
సాక్షి, తాడేపల్లి: నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ సందర్భంగా పూలేకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అందించారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు’ అని చెప్పుకొచ్చారు.
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/33mnLmWHid
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 11, 2025

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీలు భరత్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము తదితరులు హాజరయ్యారు.
