
వైఎస్సార్‌సీపీ నేత సురేష్‌బాబు
కడప (కార్పొరేషన్): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమని పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు ఆక్షేపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ దు్రష్పచారానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ ఊహా జనిత కథనం సృష్టికర్త టీడీపీ అని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని, వైఎస్ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వాళ్లే పోస్ట్ చేయడం.. ఆపై ఆంధ్రజ్యోతిలో ఊహాగానాలు, కలి్పతాలతో కథనం రాయించడం, దానిపై చంద్రబాబు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే ఇలా చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. 2011లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పామని, ఇప్పుడొచ్చి తెలంగాణ సీఎం రేవంత్ గల్లీ గల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకకు రూ.1,700 వసూలు చేస్తోందన్నారు. ట్రాక్టర్ ఇసుకను కడప తెచ్చుకునేసరికి రూ.3,500 అవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment