
గీత స్మరణం
పల్లవి :
ఆమె: ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల
వెన్నెల్లో ఊగాలిలా
అతడు: ఒహో... నీవేగా నాలో
నా గుండెలో శ్రుతి లయ
ఒహో... నీవేగా నాకు నా ఊహలో సఖీ ప్రియా
చరణం : 1
ఆ: చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది
చందమామ నీలో వాలి నా పక్కనుంది
నీకోసం నాకోసం ఇవ్వాళే
ఇలా గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
అ: ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దరిలో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరిని ఊరించని
ఆ: ఎటువైపు చూస్తున్నా
నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
అ: ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా
ఆ: ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
అ: మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని
చరణం : 2
ఆ: నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
అ: జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఆ: ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల
ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా
అ: గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతేలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం
చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013)
రచన : వాసు వలబోజు
సంగీతం : సన్నీ ఎమ్.ఆర్
గానం : హర్షిక గుడి, అనుదీప్ దేవ్
నిర్వహణ: నాగేశ్