గోదావరి తీరంలో ‘ఉయ్యాలా జంపాలా’
విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన ఉయ్యాలా జంపాలా చిత్రం యూనిట్ శనివారం రాజమండ్రిలోని సూర్య మినీ హాలుకు వచ్చింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, అవిక గోర్ డైలాగ్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ప్రదర్శిస్తున్న అన్ని చోట్ల మంచి స్పందన వస్తోందన్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని వారు ప్రేక్షకులను కోరారు.