
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిందే సినీ పెద్దలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న చిరంజీవి నివాసంలో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై వారు చర్చించారు.