
మూడోసారి జోడీ కడుతున్నారు
ఇప్పటికే రెండు సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ఫుల్ పెయిర్ అనిపించుకున్న ఓ అందాల జంట, మరోసారి వెండి తెర మీద మెరవడానికి రెడీ అవుతోంది. ఉయ్యాల జంపాల సినిమాతో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న రాజ్ తరుణ్, అవికా గోర్లు తరువాత సినిమా చూపిస్తా మామ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఇప్పుడు మరోసారి తెర పంచుకోవడానికి రెడీ అవుతున్నారు.
మంచు విష్ణు హీరోగా నిర్మాతగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రాజ్ తరుణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడిగా అవికా గోర్ నటించనుంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్తో పాటు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరిలో మొదలు కానుంది.