క్రిస్మస్‌కి ఉయ్యాల జంపాల | 'Uyyala Jampala' releasing On 25th December | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌కి ఉయ్యాల జంపాల

Published Thu, Dec 12 2013 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

క్రిస్మస్‌కి ఉయ్యాల జంపాల

క్రిస్మస్‌కి ఉయ్యాల జంపాల

‘‘డిసెంబర్ నాకు లక్కీ మంత్. ఈ నెలలో విడుదలైన నా సినిమాలు ఎక్కువగా విజయాలు సాధించాయి. ఈ నెల 25న నేను నిర్మించిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కూడా నా డిసెంబర్ సెంటిమెంట్‌ని నిజం చేస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అక్కినేని నాగార్జున. నూతన తారలతో పి.రామ్మోహన్‌తో కలిసి అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఉయ్యాల జంపాల’. విరించివర్మ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
 
  చిత్ర సమర్పకుడు డి.సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘రామ్మోహన్ నిర్మించిన అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, రామ్మోహన్‌లు నిర్మాతలుగా, నేను సమర్పకునిగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఈ నెల 15న హైదరాబాద్‌లో ఘనంగా ఆడియో వేడుకను నిర్వహించనున్నాం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement