రియ. బాలుర విభాగం: అండర్-15 : 1.ఎస్.బిపిన్ రాజ్, 2.పి.గౌతమ్, 3.ఎం.తరుణ్, 4.ఎ.అఖిల్, 5.సాయి రేవంత్, 6.ఎల్.సాయి చరణ్, 7.సి.హెచ్.రాంమోహన్ రెడ్డి,8. ఎస్.ప్రవీణ్ కుమార్. అండర్-13: 1.ఎ.సాయి సిద్ధార్థ, 2.కుల్‌ప్రీత్ సింగ్, 3.బి.సాయి చాణిక్య రెడ్డి, 4.ప్రీతమ్ రెడ్డి, 5.వి.ప్రదీప్ రెడ్డి, 6. జశ్వంత్, 7.బి.ప్రశాంత్ కుమార్, 8.బి.హర్షిత్. అండర్-10: 1.ఎం.కౌశిక్, 2.జి.సంజన, అండర్-8: 1.టి.కె.సిద్ధార్థ 2. హిమేష్, అండర్-6: జె.ఎస్ఎస్. శ్రీకర్.