Avika Gor
-
భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అవికా గోర్ సినిమా
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అవికా గోర్ కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్లో నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల. అందులో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డ్ దక్కింది. గతేడాదిలో నిర్మాతగా పాప్‌కార్న్ అనే చిన్న సినిమాను ఆమె నిర్మించింది. కానీ, ఆ సినిమా నష్టాలను మిగిల్చింది. అవికా గోర్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ నటించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో 'బ్లడీ ఇష్క్' అనే హారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని విక్రమ్ భట్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్లో '1920, రాజ్ వంటి హారర్ సినిమాలతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి అదే కాన్సెప్ట్‌తోనే 'బ్లడీ ఇష్క్' చిత్రాన్ని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఓటీటీలో ఎప్పుడు విడుదలబ్లడీ ఇష్క్ సినిమా జులై 26న ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ట్రైలర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అవికా గోర్‌కు తెలుగు మార్కెట్ ఎక్కువని చెప్పవచ్చు. -
పవర్ఫుల్ పోలీస్
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ– ‘‘డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందించాం. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటించారు. ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
మురిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్ (ఫోటోలు)
-
'వెనకవైపు నుంచి అనుచితంగా తాకాడు'.. టాలీవుడ్ హీరోయిన్!
ఉయ్యాలా జంపాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది-3 సినిమాలతో మెప్పించింది. గతేడాది వధువు అనే వెబ్ సిరీస్‌తో అలరించింది. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సిరీయల్ గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం బ్లడీ ఇష్క్‌లో అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ ఒక ఈవెంట్లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను వేదికపై వెళ్లే క్రమంలో వెనకవైపున అసభ్యంగా తాకాడని తెలిపింది. తిరిగి చూస్తే అక్కడ కేవలం తన బాడీగార్డ్ మాత్రమే ఉన్నారని వెల్లడించింది. అతను సారీ చెప్పడంతో ఆ సంగతి వదిలేశానని చెప్పుకొచ్చింది.అయితే ఇదే సంఘటన రెండోసారి కూడా జరిగిందని అవికా గోర్ తెలిపింది. అయితే ఈసారి నన్ను పట్టుకోకముందే బాడీగార్డ్ చేయి పట్టుకున్నానని అవికా పేర్కొంది. అసలేం ఏం చేస్తున్నావ్ గట్టిగా నిలదీయడంచో క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. దీంతో అతన్ని వదిలిపెట్టాటని వివరించింది. అలాంటి వ్యక్తులను ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలని ఆమె అన్నారు. నాకే గనుక ధైర్యం ఉంటే ఈపాటికి చాలా మందిని తిరిగి కొట్టేదానినని అవికా గోర్ నవ్వుతూ చెప్పింది. -
అవికా గోర్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్
ప్రపంచ క్రికెట్లో ఆండ్రూ రస్సెల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విధ్వంసకర బ్యాటర్లలో తరచుగా వినిపించే పేర్లలో ఆయన టాప్‌లో ఉంటారు. వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రాణిస్తున్నాడు.తాజాగా ఆండ్రూ రస్సెల్ సరికొత్త అవతారం ఎత్తాడు. ఏకంగా హిందీ పాటతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. 'లడ్ కీ తూ కమాల్ కీ' అంటూ తన గాత్రంతో మెప్పించాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్‌తో కలసి రస్సెల్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇందులో వారిద్దరి డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. -
Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ గురించి ఈ విషయాలు తెలుసా?
అవికా గోర్..‘చిన్నారి పెళ్లికూతురు’ ఆనందిగా ఫేమస్. ఇటు స్మాల్ స్క్రీన్.. అటు సిల్వర్ స్క్రీన్ రెండిట్లోనూ చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టింది. నటిగా ఎన్నో విజయాలందుకున్న ఆమె.. ప్రస్తుతం వెబ్‌స్క్రీన్ మీదా అలరిస్తోంది. ► ముంబైలో పుట్టిపెరిగిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. స్కూల్లో కంటే షూటింగ్ సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడిపింది. ► ‘బాలికా వధు’ సీరియల్ అవికా జీవితాన్నే మార్చేసింది. ఆ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ► ‘రాజ్‌కుమార్ ఆర్యన్’, ‘ససురాల్ సిమర్ కా’ అనే సీరియల్స్‌లోనూ నటించింది. తర్వాత సినీ అవకాశాలు రావడంతో పూర్తిగా వెండితెర మీదే దృష్టి పెట్టింది. ► హిందీలో వరుసగా ‘తేజ్’, ‘పాఠ్శాలా’ సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెరపై వచ్చిన గుర్తింపు వెండితెరపై రాలేదు. తొలిసారి ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు చిత్రంతో ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ► ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల్లో నటించింది. కానీ, తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ► లాక్డౌన్లో.. జీ5లో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన ‘నెట్’ సినిమా అవికాను డిజిటల్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అక్కడ మంచి ఆదరణ లభించడంతో, మళ్లీ అవికా కెరీర్ పుంజుకుంది. ► ప్రస్తుతం అవికా.. డిస్నీఫ్లస్ హాట్‌స్టార్‌లో హిట్‌టాక్‌తో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘వధువు’ అనే థ్రిల్లర్ సిరీస్‌తో అలరిస్తోంది . ఒకసారి ముంబైలోని ఒక థియేటర్లో సినిమా చూడ్డానికి నేను మేజర్ని కాదని నన్ను అనుమతించలేదు. నా ఐడీ చూపించి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ చాలామంది నన్ను చిన్నపిల్లలాగే చూస్తుంటారు. చెప్పొద్దూ.. అలా ట్రీట్ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది. – అవికా గోర్ -
Umapathi Movie Review: అవికా గోర్ నటించిన 'ఉమాపతి' సినిమా రివ్యూ
విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రేమ కథలకు ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ అందిస్తుంటారు. అలాంటి ఓ ప్రేమ కథా చిత్రమే 'ఉమాపతి'. ఇందులో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మించగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథేంటి? ఉమాపతి కథ దోసకాయలపల్లి, కొత్తపల్లి మధ్య జరుగుతుంది. వర (అనురాగ్) కొత్తపల్లికి చెందిన వాడు. ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. దుబాయ్‌లో తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే.. ఇక్కడ ఆ వర జల్సాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వర.. పక్క ఊరైన దోసకాయపల్లిలో ఉమా (అవికా గోర్)ను ఇష్టపడుతుంటాడు. కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది. పైగా ఉమా సోదరుడికి, వరకు పాత గొడవలు కూడా ఉంటాయి. ఇలాంటి ఈ తరుణంలో వర తన ప్రేమను ఆ అమ్మాయికి ఎలా చెబుతాడు? అసలు వీరిద్దరూ ప్రేమలో పడతారా? పడితే ఆ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు? ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న గొడవలు ఏంటి? చివరకు వారి ప్రేమ కథకు ఎండింగ్? అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఎలా ఉంది? ఉమాపతి సినిమా అంతా కూడా అనురాగ్, అవికా గోర్ మధ్యే సాగుతుంది. అనురాగ్ తెరపై తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడు. అవికా గోర్ అందంగా కనిపిస్తూనే.. తన అల్లరితో, తన నటనతో అందరినీ కట్టి పడేసింది. వీరిద్దరి జోడికి ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇక మిగిలిన పాత్రల్లో హీరో ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ దర్శకుడు సింపుల్ కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు. ఇలాంటి స్టోరీలు ఇది వరకు ఎన్నో సార్లు మనం చూసినా కూడా ఉమాపతి కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలు, ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ చిగురించే సన్నివేశాలు.. ఊరి వాతావరణం, గొడవలు, జోకులు ఇలా అన్నింటిని మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్‌ను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇంట్రవెల్‌కు చిన్న పాటి జర్క్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనే అసలు పాయింట్ బయటకు వస్తుంది. రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆ గొడవకు ఈ ప్రేమ కథకు ఎలా ముడి పెట్టారు.. ఆ సంఘర్షణను దర్శకుడు చక్కగా చూపించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. చివరకు తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ ముగింపులానే సినిమా కూడా ఎండ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే.. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు పాటలు, ఆర్ఆర్ ప్లస్ అవుతాయి. ఆహ్లాదకరమైన సంగీతం ఉంటుంది. సహజంగా కనిపించే విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. -
'ఉమాపతి' సెన్సార్ కంప్లీట్.. డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్
ప్రేమ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఇలాంటి స్టోరీలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'ఉమాపతి'. అనురాగ్ హీరోగా, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా చేసింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్‌పై కే.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే పోస్టర్స్, పాటలు, టీజర్.. ఇలా అన్నీ పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్నాయి. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: 'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!) తాజాగా 'ఉమాపతి' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన ప్రేమ కథా చిత్రమని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారట. అలానే యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబర్ 29న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందించగా.. చంద్రబోస్, భాస్కర భట్ల తదితరలు పాటలు రాశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
డిఫరెంట్ ప్రేమకథతో 'అగ్లీ స్టోరీ'.. గ్లింప్స్ రిలీజ్
లక్కీ మీడియా, రియా జియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'అగ్లీ స్టోరీ'. నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లు నటించారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. గ్లింప్స్ చివరలో హీరో నందు చెప్పిన.. ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ.. రియల్ లైఫ్‌లో ఉండదు అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) అయితే ఈ గ్లింప్స్ మంచి స్పందన వస్తుండటంతో.. ముందు ముందు టీజర్, ట్రైలర్ మరియు సినిమాని మరింత కొత్తగా, ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామని చెప్పారు. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
Avika Gor Latest HD Photos: అవికా గోర్ ని చూస్తే కళ్లు తిప్పుకోలేరు! (ఫొటోలు)
-
పల్లెటూరి ప్రేమకథతో అవికాగోర్ ‘ఉమాపతి’
ఇటీవల ‘వధువు’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్.. త్వరలోనే థియేటర్స్ ఆడియన్స్‌ని అలరించడానికి రెడీ అవుతోంది. అనురాగ్, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఉమాపతి’.సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు.డిసెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అందమైన గ్రామీణ వాతావరణం, ఊర్లోని రకరకాల మనస్తత్వాలున్న మనషులు, అల్లరి చిల్లరగా తిరిగే హీరో.. రెండు ఊర్ల మధ్య ఏవో గొడవలు ఉన్నట్టు.. ఆ గొడవలే హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకిలా మారేట్టు చూపించిన సీన్లు బాగున్నాయి. ట్రైలర్లో సహజత్వం ఉట్టి పడుతోంది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. ఆర్ఆర్ చక్కగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
అనుమానాస్పదంగా ‘వధువు’
అవికా గోర్ ప్రధాన పాత్రలో, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కృష్ణ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 8 నుంచి హాట్‌స్టార్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఓ కుటుంబంలోని సభ్యులందరూ ఎందుకు అనుమానాస్పదంగా కనిపిస్తారు? అనే అంశం ‘వధువు’లో కొత్తగా ఉంటుంది. అవికా, నేను బెక్కెం వేణుగోపాల్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సిరీస్‌లో నా పాత్ర చాలా సెటిల్డ్‌గా ఉంటుంది’’ అన్నారు అలీ రెజా. ‘‘బెంగాలీ సిరీస్ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్ చేశాం. అయితే నేను సోల్‌ను మాత్రమే తీసుకున్నాను. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి 7వ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది’ అన్నారు దర్శకుడు పోలూరు కృష్ణ. -
Avika Gor: అవికా గోర్ ‘అగ్లీ స్టోరీ’
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఉత్తరాది భామ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది. అందుకే తన కెరీర్లో ‘సినిమా చూపిస్త మావ’లాంటి భారీ హిట్ అందించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో కొత్త సినిమాను ప్రకటించింది. సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్స్ ని నిర్మించిన బెక్కెం వేణుగోపాల్..రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి 'అగ్లీ స్టోరీ'అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో నందు హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ గురించి బెక్కెం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు టైటిల్ లాంచ్ జరగగా ఈ చిత్రానికి "అగ్లీ స్టోరీ" అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు -
Vadhuvu OTT Web Series: అప్పుడు చిన్నారి పెళ్లి కూతురు.. ఇప్పుడేమో వధువుగా!
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది పాప్ కార్న్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌లో ఓటీటీ అభిమానులను అలరించేందుకు వస్తోంది. హోయ్‌చాయ్ ఓటీటీలో ఇందు పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేశారు. వధువు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సిరీస్‌లో అవికా గోర్, అలీ రెజా, నందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే జేడీ చక్రవర్తి నటించిన దయా థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తోన్న వధువు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ బయటకు వస్తే జరిగే పరిణామాలేంటి? వంటి ఆసక్తికర అంశాలతో వధువు వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ తాజా చిత్రం.. క్రేజీ అప్డేట్!
యంగ్ హీరో అనురాగ్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఉమాపతి’. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని ‘నాకొకటి నీకొకటి’ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. ఆయన చేతుల మీదుగానే విడుదల చేశారు. ఫిదా మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాం. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంటుంది.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదల చేసిన ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయిగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్! ) -
'చిన్నారి పెళ్లికూతురు' అస్సలు తగ్గట్లేదుగా! ఈ రేంజులోనా? (ఫొటోలు)
-
క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న అవికా గోర్
-
బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్
ఉయ్యాలా జంపాలా చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి హీరో నాగార్జున నిర్మాత కావడం మరింత కలిసొచ్చింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి వరుస సినిమాలతో హీరోయిన్గా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో పాప్ కార్న్ సినిమాతో సహ నిర్మాతగా పలకరించినా అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న అవికా గోర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రినయ్యా.. నా జీవితం పరిపూర్ణమైంది) 'స్టార్ హీరోల పవర్ మీదే సౌత్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తోంది. బాలీవుడ్ కంటే సౌత్‌లో నెపోటిజం కొంచెం ఎక్కువే.. హిందీ చిత్రాలపై అక్కడ పక్షపాతం ఉంది. సౌత్ సినిమాలు నేడు బాలీవుడ్లో చాలా రీమేక్ అవుతున్నాయి. వాటిని ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడి వారు మాత్రం బాలీవుడ్ చిత్రాలను పెద్దగా ఇష్టపడరు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. ప్రజలు కూడా దానినే ఇష్టపడుతున్నారు. #Bollywood Actress #AvikaGor about Nepotism in #Tollywood. pic.twitter.com/8MCnVpC9Dv— Crazy Buff (@CrazyBuffOffl) June 12, 2023 రాబోయే రోజుల్లో ఇది ఉండకపోవచ్చు' అని తెలిపింది. అవికా గోర్ కామెంట్లపై నెటిజన్లు మండి పడుతున్నారు. సౌత్‌లో అవకాశాలు దక్కించుకొని, మంచి పేరుతో పాటు డబ్బు సంపాదించాక చులకన చేసి మాట్లాడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. కాగా అవికా గోర్ ప్రస్తుతం 1920 హారర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీలో విడుదల కాబోతోంది. (ఇదీ చదవండి: సీనియర్ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్) -
Popcorn: ఆకట్టుకుంటున్న ‘మది విహంగమయ్యే’ సాంగ్
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మది విహంగమయ్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో అక్కినేని నాగచైతన్య విడుదల చేసి, సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా ఆలపించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ .. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది’అన్నారు. ‘కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. -
అప్పుడే బ్రెజిల్ స్టూడియోలో అవికా ముఖాన్ని చూశాను: నాగార్జున
‘‘పాప్ కార్న్’ ట్రైలర్ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో అక్కినేని నాగార్జున. అవికా గోర్, సాయి రోనక్ జంటగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్. చలపతి రాజు సమర్పణలో బోగేంద్ర గుప్తా నిర్మించారు. అవికా గోర్, ఎం.ఎస్. చలపతి రాజు, శేషు బాబు పెద్దింటి సహనిర్మాతలు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పదేళ్ల ముందు బ్రెజిల్లో రియో సిటీకి ఓ స్టూడియో చూద్దామని వెళ్లాను. అక్కడ అవికా గోర్ ముఖాన్ని చూశాను. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ను స్పానిష్లోనూ డబ్ చేశారు. 128 దేశాల్లో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ను డబ్ చేశారని ఆ తర్వాత తెలిసింది. అవికా ఎప్పుడో పాన్ వరల్డ్ స్టార్ అయ్యింది. ‘పాప్ కార్న్’లో హీరోయిన్గా నటించి, నిర్మాతగానూ మారినందుకు అభినందనలు’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభమైంది. నాగార్జునగారు మంచి నిర్మాత మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా. ‘పాప్ కార్న్’కి నిర్మాతగా చేయటం రిస్క్ అని కొందరు అన్నారు. కానీ, ఆ రిస్క్ తీసుకోవటం గర్వంగా ఉంది’’ అన్నారు అవికా గోర్. -
‘పాప్ కార్న్’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో నాగార్జున (ఫొటోలు)
-
Popcorn Trailer: పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే..
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. డిఫరెంట్ మైండ్స్ సెట్స్ ఉన్న ఇద్దరు వ్యక్తుల అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. ముందు ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్న వాళ్లిద్దరూ సమయం గడిచేకొద్ది స్నేహితులుగా మారుతారు. ఒకరిపై మరొకరికి అభిమానం కలుగుతుంది. ఈ జర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. రొటీన్‌కు భిన్నంగా దర్శకుడు మురళి గంధం పాప్ కార్న్ మూవీని తెరకెక్కిచినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకనిర్మాతలు తెలిపారు. -
అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’
శ్రీరామ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా ఇటీవల నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత నెల జూలై 1వ విడుదలైన మంచి విజయం సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇటివలె ఓటీటీకి వచ్చిన ఈ సినిమా అక్కడ సైతం ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటోంది. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ ప్రస్తుతం ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో అవికా గోర్ శ్రీరామ్ కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇక శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజల కామెడీ టైమింగ్‌తో సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగింది. కాగా ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సురేష్ బొబ్బలి ఈ సినిమాకు పాటలు అందించారు. -
‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ
‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ‘థ్యాంక్యూ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘థ్యాంక్యూ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #ThankYouTheMovie block buster .it's a feel good and emotional .@chay_akkineni excellent performance — Kumar (@Kumar47007099) July 22, 2022 ‘థ్యాంక్యూ’ బ్యూటిఫుల్ ఫీల్‌గుడ్ మూవీ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నాగచైతన్య యాక్టింగ్ పరంగా అదరగొట్టేశారని అంటున్నారు. మరికొంతమంది రోటీన్‌గా ఉందని, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిందని చెబుతున్నారు. #ThankYou..! There is ‘Gratitude’ but no magic this time from #VikramKKumar..! There is something missing and the actual soul of film is not felt..! #NagaChaitanya looks wise 👍🏼 but couldn’t deliver completely..! Even the csrip runtime felt like it was lagged..! 2.5/5..! — FDFS Review (@ReviewFdfs) July 22, 2022 ‘థ్యాంక్యూ’లో కృతజ్ఞత ఉంది కాని మ్యాజిక్ చేయలేకపోయింది. విక్రమ్ కె కుమార్ కొత్తగా ట్రై చేసిన ఎక్కడో తేడా కొట్టింది. సోల్ మిస్ అయింది. లుక్స్ పరంగా నాగచైతన్య కొత్తగా కనిపించాడు. కానీ పూర్తిస్థాయి నటనను కనబర్చలేకపోయాడు. రన్‌టైమ్ కూడా ల్యాగ్ అయినట్లు అనిపించింది’అంటూ ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు. First Half - good 👌. Narayanapuram Scenes and Bgm 💥💥. Waiting for 2nd half ...@chay_akkineni looks and acting 👌👌👌👌.#Thankyouthemovie!! — Akkineni_Agent (@akkineniagent) July 22, 2022 story vikram kumar dhe na??? too bad asal....Hype lekunda poina ekale...Chai disappointed this time... #ThankYouTheMovie — karthik (@karthik170920) July 22, 2022 #ThankYouTheMovie#ThankYouMovie A simple story weighed down by ordinary visuals and dragged narration. But it has some moments which served its purpose. Rating: 2.75/5 pic.twitter.com/UELTOiTkzN — Review Rowdies (@review_rowdies) July 22, 2022 1st half Ok (Some good and and some bad scenes) 2nd half good with good climax As usual @MusicThaman rocked with songs and BGM 👏 Overall Good movie and easy one time watch ❤️ #ThankYou @chay_akkineni and @SVC_official for bringing the movie to us 🤝 #ThankYouTheMovie — Albitthar Appanna (@ulfha_reddy) July 22, 2022 Nee story @BvsRavi okati ayina hit ayyindha bro? Ayina sare Vikram k Kumar kosam povali movie 😘 PC sir DOP is ❤️ #ThankYouTheMovie — Shashidharreddy🔔 (@Shashi262602) July 22, 2022 Very good second half with ok climax overall excellent one 👌 Everyone will love the journey of abhiram for sure😍👌👌👌 3.5/5⭐️ Only negative DOP (IMO)#ThankYouMovie @chay_akkineni https://t.co/cUatqIM9ef — koushik (@koushik0909) July 21, 2022 -
స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ
టైటిల్: టెన్త్ క్లాస్ డైరీస్ నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్ తదితరులు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార సంగీతం: సురేష్ బొబ్బిలి విడుదల తేది: జులై 1, 2022 అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి అజయ్ మైసూర్ సమర్పకులు. ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రం శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ: మిడిల్ క్లాస్ అబ్బాయి సోమయాజ్ (శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్ మ్యాన్‌గా స్థిరపడతాడు. డబ్బు, అమ్మాయిలు, లగ్జరీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. ఈ వెలితీతో జీవిస్తున్న అతనికి ఆనందం లేదు. అతని భార్య కూడా వదిలేస్తుంది. తను ఏది మిస్ అవుతున్నాడో తెలుసుకునేందుకు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే అతని ఆనందం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ప్రేమించిన తన ఫస్ట్ లవ్ చాందినీ (అవికా గోర్) దగ్గర ఉందని. దీంతో టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కు ప్లాన్ చేస్తాడు. మరీ ఆ రీ యూనియన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది ? చాందినీని కలుసుకున్నాడా ? అసలు చాందినీకి ఏమైంది ? అనే తదితర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'కు వెళ్లాల్సిందే. విశ్లేషణ: యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మనసులు హత్తుకునేలా ఉంటాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాలు కాస్తా అటు ఇటు అయిన తేడా కొడుతుంటాయి. అలాంటిదే ఈ కథ. నిర్మాత అచ్యుతరామారావు జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశంతో ఈ కథను రూపొందించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో ఈ సినిమా ద్వారా చూపించారు. నిజానికి ఇలాంటి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు దర్శకనిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ వారు ఎంచుకున్న కథను పక్కాగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయారు. ప్రేమించిన అమ్మాయి కోసం వెతికేందుకు చేసిన రీ యూనియన్, దానిలో భాగంగా వచ్చే సీన్లు ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. హాఫ్ బాయిల్ (శ్రీనివాస్ రెడ్డి), గౌరవ్ నిర్మాత (అచ్యుత రామారావు) మధ్య వచ్చే సీన్లు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులను తెగ నవ్వించారు. కానీ సోమయాజ్, చాందినీ ప్రేమ సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఈ లవ్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్‌లో హీరోయిన్ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల జీవితంలో కోరుకునే విషయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు. ఊహించని విధంగా ఉండే క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుంది. మూవీ మొత్తం ఎలా ఉన్న క్లైమాక్స్‌కు వచ్చేసరికి మాత్రం ఆడియెన్స్‌కు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది. ఎవరెలా చేశారంటే? తన ఫస్ట్ లవ్‌ను దక్కించుకోవాలనే ప్రేమికుడిగా, ఆనందం మిస్ అయిన బిజినెస్ మ్యాన్‌గా శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంతకుముందు 'రోజాపూలు' సినిమాలో చూసిన శ్రీరామ్ నటన, ఆ ఈజ్ ఎక్కడో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక అవికా గోర్ నటన కూడా పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంది. హీరో ఫ్రెండ్స్‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత అచ్యుత రామారావు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్‌గా అచ్యుత రామారావుకు మంచి భవిష్యత్తు ఉందనే చెప్పవచ్చు. వీరితోపాటు హిమజ, అర్చన, శివ బాలాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలోని బీజీఎం '96' మూవీని తలపిస్తుంది. ఇక 'గరుడవేగ' అంజికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. రీ యూనియన్ సీన్లు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. సినిమాలోని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్' మీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చాలవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్)