పవర్‌ఫుల్‌ పోలీస్‌ | Shanmukha First Look Featuring Aadi Saikumar | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ పోలీస్‌

Published Tue, Jul 9 2024 1:17 AM | Last Updated on Tue, Jul 9 2024 1:17 AM

Shanmukha First Look Featuring Aadi Saikumar

ఆది సాయికుమార్, అవికా గోర్‌ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. సాప్పని బ్రదర్స్‌ సమర్పణలో తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్‌ నిర్మించిన ఈ సినిమా  నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ– ‘‘డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందించాం. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటించారు. ఈ మూవీ తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

‘కేజీఎఫ్, సలార్‌’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్‌ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement