
‘‘రైటర్ పద్మభూషణ్’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. విజయవాడలోని ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది’’ అని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అన్నారు. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో కథని అమ్మలానే చూస్తాను. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో ΄ాత్ర పేరు పద్మభూషణ్. తను రైటర్ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా? లేదా అనేదే కథ. దర్శకులు జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్లగార్ల సినిమాలంటే ఇష్టం. నా బలం కూడా కామెడీనే. మా సినిమాలో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment