allu aravindh
-
జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్
పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. (ఇదీ చదవండి: సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్) చిరంజీవి పేరుతో నడుస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై వారిద్దరూ అసత్య ఆరోపణలు చేశారంటూ అల్లు అరవింద్ అప్పట్లోనే పరువునష్టం దావా వేశారు. అందుకు సంబంధించిన తీర్పును తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా కూడా విధించింది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) దీంతో జరిమానాను రాజశేఖర్, జీవిత చెల్లించడంతో వారికి అప్పీలుకు వెళ్లే అవకాశం దక్కింది. వారు జిల్లా కోర్టును ఆశ్రయించడంతో వారిద్దరికి రూ. 10 చొప్పున పూచీకత్తుగా తీసుకుని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంత్రి హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. చిరు ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జున అక్కినేని, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్‌తో కలిసి దిగిన ఫొటోలను చిరు షేర్ చేశారు. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ ఈ మేరకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, వ్యక్తిగత, ఇతరత్రా అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మా ఇంటికి వచ్చారు. మాతో గడిపిన ఈ వీలువైన సమయానికి ఆయనకు ధన్యవాదాలు. ఈ సందరర్భంగా నా సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి ఆయన చర్చించడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన సమావేశం నాకేంతో నచ్చింది’ అంటూ చిరు రాసుకొచ్చారు. Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday. Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39 — Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023 -
మా టీమ్ సక్సెస్ సీక్రెట్ అదే
‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్‌గారి క్రమశిక్షణ వల్ల మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్ సక్సెస్ సీక్రెట్’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత ఎస్కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు. ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్‌లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్ లీడ్‌లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్ జోసెఫ్, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. -
18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్‌స్టోరీ కాదు..: అల్లు అరవింద్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్‌స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా ఒక సాధారణ మైన లవ్‌స్టోరీ కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్‌గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్ చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
సంచలనం సృష్టించిన బాలయ్య టాక్ షో, 5వ ఎపిసోడ్‌కు రికార్డ్ వ్యూస్
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. బాలయ్య తనదైన శైలి, చమత్కారం, పంచ్‌లతో ఈ షోను విజయవంతం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సీజన్ కూడా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్గా జరిగిన 5వ ఎపిసోడ్ రెండు రోజుల్లోనే 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి సంచలనం రేపింది. దివంగత మాజీ సీఎం, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 5వ ఎపిసోడ్ టాలీవుడ్ స్టార్ నిర్మాతలైన దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లు 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దాంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ అభించింది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ 5వ ఎపిసోడ్‌కు రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉 Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ — ahavideoin (@ahavideoIN) December 5, 2022 -
మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్
‘‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర కథని తమ్మారెడ్డి భరద్వాజగారు అందించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఆయన నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. తన కథను మేము సరిగ్గా తీయలేకపోయారని అంటారేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డా.. కానీ, సినిమా చాలా బాగా తీశారని ఆయన చెప్పడంతో సంతోషపడ్డాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మధ్య తరగతి అబ్బాయిగా శిరీష్ బాగా నటించాడు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ‘‘దాసరి నారాయణరావు, బాలచందర్‌గార్లు మధ్య తరగతి సమస్యలను అందంగా, సరదాగా చెప్పేవారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఊర్వశివో రాక్షసివో’లో చూపిస్తుండటం హ్యాపీ’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రేక్షకులు మా మూవీ గురించి ఆలోచిస్తారు’’అన్నారు అల్లు శిరీష్. -
‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పేసిన అల్లు అరవింద్
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోతాయి. కొత్త నటినటులు ఉన్నప్పటికి ఈ బ్యానర్లో వచ్చే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే ఏ నిర్మాణ సంస్థకు అయిన వారివారి కూతుళ్ల పేర్లులేదా భార్య పేరు, ఇంటి పేరు ఉంటుంది. కానీ, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్’లో గీత అనేది ఎవరు పేరు అనేది ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే ఈ పేరుతో అల్లు కుటుంబంలో ఎవరు లేకపోవడమే! చదవండి: బిగ్‌బాస్ 6: గీతూ రాయల్ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? తాజాగా గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో రివీల్ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్‌లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు‘’ అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్‌కు గీత ఆర్ట్స్ పెట్టడం వెనక అసలు కారణమేంటో ఆయన వివరించారు. చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్ ‘‘నిజానికి ‘గీత ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్‌ను పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య). భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో ‘గీత ఆర్ట్స్’ అని పెడదామని నాన్నగారు అనడం.. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్ అని మార్చొచ్చు కదా అని హోస్ట్ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకే మార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్. -
అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్ లేనట్లేనా ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. బన్నీ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ మాస్ పెర్ఫామెన్స్ చిత్రం 'పుష్ప' హిట్‌తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయడాన్ని ఆపేశారు. ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో రీమేక్ నిర్మాతలకు, డబ్బింగ్ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్‌మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పాడట. అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్ కోసం కాదు, అల్లు అరవింద్ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కేవలం 'దించాక్' టీవీ ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్
Allu Sirish Shocking Tweet About AHA App Goes Viral: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన తెలుగు ఏకైక ఓటీటీ యాప్ ఆహా. లెటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు సరికొత్త రియాలిటీ షోతో ఆహా డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆహా స్థాపించిన కొద్ది కాలంలోనే అగ్ర ఓటీటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఆహా సబ్‌స్రైబర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆహాతో తనకు సంబంధం లేదంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు అల్లు వారి వారసుడు, హీరో అల్లు శిరీష్. చదవండి: ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్ దీంతో అతడి ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ మారింది. కాగా ఆహా సబ్స్రైబర్లు యాప్‌లో ఏమైన సమస్యలు ఎదురైతే ట్వీటర్ వేదిక తమ సమస్యలను లెవనెత్తుతున్నారు. యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను చెబుతూ దీనిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్ టీంతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఆహాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సోషల్ మీడియాలో వీరిని ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు. అతడు ఈ ట్వీట్‌ని షేర్ చేసి.. ‘ఆహాని ట్యాగ్ చేస్తూ చాలామంది నేను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్‌ని చూడండి’ అంటూ పోస్ట్ చేశాడు. శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘ఏంటి శిరీష్‌కు ఆహాకి సంబంధం లేదా’ ప్రశ్నిస్తున్నారు. అంతేగా ఆహా అల్లు ఫ్యామిలీదే కదా, ఆహాతో తనకు సంబంధం లేకపోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘శిరీష్ ఇంకా ఆహా బాధ్యతలను స్వీకరించలేదేమో అందుకే ఇలా స్పందించాడు’ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నా బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య అయితే ఆహాలో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది ఇందులో పార్ట్నర్లుగా ఉన్నారు. ఐకాన్ స్టార్, అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆహాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆహా చేసే ప్రతి ఈవెంట్లోనూ అల్లు అర్జున్ భాగమవుతున్నాడు. అలాగే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా ఆహాకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్నాడు. ఇలా అల్లు వారి వారసులు ఆహాలో ఏదోకవిధంగా భాగమవుతున్నారు. అయితే ఇంతవరకు అల్లు శిరీష్ మాత్రం ఆహాలోని ఏ ఈవెంట్లో కనిపించకపోవడం గమనార్హం. Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I'm involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr — Allu Sirish (@AlluSirish) January 15, 2022 -
ఘనంగా ప్రారంభమైన కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం, టైటిల్ ఇదే..
‘రాజావారు రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక అల్లు అన్విత హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీరా పర్ధేశీలపై క్లాప్‌తో చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత బన్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. ఈ మూవీతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జీఏ2పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా,చావు కబురు చల్లగా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వినూత్నమైన కథతో ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు తెలిపాడు. -
ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్లో ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains. — Geetha Arts (@GeethaArts) November 24, 2021 ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్2' బ్యానర్లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్మస్కి థియేటర్లలో సందడి చేయనుంది. -
విశాఖలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం సందడి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చిత్రపరిశ్రమకు ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. 25 శాతం సినిమాలను ఏపీలో చిత్రీకరించేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. బీచ్‌రోడ్డులో ఆదివారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ థ్యాంక్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. నెల వ్యవధిలో అన్నదమ్ముల సినిమాలు రిలీజై హిట్ అవ్వడం గొప్ప విషయమన్నారు. ఇక హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తన కెరీర్ ఓ మైలు రాయిగా నిలిచిపోయిందన్నారు. ఇంతటి ఘనవిజయం అందజేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వంద శాతం థియేటర్ల సీట్లు అమ్మకాలకు అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వైజాగ్‌కు మళ్లీ వస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, నటీనటులు పాల్గొన్నారు. -
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. నాగ్, అల్లు అరవింద్ హాజరు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిందే సినీ పెద్దలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అపాయింట్మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న చిరంజీవి నివాసంలో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై వారు చర్చించారు. -
చాలెంజ్‌గా తీసుకుని చేశాను
‘‘సామ్‌జామ్ షో నాకు చాలా పెద్ద చాలెంజ్. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు సమంత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘సామ్‌జామ్’ అనే షోతో ఈ నెల 13నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ– ‘‘సామ్‌జామ్ టాక్ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నేను బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేయటం నాగ్‌మామ నిర్ణయం. ఆ షో చేసే టైమ్‌లో పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశాను’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఆహా’ను ఫిబ్రవరిలో లాంచ్ చేశాం. ఈ ప్లాట్‌ఫామ్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి సమంతగారితో ఓ పెద్ద షో చేయాలనుకున్నాం. ఇది నార్మల్ షో కాదు. నందినీరెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు’’ అన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘కాఫీ విత్ కరణ్’, ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షోలు చేసిన టీమ్‌తో పని చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. -
సూపర్‌గా సెట్ చేశా!
అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సినిమాలోని తన పాత్రని పరిచయం చేసుకుంటూ.. ‘అయామ్ హర్ష. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారీడ్ లైఫ్.. కెరీర్‌ని సూపర్‌గా సెట్ చేశా.. ఈ మ్యారీడ్ లైఫే. ఓ అయ్యయ్యయ్యో..’ అంటూ టీజర్‌కి లీడ్ ఇచ్చారు. ‘‘ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. అఖిల్, పూజా హెగ్డేల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా థ్రిల్లింVŠ గా ఉంటాయి. భాస్కర్, బన్నీ వాసు కుటుంబ ప్రేక్షకులు, యువత లక్ష్యంగా సినిమాలు తీస్తారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది. ఈ నెల 25న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నాం. 2021లో సంక్రాంతికి సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రదీశ్ ఎమ్. వర్మ. -
నాన్నగారు మా తరతరాలకు గుర్తింపునిచ్చారు
తెలుగు తెరపై హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య. ఆయన మన మధ్య లేకున్నా ఆయన వదిలిన పదాలు, బాడీ లాంగ్వేజ్ మరువలేని జ్ఞాపకాలు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించడంతో పాటు చివరి శ్వాస వరకూ నటించి, సినిమాపై తన ప్రేమని చాటుకున్నారు అల్లు రామలింగయ్య. నటుడుగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన వృత్తి హోమియోపతిని మాత్రం వదల్లేదు. నిర్మాతగా మారి, గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అనేక సూపర్‌హిట్స్ కూడా అందించారు. అలాంటి మహానటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ 1న. ఈ సంవత్సరం ఆయన 99వ జయంతి. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య తనయుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ –‘‘మా నాన్న తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయిలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం. ఈ మధ్య నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళితే అక్కడ ఒకావిడ నన్ను చూసి, ‘నమస్కారం అరవింద్‌గారు’ అని పలకరించారు. అక్కడే ఉన్న వాళ్ల అమ్మకి అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అని పరిచయం చేశారావిడ. నాన్నగారు తరతరాలకు మా ఫ్యామిలీకి గుర్తింపునిచ్చారు’’ అన్నారు. అల్లు స్టూడియో అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు వెంకటేష్, అల్లు అర్జు¯Œ , అల్లు శిరీష్‌ల నిర్వహణలో అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్లు స్టూడియోలో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉండబోతుంది? ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? అనే విషయాలు త్వరలో తెలియజేస్తారు. -
తమన్నా ఆహా
తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్నారు తమన్నా. కేవలం కథానాయికగానే కాదు.. అతిథి పాత్రల్లో, ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తున్నారీ మిల్కీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే తమిళ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో తమన్నా మెరవనున్నారట. ‘ఆహా’లో ఓ స్పెషల్ టాక్ షోను ప్లాన్ చేశారని, ఆ షోకి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. -
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి
‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్– ది లెజెండ్’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్‌గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం. చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పూజాహెగ్డే లుక్‌కి అభిమానులు ఫిదా
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే సినిమా అభిమానులు నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం ఈ సినిమా మీద ఉన్న క్రేజ్‌ని తెలియజేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి మొదటి స్టెప్ అంటూ విడదుల చేసిన అఖిల్ అక్కినేని లుక్‌కి మంచి రెస్పాన్స్ రావటం విశేషం. ఇప్పడు సెకండ్ స్టెప్ అంటూ హీరోయిన్ పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేశారు. (బ్యాచ్‌లర్ వచ్చేశాడు) ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్ లో ఫ్యాన్స్‌లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు. ఈ రెండు లుక్‌లు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనా తెలియజేస్తుంది. అఖిల్ అక్కినేని ఒక ప్రత్యేఖ ఇమేజ్ ని తన సోంతం చేసకుంటున్నారు. ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ కానుంది. బొమ్మరిల్లు చిత్రం విడుదలయ్యి ఇన్ని సంవత్సరాలయినా కూడా ఇప్పటికి బొమ్మరిల్లు చిత్రం లోని సంభాషణలు కాని, సన్నివేశాలు కాని డిస్కషన్ లో వున్నాయంటే ఆ సినిమా క్రియెట్ చేసిన ట్రెండ్ అలాంటిది.. ఆ చిత్ర దర్శకుడు భాస్కర్ కొంత గ్యాప్ తరువాత మరోక్కసారి పది సంవత్సరాలు మాట్లాడుకునేలా చిత్ర కధ కుదిరిందని చిత్ర యూనిట్ అంటున్నారు. (మోస్ట్ ఎలిజిబుల్!) అదే విధంగా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే చిత్రాలతో కెరీర్ బెస్ట్ గ్రాసర్‌గా రికార్డు విజయాల్ని అందించిన బన్ని వాసు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా శ్రధ్ధ తీసుకుంటున్నారు. సంగీతం గోపి సుందర్ అందించారు, ఈ ఆడియోని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.. నటీ నటులు అఖిల్ అక్కినేని పూజా హెగ్ఢే ఆమని మురళి శర్మ జయ ప్రకాశ్ ప్రగతి సుడిగాలి సుధీర్ గెటెప్ శ్రీను అభయ్ అమిత్ టెక్నీషియన్స్ డైరెక్టర్ : బొమ్మరిల్లు భాస్కర్ మ్యూజిక్ : గోపీ సుందర్ సినిమాటోగ్రాఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ ఎడిటర్ : మార్తండ కే వెంకటేశ్ ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ సమర్పణ : అల్లు అరవింద్ బ్యానర్ : జీఏ2 పిక్చర్స్ -
ఒక అమ్మ ప్రయాణం
రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు అమ్మ’. ‘మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్’ అనేది ఉపశీర్షిక. ‘అంకురం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన సి. ఉమామహేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. బొమ్మక్ క్రియేష¯Œ ్స పతాకంపై బొమ్మక్ మురళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘అంకురం’ సినిమా చూసి ఆ దర్శకుడు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను. నేను అలా అనుకున్న మరో దర్శకుడు బాలచందర్. ‘అంకురం’ సినిమా నాకిప్పటికీ గుర్తుంది. కొంతమంది మాత్రమే ఉమా మహేశ్వరరావుగారిలా సమాజం కోసం కథలు రాసి సినిమాలు రూపొందిస్తుంటారు’’ అన్నారు. ‘‘చెడు మార్గంలో పయనిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని మా చిత్రం ఇస్తుంది’’ అన్నారు ఉమామహేశ్వరరావు. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది’’ అన్నారు బొమ్మక్ మురళి. ‘‘ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా. జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు’’ అన్నారు రేవతి. సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనకదుర్గ, దేవి, విమల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎంఆర్. -
భవిష్యత్ డిజిటల్ రంగానిదే
‘‘ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ‘ఆహా ఓటీటీ’ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఆహా గురించి మా అబ్బాయిలకు (అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శీరిష్)లకు చెప్పగానే..‘నాన్నా.. నువ్వు రేపటిని చూస్తున్నావ్’ అన్నారు. తెలుగు వారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ‘ఆహా ఓటీటీ’కి శ్రీకారం చుట్టాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎవరైనా డిజిటల్ మీడియంలోకి రావాలంటే సందేహించొద్దు. భవిష్యత్తు డిజిటల్ రంగానిదే. ఇది మాకు కొత్త. అందుకే అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. మై హోమ్ రామేశ్వర్‌రావుగారు, రామ్‌లతో పాటు మరికొందరు ‘ఆహా ఓటీటీ’లో భాగస్వామ్యులుగా ఉన్నారు. అజయ్ ఠాకూర్ హ్యాండిల్ చేస్తున్నారు. టెక్నాలజీ బిజినెస్ గురించి కోల్‌కతాలోని మా స్నేహితులు, ఓ అమెరికన్ కంపెనీ సపోర్ట్ తీసుకుంటున్నాం. ఈ ఏడాది పాతిక షోలను ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు క్రిష్ ఓ షో చేస్తున్నారు. ఇందులో కంటెంట్ బోల్డ్‌గా ఉంటుంది. కాబట్టి పేరెంట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు. ‘మేం గృహనిర్మాణం నుంచి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం. అరవింద్‌గారి ఆలోచనల నుంచి పుట్టిందే ‘ఆహా ఓటీటీ’. ఇందులో వందశాతం తెలుగు కంటెంట్ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాది ప్రీమియాన్ని 365 రూపాయలుగా నిర్ణయించాం’’ అన్నారు జూపల్లి రామూరావు. ‘‘ఆహా ఓటీటీ’ ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ గేమ్‌చేంజర్‌గా చెప్పవచ్చు. టీవీని ఓటీటీ రీప్లేస్ చేస్తుందనిపిస్తోంది. సినిమాల నుంచి వెబ్‌కు యాక్టర్స్ క్రాస్ ఓవర్ అవుతున్నారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘నా రైటింగ్‌లోని మరో కోణమే ‘మస్తీస్’. అజయ్‌భూయాన్ బాగా డైరెక్ట్ చేశారు. అవకాశం ఇచ్చిన అల్లుఅరవింద్, రామ్, అజిత్‌ఠాగూర్‌కి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు క్రిష్. యాక్టర్ నవదీప్ మాట్లాడారు. -
అల్లువారి జీవితాలు ప్రేక్షకులకు అంకితం
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత పూర్తి వినోదంతో ఉండే పెద్ద సినిమా చేయాలనుకున్నాను.. అప్పుడు నాకు గుర్తొచ్చిన పేరు త్రివిక్రమ్‌గారే. మేమిద్దరం కలుసుకొని ఆనందంగా ఓ సినిమా చేయాలనుకున్నాం. అలా చేసిందే ‘అల.. వైకుంఠపురములో..’. మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రాధాకృష్ణ, త్రివిక్రమ్‌గార్లతో హ్యాట్రిక్ కొట్టాం. మా నాన్నగారికి(అల్లు అరవింద్) బాగా డబ్బులు రావాలని, అందులో నాకు వాటా ఇవ్వాలని కోరుకుంటున్నా(నవ్వుతూ). పూజాహెగ్డేతో ‘డీజే’ తర్వాత ఈ సినిమా చేశా.. తనతో మళ్లీ నటించాలనుంది. మేమెంత నటించినా, సాంకేతిక నిపుణులు ఎంత గొప్పగా పనిచేసినా సినిమాకి దర్శకుడు ప్రాణం లాంటివాడు. ఆ ప్రాణం లేకపోతే మేమెంత చేసినా శవానికి అలంకరించినట్టే. బంధుప్రీతి గురించి చాలా మంది కామెంట్ చేస్తుంటారు. దేవుడికి ఒక పూజారి తన జీవితం అంకితం చేస్తాడు.. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి, ఆ తర్వాత వాళ్ల వాళ్ల అబ్బాయి.. ప్రేక్షక దేవుళ్లను వినోదపరచడానికి మా అల్లు కుటుంబం కూడా అంకితం. మా తాతగారు(అల్లు రామలింగయ్య) చేశారు, మా నాన్నగారు చేశారు, నేనూ చేస్తున్నాను.. ఉన్నంతకాలం చేస్తూనే ఉంటాం’’ అన్నారు. ‘‘కళామతల్లి పాదాల వద్ద సేద తీర్చుకుంటున్న కుటుంబం మాది. మమ్మల్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు బన్నీ, త్రివిక్రమ్‌ల కెరీర్లోనే కాదు.. ఇండస్ట్రీలోనే బెస్ట్‌గా నిలబడతాయని అంటున్నారు. 18న వైజాగ్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్ చేయబోతున్నాం’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమాలో మేం దాచిన సర్ప్రైజ్లు రెండు.. ఒకటి శ్రీకాకుళం ‘సిత్తరాల సిరపడు’ పాట.. రెండోది బ్రహ్మానందంగారు. ఆయన కనపడగానే ప్రేక్షకులు బాగా గోల చేశారు. సుశాంత్ కథ వినకుండానే చేశాడు. రూపాయి అడిగితే రెండు రూపాయిలు ఇచ్చిన అరవింద్‌గారు, రాధాకృష్ణగారికి థ్యాంక్స్. బన్నీ చాలా తపన ఉన్న నటుడు.. తనలోని గొప్ప నటుడిని ఈ సినిమాలో చూపించారు. సచిన్‌కి ఫుల్ టాస్ వేసినా, బన్నీకి ఇలాంటి సినిమా వచ్చినా సిక్సరే’’ అన్నారు త్రివిక్రమ్. ‘‘బాధ్యత నన్ను మరింత బాగా పని చేయించింది. సంక్రాంతి రేసులో పరిగెత్తాం. కొంచెం బరువున్నా నేనే గెలిచేలా చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా టైమ్‌లో బన్నీగారికి ఫ్యాన్ అయ్యాను.. ఈ సినిమాతో త్రివిక్రమ్‌గారికి ఫ్యాన్ అయిపోయాను’’ అన్నారు పూజా హెగ్డే. ఈ కార్యక్రమంలో నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సునీల్, సుశాంత్, నవదీప్, హర్షవర్ధన్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొన్నారు. -
ఈ విజయం ఆ ఇద్దరిదే
‘‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం మారుతి, సాయి తేజ్‌లదే. ఈ ఇద్దరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా తీసిన యూనిట్‌ని అభినందిస్తున్నాను’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ–‘‘ప్రతిరోజూ పండగే’ నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. సత్యరాజ్‌గారి పాత్రను మర్చిపోలేను. రావు రమేశ్‌గారితో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు రాజమండ్రిలో చిత్రీకరించాలనుకున్నాను. సక్సెస్‌మీట్‌ను రాజమండ్రిలోనే నిర్వహించాలని షూటింగ్ అప్పుడే అనుకున్నాను.. ఇప్పుడు చేశాం’’ అన్నారు మారుతి. ‘‘తేజూ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తికి ఇంత మంచి విజయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాస్.