Suresh Babu
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి సహా 8మంది కార్పొరేటర్లు సస్పెండ్
-
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా పబ్బ సురేశ్‌బాబు
ఢిల్లీ: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు పబ్బ సురేశ్‌బాబు విజయం సాధించారు. ఢిల్లీలోని పీసీఐలో ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పాలమూరు జిల్లా నడిగడ్డ గద్వాల ప్రాంతానికి చెందిన పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీమెంబర్గా ఎన్నికయ్యారు. కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు.ఇకపై తెలంగాణ, ఏపీ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటితో గెలిచారు.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. -
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
టీడీపీ పందికొక్కులకు కడప మేయర్ సురేష్ బాబు వార్నింగ్
-
నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు
కర్నూలు కల్చరల్: తెలుగుదేశం నాయకుడి కుమారుడు, రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రామ్‌ప్రకాష్ సోమవారం వీరంగం వేశాడు. తన జూనియర్ విద్యార్థి జి.సురేష్‌బాబును బయటినుంచి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించి డాటా సైన్స్ ల్యాబ్‌లో డెకొరేషన్, క్యాటరింగ్, సౌండ్ సిస్టమ్ పనులను తాను చెప్పినట్లు చేయలేదని సురేష్‌బాబు మీద రామ్‌ప్రకాష్ దాడిచేశాడు. అతడితోపాటు బయటి నుంచి వచ్చిన అతడి స్నేహితులు కూడా సురేష్‌బాబును తీవ్రంగా కొట్టారు.దీనిపై సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా నాన్న టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జేమ్స్. నిన్ను కొట్టి చంపేస్తే ఎస్పీని మ్యానేజ్ చేస్తారు. కర్నూలులో ఉన్న సీఐలను, ఎస్ఐలను మ్యానేజ్ చేస్తారు. దాడిచేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే నేను నిన్ను చంపేస్తా..’ అని రామ్‌ప్రకాష్ వార్నింగ్ ఇచ్చినట్లు సురేష్‌బాబు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారినుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు.ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొడవ జరిగినట్లు తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. సురేష్‌బాబుతో మాట్లాడామని, బయటి వ్యక్తులు వచ్చి దాడిచేసినట్లు తెలిస్తే కేసు పెడతామని చెప్పారు. రామ్‌ప్రకాష్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతామన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ సమక్షంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కాంచనగంగ’పై నవరత్నాల బ్యానర్ ప్రదర్శించిన సురేష్బాబుగాయపడిన సురేష్‌బాబు పర్వతారోహకుడు. 2022 మే 21న ప్రముఖ పర్వతాల్లో ఒకటైన కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల బ్యానర్‌ను ప్రదర్శించాడు. రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఇలాంటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
తిరుమలలో టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, తమన్, గోపిచంద్ మలినేని (ఫొటోలు)
-
జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం సురేష్ బాబు ఫైర్
-
వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తారనేది అవాస్తవం
కడప (కార్పొరేషన్): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమని పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ దు్రష్పచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహా జనిత కథనం సృష్టికర్త టీడీపీ అని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వాళ్లే పోస్ట్ చేయడం.. ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు, కలి్పతాలతో కథనం రాయించడం, దానిపై చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే ఇలా చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పామని, ఇప్పుడొచ్చి తెలంగాణ సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకకు రూ.1,700 వసూలు చేస్తోందన్నారు. ట్రాక్టర్ ఇసుకను కడప తెచ్చుకునేసరికి రూ.3,500 అవుతోందన్నారు. -
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా.. సీఎం రేవంత్ కు అదిరిపోయే కౌంటర్..
-
షష్టి పూర్తి!
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రోడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్‌తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్‌బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్ ప్రోడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. -
CM Jagan: సింహంలా ఒక్కరే వస్తారు
సాక్షి, అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ జగన్‌ను అశీర్వదించండని కోరారు. రాజంపేట ప్రజలు అదృష్టవంతులని.. రామలక్ష్మణుల్లా మల్లికార్జునరెడ్డి, అమరనాథ్‌రెడ్డిలు రాజంపేటను కాపాడుతున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. రాజంపేట బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లికార్జునరెడ్డి, అమరనాథ్‌రెడ్డి వంటి నాయకులు రాజంపేటకు ఉండటం అదృష్టమని తెలిపారు. సామాజిక న్యాయాన్ని ఇంత వరకు ఎప్పుడైనా చూశామా? బీసీలు తనకు పేటెంట్ అని చెప్పిన చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కానీ ఆచరణలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని గుర్తుచేశారు. ఇంటికొకరు ఇంజనీరు, వైద్యలు ఉండాలని ఆనాడు దివంగత వైఎస్సార్ ఆశించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ హాయంలో మైనార్టీ మంత్రి, ఎమ్మెల్యే లేరని, ఓట్ల కోసమే చివరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారని మండిపడ్డారు. అదే వైఎస్ జగన్ మైనార్టీని డిప్యూటి సీఎంను చేశారని గుర్తుచేశారు. అనేక మందిని కార్పోరేషన్లకు చైర్మన్లుగా చేశారని పేర్కొన్నారు. కేవలం జగన్‌ను ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు ఎకమవుతున్నాయని అన్నారు. ఎంతమంది ఏకమైనా సింహంలా జగన్ ఒక్కరే వస్తారని తెలిపారు. సీఎం జగన్‌ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అంజాద్ బాషా అన్నారు. రాజంపేటలో అభివృద్ది జరిగిందంటే దివంగత వైఎస్అర్, వైఎస్ జగన్ హాయంలోనే జరిగిందని కడప జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. రాజంపేట బహిరంగ సభలో అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడారు. రాజంపేటలో తాగునీరు సమస్య లేదంటే అది వైఎస్అర్ చలువే అన్నారు. రాజంపేటకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తాను ప్రజలకు వాచ్మెన్లలా ఉన్నామని, అందరికీ అండగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి రాష్టంలో సీఎంగా వైఎస్ జగన్ గెలిపించాలని అన్నారు. అన్ని కులాలపై ప్రేమ చూపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అందరినీ విద్యావంతులను చేయ్యాలని అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న పథకాలన్ని అమలవ్వాలంటే మళ్లీ జగనే రావాలని తెలిపారు. -
ఘనంగా టాలీవుడ్ హీరో రానా తమ్ముడి పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by South Celebrity (@southcelebrity.insta) -
అలాంటి రాజకీయ నాయకులను చూస్తే కోపం వస్తుంది నాకు
-
రానా డ్రగ్స్ కేసు పై సురేష్ బాబు రియాక్షన్
-
ఆత్రేయ, వేటూరి గారు పెద్ద రైటర్స్..కానీ తప్ప తాగి..!
-
ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా అయినా అంతే అంటున్న సురేష్ బాబు
-
మనకు వద్దు నాన్న అని చెప్తే వినలేదు..!
-
నా తమ్ముడి సినిమా పెద్ద హిట్ కావాలని చాలా కష్టపడ్డా..!
-
నా తమ్ముడి సినిమా వల్లే.. పవన్ తో గొడవ..!
-
నేను సంతోషంగా లేకపోవడానికి కారణం ఇదే
-
నా పెద్ద కొడుకు చాలా పిరికివాడు..!
-
చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ ఖండించాలంటూ టాలీవుడ్ ప్రముఖులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ వారి నుంచి పెద్ద రెస్పాన్స్ రావట్లేదు. ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌తో పాటు నట్టి కుమార్ మాత్రమే చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించారు. బడా నిర్మాతలు, హీరోలు ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నాయకులు వారికి ఫోన్లు చేసి మరీ బ్రతిమిలాడుతున్నారట. (చదవండి: ఎన్టీఆర్‌పై చెప్పులు విసరడం నా కళ్లారా చూశా: మోహన్ బాబు) ఇదిలా ఉంటే..తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై స్పందించాడు. సినిమా వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా సినిమా వ్యాపారం చేసుకోవడం మంచిదని హితవుపలికారు. తాజాగా ఆయన సప్త సాగరాలు అనే సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌పై మీ స్పందన ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా ..సినిమా రంగం రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలా మంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. చంద్రబాబు అరెస్ట్ అనేది సున్నితమైన అంశం. దీనిపై ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా కాదు.. మేం మూవీ మేకర్స్. సినిమాలు మాత్రమే తీస్తాం. చాలా మంది స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం? రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశంపై స్టేట్మెంట్ ఇవ్వలేం కదా? తెలుగు దేశం పార్టీకీ సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సినిమా వాళ్లు స్పందించడం సరికాదు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదని నా అభిప్రాయం’అని సురేశ్ బాబు అన్నారు. -
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్‌బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్‌లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్‌ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి