నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. బాలయ్య తనదైన శైలి, చమత్కారం, పంచ్‌లతో ఈ షోను విజయవంతం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సీజన్ కూడా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్‌గా జరిగిన 5వ ఎపిసోడ్ రెండు రోజుల్లోనే 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి సంచలనం రేపింది. దివంగత మాజీ సీఎం, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 5వ ఎపిసోడ్ టాలీవుడ్ స్టార్ నిర్మాతలైన దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వాళ్లు 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దాంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ అభించింది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ 5వ ఎపిసోడ్‌కు రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది.
Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉
— ahavideoin (@ahavideoIN) December 5, 2022
Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ
Comments
Please login to add a commentAdd a comment