
‘నెక్ట్స్ ఏంటి?’ అంటూ మంగళవారం ‘సాక్షి’లో అఖిల్ గురించి ఓ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఏంటి? అనేది వార్త సారాంశం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పరశురామ్, సత్య ప్రభాస్ ఎవరో ఒకరి దర్శకత్వంలో సినిమా ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఎవరి డైరెక్షన్‌లో చేయబోతున్నారో చెప్పేస్తున్నాం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్ సినిమా ఫిక్స్ అయింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సమ్మర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘బొమ్మరిల్లు, పరుగు’ సినిమాలతో తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్న భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేయబోతున్న సినిమా ఇది.
Comments
Please login to add a commentAdd a comment