దీపావళికి షణ్ముఖ | Aadi Saikumar Shanmukha new poster release | Sakshi
Sakshi News home page

దీపావళికి షణ్ముఖ

Published Sat, Sep 21 2024 1:26 AM | Last Updated on Sat, Sep 21 2024 1:26 AM

Aadi Saikumar Shanmukha new poster release

ఆది సాయికుమార్‌ హీరోగా అవికా గోర్‌ హీరోయిన్‌గా నటించిన డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. పాన్‌ ఇండియా మూవీగా షణ్ముగం సాప్పని దర్శకత్వలో సాప్పని బ్రదర్స్‌ సమర్పణలో తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. 

షణ్ముగం సాప్పని మట్లాడుతూ – ‘‘ఆది సాయికుమార్‌ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌ మూవీలా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో రూపొందించిన చిత్రం ఇది. గ్రాఫిక్స్‌ ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రం విజువల్‌ వండర్‌లా ఉంటుంది. రవి బస్రూర్‌ ‘షణ్ముఖ’కి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. దీపావళి సీజన్‌లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాన్‌ ఇండియా మూవీని పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement