ఉయ్యాలా.. జంపాలా.. ఓ అందమైన చిత్రం
ఉయ్యాలా.. జంపాలా.. ఓ అందమైన చిత్రం
Published Sat, Dec 28 2013 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
నగరంలో ఉయ్యాలా... జంపాలా.. చిత్ర యూనిట్ సందడి చేసింది. యువ నటీనటులను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. కీర్తన థియేటర్‌లో శుక్రవారం ఈవీవీ యువ కళావాహిని, సురేష్ ఫిలింస్ సంయుక్తంగా చిత్ర యూనిట్ సన్మాసన సభ నిర్వహించారు. చిత్ర దర్శకుడు విరించి వర్మ, హీరో హీరోయిన్లు రాజ్‌తరుణ్, అవికగోర్ థియేటర్‌లోకి రాగానే ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను చూసి చేతులు ఊపుతూ పలుకరించారు. సభలో సినిమా బాగుందా.. ఎన్నిసార్లు చూసారు.. అన్ని ప్రశ్నిస్తూ సమాధానం చెప్పించారు. కొన్ని హుషారైన డైలాగులు చెప్పి, పాటలు పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.
గుంటూరు నుంచే తమ విజయయాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వర్మ మాట్లాడుతూ ఉయ్యాలా.. జంపాలా అందమైన చిత్రమని, నూతన నటీనటులతో, కొత్త ఒరవడితో నిర్మించిన ఈ సినిమా విజయవంతం అయిందని చెప్పారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం సంతోషం కలిగించందన్నారు. అవికగోర్ మాట్లాడుతూ పల్లెటూరి స్వచ్ఛతను చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నల్లూరి వెంకటేష్, సహాయ నటులు శశాంక్, పీలా గంగాధర్, సహనిర్మాత ప్రసాద్, సురేష్ ఫిలింస్ మేనేజర్ మాదాల రత్తయ్య చౌదరి పాల్గొన్నారు.
Advertisement