Uyyala Jampala
-
‘కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది'
చిత్రం : ఉయ్యాల జంపాల రచన : ఆరుద్ర గానం : ఘంటసాల, సుశీల సంగీతం : పెండ్యాల ‘ఉయ్యాల – జంపాల’ చిత్రంలో ఆరుద్ర సమకూర్చిన పాట ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది’. అప్పటికీ (1965) ఇప్పటికీ మసకబారలేదు. ప్రతి పదం పూలరెక్కల కోమలం. కవితామయం. అన్ని వర్గాల తెలుగు శ్రోతలకి యీ పాట ఒక కలవరం. మాన్యులు ఆరుద్రని ఎప్పుడు కలిసినా ‘కొండగాలి తిరిగింది’ పల్లవిని మెచ్చుకునేవాణ్ని. ఆయన ఒకసారి ఆ పల్లవి రహస్యం చెప్పమంటారా అని మొదలుపెట్టారు. ‘‘కె. బి. తిలక్, నేను బాగా కావల్సినవాళ్లం. ‘ఉయ్యాల – జంపాల’ లొకేషన్స్ వేటలో తిలక్‌తో బాటు నేనూ వెళ్లాను. మద్రాసు దాటి ఆంధ్రా నడిబొడ్డుకు వచ్చాం. ఎక్కడ చూసినా రోడ్డు పక్క పశువులు, వాటి కాపర్లు. నిదానంగా కారులో వెళుతున్న మాకు గొడ్ల కాడి బుడ్డోడు గేదె మీద ఎక్కి వుల్లాసంగా పాడుకున్న పాట గూబలు అదిరేలా వినిపించింది. పరమ జానపదం. అది చెప్పలేనంత ముతక భాష, ముతక భావం. కారు వెంటనే రోడ్డు వార ఆపించాను. ఆ పిల్లలు అడిగితే మళ్లీ పాడరు. వాళ్లంత వాళ్లు పాడినపుడే దాని అందం, మళ్లీసారి శ్రద్ధగా విన్నా. ‘‘,,,,,.... కొండగాలి తిరిగింది..... కూతుర్ని పంపారో మామో’’ – యిదీ... మినహాయింపులతో మాతృక. ఆ జానపదంలోంచి కొండగాలి తిరిగింది పల్లవి పుట్టింది. స్వేచ్ఛగా, ఏ సెన్సారు జంకులూ లేకుండా వచ్చిన పల్లవి కదా... జీవశక్తి దానికి అధికం’’ అంటూ ఆరుద్ర గడ్డం సవరించుకున్నారు. పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది.. అసలే పాలపిట్ట రంగులతో సొగసుగా వుంటుంది. ఇక అది కులికితే చెప్పాలా! పచ్చని గట్ల మీద చెంగుచెంగున వయసులో వున్న లేడి గంతులేసి ఆడుతుంటే చూడముచ్చట. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడడం, పట్టరాని లేతవలపు పరవశించి పాడడం... కన వేడుకే. అన్నీ కవి సమయాలే! ఈ చక్కదనాల్ని ఆరుద్ర చరణాలలో సమకూర్చారు. నిలువెల్లా పాటకు నిండుదనం తెచ్చారు. తర్వాతి చరణంలో – మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది/ నాగమల్లెపూలతో నల్లని జడ నవ్వింది పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది/ ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అంటూ పాట ముగించారు. సినిమా పాటకు కొత్త ఆయతనం తెచ్చారు ఆరుద్ర. పడుచుదనానికి ఉద్దీపకం తాంబూలం. తాంబూలంతో పడుచుదనం మరింత అందగిస్తుంది. అన్ని ఆశలూ చూపించి చివరకు ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అనే తాత్విక ధోరణిలో తీర్మానించారు. కవికి యీ పాట పల్లవి ఒక ముతక సాహిత్యం ప్రేరణ అయితే, మిగతా పాటని ఒక పూనకంలో తన్మయత్వంలో రాశారన్నది నిజం. ఈ పాటంటే తెలుగువారికే కాదు ఆరుద్రకి కూడా యిష్టం. ‘అది అలా కుదిరింది’ అని ఆరుద్ర గడ్డం సవరించుకునేవారు. – నిర్వహణ : వైజయంతి పురాణపండ -
‘ఇంకా అదే వాల్ పేపర్.!’
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తరువాత వరుస సినిమాలతో బిజీగా కనిపించాడు. కానీ వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురుకావటంతో కాస్త స్లో అయ్యాడు. కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. ఓ అభిమాని ‘మన సూపర్ స్టార్ అభిమాని, రాజ్ తరుణ్ అన్న మొబైల్ వాల్‌పేపర్’ అన్న కామెంట్‌తో మొబైల్ వాల్ పేపర్ స్క్రీన్ షాట్‌ను రాజ్‌తరుణ్‌కు ట్యాగ్ చేశాడు. ఈ కామెంట్ పై స్పందించిన రాజ్ తరుణ్ ‘ఇప్పటికీ అదే వాల్‌పేపర్’ అంటూ రిప్లై ఇచ్చాడు. Still the same!!! https://t.co/zGCoshrDix — Raj Tarun (@itsRajTarun) 6 December 2018 -
‘ఉయ్యాల జంపాల’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో బ్రేక్
గుంటూరు, తెనాలి: సినిమా పాటతో చదువుకునే రోజుల్నుంచి ప్రయాణం కట్టాడో యువకుడు. పాటను పలవరిస్తూ, కలవరిస్తూ, పాటే జీవితమనుకున్నాడు. తెలుగు సినిమా వేదికగా నిరూపించుకోవాలని కలలుగన్నాడు. చదువు పూర్తవగానే తన కలలు నెరవేర్చుకునేందుకు ఓ సుముహూర్తాన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగాయి. ఒకే ఏడాది పది సినిమాలకు పాటలు రాసే ఘనతను పొందాడు. ఉయ్యాల జంపాల, మజ్నూ, అర్జున్‌రెడ్డి సినిమాలతో యువతరానికి దగ్గరైన ఆ గీత రచయిత గోసాల రాంబాబు. సాదాసీదాగా మన పక్కింటి కుర్రోడిలా కనిపించే ఆ యువకుడి కలం అన్ని రకాల ఎమోషన్లను ప్రతిబింబించే పాటలు రాస్తుందన్న ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమా పాటల నిమిత్తం తెనాలి వచ్చిన రాంబాబు పాటతో తన ప్రయాణాన్ని ఇలా వివరించారు. ఈ ఏడాది పది సినిమాలు... టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా దర్శకత్వంలో తీస్తున్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమాకు పాటలు రాస్తున్నా. యాజమాన్య సంగీత దర్శకత్వంలో నాలుగు పాటలు రికార్డయ్యాయి. మొత్తం అయిదుపాటలు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉంటాయి. చివరిపాట టైటిల్సాంగ్పై డిస్కషన్‌కు తెనాలి వచ్చాను. గ్రామీణ నేపథ్యంలోని కథ, చక్కని కామెడీతో జంధ్యాల మార్కు సినిమాలో పాటలు రాయడం మంచి అవకాశం. సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాట ఏ విధంగా ఉండాలనేది దర్శకుడు సూచించారు. యాజమాన్య అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’తో ఈ ఏడాది నేను పాటలు రాసిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. మరో నాలుగు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి ఇంకో మూడు సినిమాలకు పాటలు రాస్తున్నా. మొత్తంమీద ఈ ఏడాది పది సినిమాలకు రాసినట్టవుతుంది. యువతరానికి దగ్గర చేసిన సినిమాలు... నిజానికి 2007 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతూ పాటలు రాస్తున్నా. తొలి గుర్తింపు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వచ్చింది. రాజ్‌తరుణ్, అవికాగోర్ నటించిన ఈ సినిమాకు విరించివర్మ దర్శకుడు. ‘నిజంగా... అది నేనేనా/ ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే’ అన్న పాట నేనొకడిని ఉన్నానని జనానికి తెలియజేసింది. ఇదే దర్శకుడు నానీతో తీసిన ‘మజ్నూ’లో ‘జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే’ లవ్ మెలోడీ సాంగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ పాట చరణంలోని ‘వాలు కనులలోన దాచేసినావా/ ఆ నింగిలోన లేదు నీలం’ చక్కని భావగీతంగా భుజం తట్టారు. అన్నిటికీ మించి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నన్ను యువతరానికి బాగా దగ్గర చేసింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే లవ్ బ్రేకప్ పాటతో సినిమా ఆరంభమవుతుంది. అదే సినిమాలో క్లైమాక్స్‌లో కథంతా చెబుతున్నట్టుగా ‘ఊపిరాడుతున్నదే ఉన్నపాటుగా ఇలా...దారేంటో తోచకున్నదే నిన్ను చూడగా ఇలా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్. ఆ రెండు పాటలు రాసే అవకాశం నిజంగా నా అదృష్టమే. మరో పది సినిమాల్లో అవకాశాలను తెచ్చింది. ఈ సినిమాతోనే నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది. పాటతో ప్రయాణం రేడియోతోనే... మా స్వగ్రామం ఏలూరు దగ్గర్లోని కృష్ణాజిల్లా గ్రామం వేల్పుచర్ల, సాధారణ పల్లెటూరు. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, దానయ్య. వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడినప్పటికీ నన్నూ, తమ్ముడినీ, చెల్లెలినీ చదివించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. పాటపై మమకారం పెరగడానికి కారణం ఇంట్లో రేడియో. తాతయ్య అమ్మకు కొనిచ్చారట. ఇంట్లో ఉన్నంతసేపు రేడియోలో పాటలు వింటూ హమ్ చేసేవాడిని. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నాలుగు కి.మీ దూరంలోని హైస్కూలుకు వెళ్లేవాడిని. తర్వాత ఇంటర్, ఇంజినీరింగ్ ఏలూరులో. బస్టాండులో పాటల పుస్తకాలు కొనుక్కుని, అందులో పాటలు పాడుకుంటూ ప్రయాణించేవాడిని. మధ్యమధ్యలో నేనే సొంతంగా పాటలు అల్లుతూ వచ్చాను. ఆ రకంగా పాఠ్యపుస్తకాలతో పాటు పాటతో నా విద్యార్థి జీవితం గడించింది. తర్వాతి జీవితం పాటతోనే సాగించాలనుకుంటూ, 2007లో చదువైపోగానే హైదరాబాద్ బయలుదేరి వెళ్లా. ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి దగ్గర పనిలో చేరడం నా అదృష్టం. అద్భుతమైన ప్రతిభామూర్తి, అర్ధగంటలో పాట రాసేవారు. నేను చేరిన ఆర్నెల్ల తర్వాత ఆయన కాలం చేశారు. 30 సినిమాల్లోవంద పాటలు... 2007లో ఉదయ్‌కిరణ్, శ్రీహరిల ‘వియ్యాలవారి కయ్యాలు’ నా తొలి సినిమా. రమణ గోగుల సంగీత దర్శకుడు. నేను అనుకున్న ట్యూన్‌లోనే పాటని కంపోజ్ చేయడం మంచి అనుభూతి. తర్వాత ‘టిక్‌టిక్‌టిక్’, ‘లవ్ చేస్తున్నా’ వంటి సినిమాలకు రాస్తూ వచ్చాను. ఉయ్యాల జంపాల తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ‘బందిపోటు’కు ‘ఏదో మాయవై ఉన్నాదే మనసాగనన్నాదే’ మెలోడీ పాట రాశా.మజ్నూ తర్వాత జగపతిబాబు హీరోగా తీసిన ‘పటేల్ సార్’ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. పద్మాలయ మల్లయ్యగారు కుమారుడు హీరోగా తీసిన సినిమాలో ‘ఓ సజనా ఓ సజనా’ రాశాను. శ్రీకాంత్ ‘నాటుకోడి’లో ‘కన్ను పడిందే, కన్ను పడిందే నీపై నా కన్ను పడిందే’ మాస్ మసాలా పాట రాయించారు. సాయిధరమ్ తేజ సినిమాలో ‘హ్యాపీ ఫ్యామిలీ’ పాటతో ఫ్యామిలీ సాంగ్‌కు అవకాశం లభించింది. ‘ప్రేమెంత పనిచేసెను నారాయణ’, ‘సమీరం’, సీతాపహరణం’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. మొత్తంమీద 30 సినిమాల్లో వంద పాటలు రాశాను. అందరు హీరోలతో అన్ని రకాల ఎమోషన్లతో రాయాలనేది నా ఆశ... -
కుర్రాడికి కోటి కావాలంట..?
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రహీరో రాజ్ తరుణ్. షార్ట్ ఫిలింస్ నుంచి వెండితెర మీదకు వచ్చిన ఈ కుర్రాడు. తరువాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాల సక్సెస్‌తో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు నిరాశపరిచినా మంచు విష్ణుతో కలిసి చేసిన మల్టీ స్టారర్ ఈడోరకం ఆడో రకం విజయం సాధించటంతో రాజ్ తరుణ్ డేట్స్ కోసం నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు. డిమాండ్ ఉన్నప్పుడే కాస్త వెనకేసుకోవాలని ఫీలయ్యాడేమో.. ఈ కుర్ర హీరో తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇలా భారీ మొత్తం డిమాండ్ చేయటం వల్లే.., కొన్ని బడా నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెల్లిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఈ వార్తలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
ఉయ్యాల జంపాల డైరెక్టర్‌తో నాని
ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయం సాధించిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించినా.. తరువాత అవకాశాలు పొందటంలో మాత్రం ఈ యువ దర్శకుడు వెనకపడ్డాడు. తొలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వర్మ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నయంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విరించి వర్మతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు నాని. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్న వర్మ, నటీనటులు ఎంపిక కూడా మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
రావే మా ఇంటికి... రావే మా ఇంటికి...
‘చిన్నారి పెళ్లికూతురు’ టీవీ సీరియల్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న అవికాగోర్ ‘ఉయ్యాల జంపాల’తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె 20 కథలు విన్నారు. ఫైనల్‌గా ఆమెకో కథ నచ్చింది. అదే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. వైజాగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ కుటుంబ ప్రేమకథ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడు. రచయిత నంద్యాల రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నాగశౌర్య - అవికాగోర్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. టైటిల్‌కి మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఆగస్టు 6తో టాకీపార్ట్ పూర్తవుతుంది. అదే నెలాఖరు నుంచి వైజాగ్‌లో పాటల చిత్రీకరణ చేస్తాం. కేఎం రాధాకృష్ణన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆనంద్, గోదావరి, చందమామ తరహాలో సంగీతం ఆహ్లాదకరకంగా ఉంటుంది’’ అని తెలిపారు. రావు రమేశ్, నరేశ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. -
కథ వినగానే లవ్‌లో పడ్డాను
శౌర్య, ‘ఉయ్యాలా జంపాల’ఫేం అవికా గోర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. సీనియర్ పాత్రికేయుడు గిరిధర్ నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి కేఎల్ దామోదరప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. గిరిధర్ మాట్లాడుతూ -‘‘సినీ పాత్రికేయునిగా పాతికేళ్ల కెరీర్ నాది. మంచి కథతో సినిమా నిర్మించాలనే నా ఆశ ఈ సినిమాతో నెరవేరుతోంది. నంద్యాల రవి చక్కని కథ తయారు చేశారు. అవికా కోసం ఆరు నెలలు ఎదురు చూశాం. ఆమె ఓకే చేయడంతో సినిమాకు మరింత గ్లామర్ వచ్చినట్లైంది. ‘ఇడియట్’ ద్వారా రవితేజకు ఎంత మంచి పేరొచ్చిందో, శౌర్యకు ఈ చిత్రం అంత మంచి పేరు తెస్తుంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ‘‘కమర్షియల్‌గా ఆలోచించకుండా మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని సమర్పకుడు తాడిశెట్టి వెంకట్రావ్ అన్నారు. కథకు తగ్గ టీమ్ కుదిరిందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. కథ వినగానే... తన పాత్రతో లవ్‌లో పడిపోయానని, ‘ఉయ్యాలా జంపాల’లా తనకు మరో విజయాన్ని ఈ సినిమా ఇస్తుందని అవిక నమ్మకం వ్యక్తం చేశారు. మంచి కథలో హీరోగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని శౌర్య చెప్పారు. ఇంకా సయాజీషిండే, భాస్కరభట్ల తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: సాయిశ్రీరామ్. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఊగాలిలా అతడు: ఒహో... నీవేగా నాలో నా గుండెలో శ్రుతి లయ ఒహో... నీవేగా నాకు నా ఊహలో సఖీ ప్రియా చరణం : 1 ఆ: చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది చందమామ నీలో వాలి నా పక్కనుంది నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా అ: ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది కాలాన్నిలా ఆపే బలం ఇద్దరిలో ఉంది రేపంటూ మాపంటూ లేనేలేని లోకంలో ఇద్దరిని ఊరించని ఆ: ఎటువైపు చూస్తున్నా నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా అ: ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా ఆ: ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ అ: మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని చరణం : 2 ఆ: నా పాదమే పదే పదే నీ వైపుకే పడే అ: జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే ఆ: ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా అ: గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతేలా ఇద్దరం చెరో సగం సగం సగం సగం ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013) రచన : వాసు వలబోజు సంగీతం : సన్నీ ఎమ్.ఆర్ గానం : హర్షిక గుడి, అనుదీప్ దేవ్ నిర్వహణ: నాగేశ్ -
ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనదే!
నాగార్జున మంచికొడుకు... మంచి తండ్రి. మంచి హీరో... మంచి నిర్మాత. ఓవరాల్‌గా ఆయనో గుడ్ పర్సన్. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన తీరులో ఈ లక్షణాలన్నీ కనిపించాయి. తాను నిర్మించిన ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా ప్రేక్షకాదరణ చూరగొంటోందని ఆనందం వ్యక్తం చేస్తూ, తన తండ్రి గురించి, తన బిడ్డల గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి, చేసిన తప్పులు గురించి, చేయాలనుకుంటున్న ఒప్పుల గురించి మనసు విప్పి మాట్లాడారు. కొంతవరకూ ఆ బాధను మరపించింది: ‘13’ని చాలామంది బ్యాడ్ నంబర్ అంటారు. అందుకు తగ్గట్టే... 2013 ఇబ్బందిగా సాగింది. గ్రీకువీరుడు, భాయ్ పరాజయాలు.. నాన్నగారి అనారోగ్యం.. ఇలా ఎన్నో ఇబ్బందులు. వీటి మధ్య కూడా ఆనందాన్ని పంచిన విషయం మాత్రం ‘ఉయ్యాలా జంపాలా’. గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథలు ఈ మధ్య రావడం లేదు. ఆ లోటుని తీర్చేసిందీ సినిమా. వసూళ్ల లెక్కల్ని తీసి పక్కన పెడితే...నా దృష్టిలో ఈ సినిమా వెరీ బిగ్ హిట్. నాపై నాకే గౌరవం పోయింది: ‘భాయ్’ ఇచ్చిన అనుభవంతో నాపై నాకే గౌరవం పోయింది. ఈ సినిమా చూస్తే... నా కుటుంబ సభ్యులకు కూడా నాపై గౌరవం సన్నగిల్లుతుందని వారిని కూడా సినిమా చూడొద్దన్నాను. ఇన్నాళ్లూ ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానని చాలా బాధపడ్డాను. ఈ సినిమాకు నిర్మాతను నేనే కాబట్టి, ఎవర్నీ నిందించలేను. ఇక నుంచి అలాంటి పొరపాట్లు చేయను. ‘భాయ్’ నేర్పిన గుణపాఠంతో ఇక నుంచి నవ్యమైన కథలతోనే సినిమాలు చేస్తాను. బెల్లంకొండ సురేష్, ఎస్.గోపాల్‌రెడ్డిల సినిమాలను గతంలో ‘ఓకే’ చేశాను. కానీ వాటిని కూడా రద్దు చేసుకున్నాను. కొత్త కథలతో వస్తేనే చేస్తా. ప్రస్తుతం నాకు దొరికిన ప్రతి క్షణం విలువైనదే. సాధ్యమైనంత వరకూ ఎక్కువ సమయాన్ని నాన్నగారి కోసమే కేటాయిస్తున్నాను. నాన్న కాస్త బలహీనంగా ఉన్నారు: నాన్న పరిస్థితి ఎలా ఉందని చాలామంది అడుగున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే... కాస్త నీరసంగా ఉన్నారు. హార్ట్ ప్రాబ్లమ్ వల్ల కూర్చుని ఒక్క సారి లేస్తే... ఆయనకు కళ్లు తిరుగుతున్నాయి. అందుకే వీల్‌చైర్‌లో ఉంటున్నారు. అవసరం మేరకు నడుస్తున్నారు. మొన్నటివరకూ ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మార్నింగ్ వాక్ చేసేవారు. ఇప్పుడు ఇంట్లోనే చేస్తునారు. నాన్న ఉదయం నిద్ర లేవగానే మా ఫ్యామిలీ మొత్తం ఆయన ముందు ఉంటున్నాం. నాన్న కూడా సరదాగా ఉంటున్నారు. ముందెన్నడూ చెప్పని ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతున్నారు. సర్జరీ తర్వాత కూడా నటించారు: ‘మనం’ సినిమాలో నాన్నగారిపై తీయాల్సిన కొన్ని సీన్స్ ఉండగా... ఆయనకు సర్జరీ జరిగింది. ‘సినిమా పూర్తవ్వడానికి చాలా టైమ్ ఉంది. మీరు పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ పెట్టుకుందాం’ అని చెప్పినా ఆయన వినలేదు. అంత ఇబ్బందిలో కూడా షూటింగ్లో పాల్గొన్నారు. ‘ఏమో.. అనారోగ్యం వల్ల ముందు ముందు నా వాయిస్‌లో ఏమైనా తేడా వస్తుందేమో..’ అని డబ్బింగ్ కూడా ఇంట్లోనే చెప్పేశారు. ఈ వయసులో కూడా అంత డెడికేషన్ ఉండటం నిజంగా గ్రేట్.ఇద్దరూ సమానమే: చైతూ, అఖిల్ ఇద్దరూ నాకు సమానమే. అయితే... చైతూ నాకు మంచి ఫ్రెండ్. నాతో తను అన్నీ పంచుకుంటాడు. నాకు భావోద్వేగాలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వాడికి అలాంటివి ఉండవ్. స్టేబుల్‌గా ఉంటాడు. నేనేమైనా ఉద్వేగానికి లోనైతే.. నన్ను సముదాయిస్తాడు. మెచ్యూర్డ్ మెంటాల్టీ వాడిది. పెద్దలపై గౌరవం కూడా ఎక్కువ. ‘మనం’లో నాన్నని ఓ సన్నివేశంలో ‘ముసలోడా’ అనాలి. దానికి ఎంత ఇబ్బంది పడ్డాడో. ‘ఇది సినిమారా.. అనాలి. అవసరమైతే... తర్వాత సారీ చెప్పు’ అని నాన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు. కష్టపడి వాడితో ఆ మాట అనిపించాం. ‘మనం’లో అఖిల్ ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజంలేదు. అఖిల్ హీరోగా ఈ ఏడాదే సినిమా ఉంటుంది. నేనే నిర్మాతను. దర్శకుణ్ణి ఎంచుకునే బాధ్యత అఖిల్‌దే. -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఆనందిని
-
గోదావరి తీరంలో ‘ఉయ్యాలా జంపాలా’
విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన ఉయ్యాలా జంపాలా చిత్రం యూనిట్ శనివారం రాజమండ్రిలోని సూర్య మినీ హాలుకు వచ్చింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, అవిక గోర్ డైలాగ్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ప్రదర్శిస్తున్న అన్ని చోట్ల మంచి స్పందన వస్తోందన్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని వారు ప్రేక్షకులను కోరారు. -
ఉయ్యాలా.. జంపాలా.. ఓ అందమైన చిత్రం
నగరంలో ఉయ్యాలా... జంపాలా.. చిత్ర యూనిట్ సందడి చేసింది. యువ నటీనటులను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. కీర్తన థియేటర్లో శుక్రవారం ఈవీవీ యువ కళావాహిని, సురేష్ ఫిలింస్ సంయుక్తంగా చిత్ర యూనిట్ సన్మాసన సభ నిర్వహించారు. చిత్ర దర్శకుడు విరించి వర్మ, హీరో హీరోయిన్లు రాజ్‌తరుణ్, అవికగోర్ థియేటర్లోకి రాగానే ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను చూసి చేతులు ఊపుతూ పలుకరించారు. సభలో సినిమా బాగుందా.. ఎన్నిసార్లు చూసారు.. అన్ని ప్రశ్నిస్తూ సమాధానం చెప్పించారు. కొన్ని హుషారైన డైలాగులు చెప్పి, పాటలు పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. గుంటూరు నుంచే తమ విజయయాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వర్మ మాట్లాడుతూ ఉయ్యాలా.. జంపాలా అందమైన చిత్రమని, నూతన నటీనటులతో, కొత్త ఒరవడితో నిర్మించిన ఈ సినిమా విజయవంతం అయిందని చెప్పారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం సంతోషం కలిగించందన్నారు. అవికగోర్ మాట్లాడుతూ పల్లెటూరి స్వచ్ఛతను చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నల్లూరి వెంకటేష్, సహాయ నటులు శశాంక్, పీలా గంగాధర్, సహనిర్మాత ప్రసాద్, సురేష్ ఫిలింస్ మేనేజర్ మాదాల రత్తయ్య చౌదరి పాల్గొన్నారు. -
చిన్న సినిమాను పెద్ద హిట్ చేశారు
ప్రేక్షకులు చాలా పెద్ద హిట్ చేశారని ‘ఉయ్యాల జంపాలా’ హీరో రాజ్‌తరుణ్ అన్నారు. ఈ సినిమా విజయయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక అంబికా థియేటర్‌కు వచ్చారు. రాజ్‌తరుణ్ విలేకర్లతో మాట్లాడుతూ చాలా చిన్న సినిమా అనుకున్నామని ప్రజలు ఈసినిమాను బాగా ఆదరిస్తున్నారని అన్నారు. ఇది తనకు మొదటి సినిమా అని విడుదల అనంతరం చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. హీరోయిన్ అవికగోర్ మాట్లాడుతూ సినిమా పెద్దహిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వి.వర్మ మాట్లాడుతూ తన మొదటి సినిమాకే ముగ్గురు పెద్ద నిర్మాతలు ముందుకు రావడం, చిత్రం హిట్కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు ఇచ్చిన ఈ బహుమతి మరిచిపోలేనిదన్నారు. అనంతరం చిత్ర హీరో, హీరోయిన్లు ప్రేక్షకులతో సందడి చేశారు. థియేటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'ఉయ్యాలా జంపాలా' రివ్యూ
ఉయ్యాలా జంపాలా చిత్రంలో నటించిన వారందరూ దాదాపు అందరూ కొత్తవారే. కాని ప్రమోషన్ కారణంగా ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు నాగార్జున, డి. సురేశ్ లాంటి అగ్ర నిర్మాతలు భాగస్వాములు కావడం ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచింది. చిన్న చిత్రమైనా..ఓ భారీ బడ్జెట్ చిత్రానికి లభించే పాపులారిటీని సంపాదించుకున్న ఉయ్యాలా జంపాలా 2013 సంవత్సరాంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు చేరుకుందో తెలుసుకునే ముందు కథ ఏంటో తెలుసుకుందాం... గోదావరి జిల్లా కూనవరం నేపథ్యంగా సాగే పక్కా గ్రామీణ ప్రేమ కథా చిత్రంలో సూరి, ఉమాదేవి బావ, మరదళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపించే బావ మరదళ్ల సరసం, చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలు, ఆటపట్టించడం లాంటి తమాషాలు సూరి, ఉమల బాల్యంలో ఓ భాగం. వారి జీవితం అలా సాగిపోతుండగా అనుకొని సంఘటన వారిద్దర్ని మరింత దగ్గరికి చేరుస్తుంది. అంతేకాకుండా సూరిపై తనకు ఉన్న ఇష్టం ప్రేమ అని ఉమకు అర్ధమవుతుంది. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న తగాదాల కారణంగా ఉమకు సూరి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సూరి ఖాయం చేసిన పెళ్లి ఉమ చేసుకుంటుందా? లేక సూరికి తన ప్రేమను తెలుపుతుందా? సూరి, ఉమాదేవిల మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ పెళ్లి వరకు దారి తీస్తుందా అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే ఉయ్యాలా జంపాలా. సూరిగా రాజ్ తరుణ్, ఉమాదేవిగా అవికాలు నటించారు. తెలుగు తెరకు కొత్తవారైనా ఇద్దరు మెచ్యురిటీతో అద్భుతంగా నటించారు అని చెప్పడం కన్నా ఆ పాత్రల్లో జీవించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజ్ తరుణ్ చాలా నేచురల్ గా, సూరి పాత్రను అవలీలగా పండించాడు. సూరి పాత్రకు ధీటుగా ఉమాదేవి పాత్రను అవికా అంతే మొత్తంలో మంచి ఎక్స్ ప్రెషన్స్, కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించింది. మొత్తంగా ఉయ్యాలా జంపాలాలో రాజ్ తరుణ్, అవికాలు కీలకంగా మారి, ఒంటి చెత్తో నడిపించారు. మిగతా పాత్రల్లో ప్రతి ఒక్కరు ఉయ్యాలా జంపాలాను ఓ మంచి ఫీల్ గుడ్ మూవీగా మలచడానికి శాయశక్తుల ప్రయత్నించారు. ఉయ్యాలా జంపాలా చిత్రాన్ని ఓ సింపుల్ కథను ఎంచుకుని దర్శకుడు విరించి వర్మ హ్యాండిల్ చేసిన విధానం ప్రశంసనీయం. గతంలో బావ మరదళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటూ తమలోని ప్రేమను వ్యక్త పరుచుకోలేకపోవడం క్లైమాక్స్ లో ఒక్కటవ్వడం లాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే ఈ చిత్రంలో దర్శకుడి ట్రీట్ మెంట్, గోదావరి అందాలు, భాష, యాస ఉయ్యాల జంపాలకు మరింత శోభను తెచ్చాయి. అయితే సెకాండాఫ్ లో కథనంలో వేగం తగ్గినా.. క్లైమాక్స్ లో సర్దుకుంది. దర్శకుడు అక్కడక్కడా తడబాటుకు గురైనట్టు అనిపించినప్పటికి..ఓవరాల్ గా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో ముఖ్యంగా డైలాగ్స్, కామెడీ ఆకట్టుకున్నాయి. పాటలు చెప్పకునే రేంజ్ లో లేకపోయినా సన్ని అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ ఫీల్ ను కంటిన్యూ చేయడంలో నూరుపాళ్లు సఫలమైంది. కెమెరామెన్, ఎడిటర్ పనితీరు మెరుగ్గా కనిపించింది. రొటిన్ కథలు, అవసరం ఉన్నా లేకపోయినా వెంటాడే ట్విస్ట్ లతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఉయ్యాలా జంపాలా వినోద పరంగా చక్కటి చిత్రంగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. ముఖ్యంగా సెలవుల్లో సరదాగా వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలా జంపాలా కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. కోస్తాంధ్ర గ్రామీణ నేపథ్యంతో అశ్లీలత, అసభ్యత లేని స్వచ్చమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. - రాజబాబు అనుముల -
ఏడాదికి మూడు డిసెంబర్లు ఉంటే బాగుండేది
‘‘నాకు నిజంగా డిసెంబర్ అచ్చొచ్చిన నెల. అందుకే ఏడాదికి మూడు డిసెంబర్లు ఉంటే బాగుండేది... ఎంచక్కా మూడు సినిమాలు విడుదల చేసుకుని ఉండేవాణ్ని’’ అని నాగార్జున చమత్కరించారు. డి.సురేష్‌బాబు, రామ్మోహన్‌తో కలిసి విరించివర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ, ‘‘ఇళయరాజా పాటల్లాగా సుతిమెత్తగా హృదయానికి హత్తుకునే సినిమా ఇది. ఎనభైలకు ముందు తెలుగుదనం ఉండే చిత్రాలొచ్చేవి. ఆ తర్వాత అంతా ఫైట్లు, డ్యాన్సులతో వేగం పెరిగిపోయింది. మళ్లీ పాత రోజుల్ని గుర్తుచేసే విధంగా ‘ఉయ్యాలా జంపాలా’ ఉంటుంది. ఇకపై చిన్న సినిమాలను ఇలాగే ఎంకరేజ్ చేయాలని ఉంది’’ అని చెప్పారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇందులో నాయికగా చేసిన అవికకు చాలా పాపులార్టీ ఉంది. నెలకు ఏడు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చిందని తెలిసి, ఇంత చిన్న సినిమాకు ఆమె అవసరమా అనుకున్నాను. కానీ తెరపై ఆమెను చూశాక, రామ్మోహన్ ఎంపిక ఎంత కరెక్టో అర్థమైంది’’ అన్నారు. ఇది కొత్త తరహా సినిమా అని రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విరించివర్మ, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అవిక కూడా మాట్లాడారు. -
అచ్చమైన స్వచ్ఛమైన సినిమా ఇది
‘‘పల్లెటూరి స్వచ్ఛత, బావామరదళ్ల సరసం, గోదావరి వెటకారం, చక్కని హాస్యం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు... వీటన్నిటి కలగలుపే ‘ఉయ్యాలా జంపాలా’. అచ్చమైన స్వచ్చమైన సినిమా ఇది’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్ పి. తో కలిసి నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’. రాజ్‌తరుణ్, ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేమ్ అవిక జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సన్నీ ఎం.ఆర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.సురేష్‌బాబు, నాగచైతన్య ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని శరత్‌మరార్, జెమినీ కిరణ్‌లకు అందించారు. ఈ సందర్భంగా వీడియో విజువల్స్ ద్వారా నాగార్జున మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం యువతరానికి బాగా నచ్చే సినిమా ఇది. సినిమా నచ్చి మాతో సురేష్‌బాబు కూడా కలిశారు. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది’’అని నమ్మకం వ్యక్తం చేశారు. కథ కల్పితమైనప్పటికీ పల్లెటూళ్లలో తాను చూసిన కొన్ని పాత్రలను ప్రేరణగా తీసుకొని ఈ కథను అల్లానని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ఊరిని ఒకసారి చూడాలనుకుంటారని దర్శకుడు చెప్పారు. ముచ్చటైన సినిమా ఇదని అక్కినేని అమల తెలిపారు. ప్రేమతో సినిమా చేస్తేనే ఇలాంటి సినిమాలొస్తాయని నాగచైతన్య చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు నాని, సుమంత్, గుణ్ణం గంగరాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీరెడ్డి తదితరులు మాట్లాడారు. -
నాకు ఎప్పటినుంచో ఇలాంటి ఆలోచన ఉంది!
కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్... నాగార్జున. కథానాయకునిగా ఆయన పరిచయం చేసిన కొత్త దర్శకుల జాబితా చాలానే ఉంటుంది. నిర్మాతగా కూడా ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన ఆయన, తన ట్రెండ్ మార్చి కొత్త కాన్సెప్ట్‌తో.. లోబడ్జెట్‌లో క్యూట్ ఫిలిమ్స్ చేయడానికి సిద్ధమయ్యారు. అందుకు ‘ఉయ్యాల జంపాల’ సినిమా ఆరంభం అంటున్నారాయన. తాను నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ‘ఉయ్యాల జంపాల’ గురించి, ‘మనం’ సినిమా గురించి, ఏయన్నార్ ఆరోగ్యం గురించి, అఖిల్ తెరంగేట్రం గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అటు మీ నాన్నగారితో, ఇటు మీ అబ్బాయితో కలిసి చేస్తున్న ‘మనం’ కోసం అందరూ ఉద్వేగంగా ఎదురు చూస్తున్నారు! ప్రేక్షకులతో పాటు నేనూ ఎగ్జైటింగ్‌గానే ఉన్నాను. ఆ షూటింగ్ పని మీదే మైసూర్లో ఉన్నాను. ఈ నెల 21 వరకూ ఇక్కడే షూటింగ్. దాంతో 90 శాతం సినిమా పూర్తయినట్టే. నాన్నగారి వెర్షన్ షూటింగ్ అయిపోయింది. ఆయన డబ్బింగ్ కూడా చెప్పేశారు. మార్చి నెలాఖరుకి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఏయన్నార్‌గారి ఆరోగ్యం ఎలా ఉంది? దేవుడి దయ వల్ల చాలా బావున్నారు. త్వరగానే రికవర్ అవుతున్నారు. జరిగింది మేజర్ సర్జరీ కాబట్టి కొంచెం టైమ్ పడుతుంది. సర్జరీ తర్వాత నాన్నగారు షూటింగ్ చేశారు. డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయనకున్న విల్‌పవర్ చాలా స్ట్రాంగ్. ‘మనం’లో అఖిల్ యాక్ట్ చేశాడటగా? ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ కరెక్ట్ కావు. అయినా అఖిల్ వచ్చే ఏడాది అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అఖిల్ తొలి చిత్రానికి దేవకట్టా దర్శకుడటగా? ఆ వార్త నేనూ విన్నాను. దేవా మాకు బాగా కావల్సినవాడు. చైతన్యతో ‘ఆటోనగర్ సూర్య’ చేశాడు. చైతన్యకి క్లోజ్ తను. అలాగే అఖిల్‌కి కూడా. అఖిల్ తన దగ్గరే తెలుగు నేర్చుకుంటున్నాడు. అయినా అఖిల్ ఫస్ట్ సినిమా ఎవరితో అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో వరుసగా సినిమాలు చేస్తున్నట్టున్నారు? అవును. చేయాలి కదా. మా కుటుంబానికి సినిమాలే కదా ప్రపంచం. ‘గుండె జారి గల్లంతయ్యింది’ ఫేమ్ విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్యతో ఈ రోజు ఓ సినిమా మొదలుపెట్టాం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అది. మే నెలలో ఆ సినిమా రిలీజ్ ఉంటుంది. ‘ఉయ్యాల జంపాల’లాంటి చిన్న సినిమాతో మీరు అసోసియేట్ కావడానికి ప్రధాన కారణం? నాకు ఎప్పటినుంచో ఇలా కొత్త తరహాలో చిన్న సినిమాలు చేయాలన్న ఆలోచన ఉంది. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూలు వంటి మంచి సినిమాలు తీసిన రామ్మోహన్ ఈ కథతో నన్ను కలిశాడు. కథలోని కొత్తదనం, వాళ్ల తపన నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే కలిసి పనిచేద్దామని నిశ్చయించుకున్నాం. సురేష్‌బాబు కూడా మాతో కలవడం ఇంకా హ్యాపీ. ఈ కథలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలేంటి? మనకు పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అయినా అప్పటికీ ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలా మార్పులు వచ్చేశాయి. అక్కడి కుర్రకారు టెక్నాలజీలో కూడా అప్డేట్గా ఉంటున్నారు. వాళ్లకి టచ్ ఫోన్లు, ఫేస్‌బుక్‌లు, ఈ మెయిల్స్... ఇలా అన్నిటి గురించీ తెలుసు. వాళ్ల ఆలోచనా విధానం కూడా చాలా మారిపోయింది. అయితే ఆ పల్లెటూరి తాలూకు అమాయకత్వం మాత్రం పోలేదు. అలాగే వెటకారం కూడా. వీటన్నిటినీ ప్రతిబింబిస్తూ చాలా వినోదాత్మకంగా ఈ కథను తీర్చిదిద్దారు. బావా మరదళ్ల కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పల్లెటూరికి చెందిన ఆధునిక ప్రేమకథ ఇది. మొన్నీమధ్యనే సినిమా చూశాను. విపరీతంగా నచ్చింది. మా సంస్థ ఆధ్వర్యంలో తీసినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఫీలవుతున్నా. మీలాంటి స్టార్స్ ఇలాంటి చిన్న సినిమాలు తీస్తే వాటికీ డిమాండ్ పెరుగుతుందిగా? అవును. ఆ ట్రెండ్‌కి ‘ఉయ్యాల జంపాల’ ఒక ఆరంభం అనుకోవాలి. ఇకముందు కూడా ఇలాంటివి చేస్తాం. మీకు డిసెంబర్ అంటే లక్కీ మంత్. ఆ సెంటిమెంట్‌తోనే ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేస్తున్నారా? ఇప్పుడు ఏ సినిమాకైనా రిలీజ్ డేట్ అనేది చాలా ముఖ్యం. 2, 3 వారాల వెసులుబాటు కావాలి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమా ఎక్కువమందికి రీచ్ అవుతుంది. సెంచరీకి చేరువవుతున్నట్టున్నారు..! ఇప్పటికి 88 సినిమాలు పూర్తయ్యాయి. ఇంకా 12 పూర్తి చేయాలంటే నాలుగైదేళ్లు పడుతుంది. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ పుంజుకుంటోంది. దీని గురించి మీరేమంటారు? అందరికీ ఆనందదాయకమైన విషయం ఇది. నేనెప్పట్నుంచో మల్టీస్టారర్లు రావాలని చెబుతున్నాను. నేను కూడా కొన్ని చేశాను. మా జనరేషన్ హీరోలు, యంగ్ హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేస్తే ఇంకా మంచి కథలొస్తాయి. అయితే దర్శకులు బాగా తీయగలగాలి. ‘మనం’ తర్వాత ఏం చేస్తున్నారు? ఇంకా ఏవీ ఒప్పుకోలేదు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ‘మనం’ మీదే. ఇది మాకు చాలా స్పెషల్ మూవీ. అందుకే ‘మనం’ తర్వాత నేనేం చేయాలన్నది నిర్ణయించుకుంటాను. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కోసం మీరో జట్టుని స్పాన్సర్ చేస్తున్నారుగా. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? క్రికెట్ తర్వాత మన దేశంలో బ్యాడ్మింటనే పాపులర్. అందరికీ తెలిసిన గేమ్ అది. అందరూ ఏదో ఒక సమయంలో ఈ గేమ్ ఆడే ఉంటారు. నేను కూడా చిన్నప్పట్నుంచీ బ్యాడ్మింటన్ బాగా ఆడేవాణ్ణి. నాన్నగారు, అమ్మ రోజూ సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడేవారు. బ్యాడ్మింటన్‌కి ఎప్పుడూ భవిష్యత్తు ఉంటుంది. మాలాంటివాళ్లు ముందుకు రావడం వల్ల కొత్త ప్లేయర్స్ వస్తారు. -
క్రిస్మస్కి ఉయ్యాల జంపాల
‘‘డిసెంబర్ నాకు లక్కీ మంత్. ఈ నెలలో విడుదలైన నా సినిమాలు ఎక్కువగా విజయాలు సాధించాయి. ఈ నెల 25న నేను నిర్మించిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కూడా నా డిసెంబర్ సెంటిమెంట్‌ని నిజం చేస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అక్కినేని నాగార్జున. నూతన తారలతో పి.రామ్మోహన్‌తో కలిసి అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఉయ్యాల జంపాల’. విరించివర్మ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్ర సమర్పకుడు డి.సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘రామ్మోహన్ నిర్మించిన అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, రామ్మోహన్‌లు నిర్మాతలుగా, నేను సమర్పకునిగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఈ నెల 15న హైదరాబాద్‌లో ఘనంగా ఆడియో వేడుకను నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. -
ఉయ్యాల...జంపాల
అక్కినేని నాగార్జున, డి.సురేశ్‌బాబు, ‘అష్టా చమ్మా’ ఫేమ్ పి.రామ్మోహన్... ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడమే ఒక ఆసక్తికర అంశమైతే, అంతా కొత్త టీమ్‌తో ఈ సినిమా నిర్మించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం! ఇన్ని ఆసక్తులకు నెలవుగా నిలిచిన సినిమా ‘ఉయ్యాల జంపాల’. విరించి వర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ప్రాచుర్యం పొందిన ఆనంది, రాజ్‌తరుణ్ ఇందులో నాయికా నాయకులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్.పి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ నెలలో పాటలను త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వ డి.బి., సంగీతం: సన్నీ ఎం.ఆర్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాతలు: నాగార్జున, రామ్మోహన్ పి. -
కొత్త తారాగణంతో 'ఉయ్యాలా జంపాలా'
'అష్టా చెమ్మా' చిత్రాన్ని నిర్మించిన పి రాం మోహన్ తో కలిసి నిర్మాత డి సురేశ్ బాబు, నటుడు నిర్మాత నాగార్జున కలిసి 'ఉయ్యాలా జంపాలా' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, ఆనందిలు హీరో హిరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి దర్శకుడు విరించి వర్మ, సన్ని సంగీత దర్శకుడు.