Bommarillu Bhasker
-
కొత్త సినిమా లాంఛ్, గెస్టులుగా సుద్దాల అశోక్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్
సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. చదవండి: బికినీలో నిహారిక, ఫొటోలు వైరల్ రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు పొడిచాడా? -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా రివ్యూ
టైటిల్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సంగీతం : గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ విడుదల తేది : అక్టోబర్ 15, 2021 మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని సరైన హిట్ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నాడు. అలాంటిది అతడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేనే మీకు ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఎంతో ధైర్యంగా మాటిచ్చాడు. మరి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ద్వారా ఆ మాటను నిలబెట్టుకున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లోనే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మరి దానికి ప్రతిఫలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ దసరా విన్నర్‌గా నిలవనుందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ: హర్ష(అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటాడు. తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ(పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాలనుకుంటాడు. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్‌ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఇక చూపించిందే చూపించి జనాలకు విసుగు పుట్టించాడు డైరెక్టర్. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు రాక మానదు. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించినా రానురాను.. ఇవి ఇంకా అయిపోలేదా? అని ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు. ప్రేమ, రొమాన్స్‌కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించక మానదు. సెకండాఫ్‌లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతిదాన్ని సాగదీసి ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహకందనంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తారు. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. అయితే సినిమాను మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్, గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బొమ్మరిల్లు, షాదీ ముబారక్‌లను మిక్స్ చేస్తే వచ్చిన మిశ్రమ ఫలితంలా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. టెక్నికల్‌గా సినిమా బాగుందనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కొంతమేరకు సంభాషణలు ఆకట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్‌లా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు. చివరగా.. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా చూసి ఆస్వాదించవచ్చు. అయ్యగారు మొత్తానికి హిట్ కొట్టారనే అంటున్నారు అభిమానులు! -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వ్రాప్ అప్ పార్టీ
Most Eligible Bachelor Wrap Up Party: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తోంది చిత్ర యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. -
మేం దూరం పాటించడంలేదు
మళ్లీ లొకేషన్లోకి అడుగుపెట్టారు అఖిల్. బ్రేక్ తర్వాత చిత్రీకరణలో పాల్గొనడం భలే ఉంది అన్నారాయన. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. రెండు రోజుల క్రితం పూజా హెగ్డే షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా అఖిల్ కూడా జాయినయ్యారు. లొకేషన్లో పూజాతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ‘అన్ని జాగ్రత్తలతోనే సినిమా షూట్ చేస్తున్నాం. మేమిద్దరమే (కెమెరా ముందు) మాస్క్ వేసుకోలేదు. మేము కూడా మాస్క్ వేసుకుంటే సినిమాలో మీరు మమ్మల్ని గుర్తుపట్టరు’’ అని సరదాగా అన్నారు అఖిల్. ‘సెట్లో భౌతిక దూరం పాటించనది మేమిద్దరమే. ఎందుకంటే ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశాన్ని తీస్తున్నాం కాబట్టి’’ అన్నారు పూజా హెగ్డే. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. -
దసరాకు ‘అఖిల్’.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. లాక్ డౌన్ ఎత్తినా ఇప్పట్లో థియేటర్స్ కి జనాలు వచ్చే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన అనేక సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టమేనని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మిగతా సినిమాల పోటీని తట్టుకుని ‘బ్యాచ్‌లర్’ చిత్రం నిలబడవలసి ఉంటుంది. ఇంతవరకూ సరైన హిట్ ఖాతాలో వేసుకోలేకపోయిన అఖిల్, దసరాకి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి అఖిల్ రిస్క్ చేసి దసరా బరిలోకి దిగుతాడా లేక ఫ్యాన్స్ కోరిక మేరకు దసరా సీజన్ నుంచి తప్పకుంటాడా అనేది వేచి చూడాలి. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అఖిల్‌తో ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చదవండి: సితూ పాప కోసం సూపర్ స్టార్ ఏం చేశారంటే.. ‘ఆరోజు ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చే పనిలో మహేశ్’ -
మోస్ట్ ఎలిజిబుల్!
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో అఖిల్ ఒకరు. ఇప్పుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా అలాంటి పాత్రనే చేస్తున్నట్లున్నారు. అందుకే ఈ చిత్రానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఉంటారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఆమని, మురళీ శర్మ, జయప్రకాష్, ప్రగతి, ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, అభయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది -
ఖుషీ ఖుషీ స్టెప్స్
హైదరాబాద్‌లో స్టెప్స్ వేస్తున్నారు అఖిల్. తనతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా కాలు కదుపుతున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నది సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాట అని తెలిసింది. పూజాతో కలసి ఖుషీ ఖుషీగా స్టెప్స్ వేస్తున్నారట అఖిల్. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం దర్శకుడు. -
అఖిల్‌కు జోడి దొరికేసింది!
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన తొలి సినిమా అఖిల్ నిరాశపరచటంతో తరువాత ఫ్యామిలీ హీరో, లవర్ భాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు అఖిల్. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తాజాగా ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ కాకుండానే చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ, రష్మిక మందన్న లాంటి వారి పేర్లు వినిపించినా ఫైనల్‌గా చిత్రయూనిట్ పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. అఖిల్‌కు జోడి పూజానే అని కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పూజా హెగ్డే ప్రస్తుతం.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు ప్రభాస్ నెక్ట్స్ సినిమా జాన్‌లో హీరోయిన్గా నటిస్తున్నారు. -
శ్రీవారి సేవలో అఖిల్
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ సక్సెస్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే నాలుగో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మాతలో సినిమాను ప్రారంభించిన అఖిల్ త్వరలో షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ‘నాలోని శక్తిని తెలుసుకునే సరైన ప్లేస్ తిరుమల. ఏడు కొండలు నడిచి శ్రీవారి దర్శనానికి వచ్చాను. కొత్త సినిమాను ఫోకస్డ్గా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నా గోవిందా గోవిందా’ అంటూ ట్వీట్ చేశాడు అఖిల్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నాడు. -
ప్రయాణం మొదలు
అఖిల్ తన కొత్త ప్రయాణాన్ని ఈ నెల 26 నుంచి మొదలుపెట్టనున్నారని తెలిసింది. మరి ఈ ప్రయాణం ఎందాకా? ఎలా సాగుతుంది? అనేది తెలియాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. జీఎ2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అఖిల్‌తో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారో ఇంకా నిశ్చయించలేదు. ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 26న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్‌లో జర గనుంది. కొంత పోర్షన్‌ను రెండు దేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. అవేంటో ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. -
కొత్త ప్రయాణం
‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. ఆయన దర్శకత్వంలో అఖిల్ హీరోగా కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మలు నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్ భార్య నిర్మల, చిరంజీవి సతీమణి సురేఖ, అక్కినేని అమల, దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, మారుతి, పరశురామ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. మణికందన్, సంగీతం: గోపీ సుందర్. -
విశ్వక్ కార్టూన్
‘ఈ నగరానికి ఏమైంది’లో సైకో వివేక్ పాత్రలో ఆకట్టుకున్నారు యంగ్ హీరో విశ్వక్సేన్. లేటెస్ట్గా ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో హీరోగా నటించారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించారు. నూతన దర్శకుడు ప్రదీప్ పులివర్తి దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా ఓ చిత్రం ఆదివారం ప్రారంభం అయింది. ఆర్య క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వనాథ్ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘కార్టూన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిఫరెంట్ జానర్లో ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూన్ 3న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: ఉదయ్ గుర్రాల. -
ట్యూన్ కుదిరిందా?
ఇన్ని రోజులు కథపై వర్క్ చేసిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ఇప్పుడు సంగీతదర్శకుడు గోపీ సుందర్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదంతా ఆయన నెక్ట్స్ చిత్రం గురించే. అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ట్యూన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు టీమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, రష్మికా మండన్నాపేర్లు తెరపైకి వచ్చాయి. హీరోయిన్ ఎవరు? అనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
అఖిల్‌కు జోడీగా కియారా?
అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్. భారీ అంచనాల మధ్య పరిచయం అయిన అఖిల్ ఇప్పటివరకు ఆ అంచనాలను అందుకో లేకపోయాడు. అందుకే ఇప్పటికే అఖిల్‌కు సక్సెస్‌ఇచ్చే బాధ్యతను మెగా నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అఖిల్ నాలుగో సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకోగా అఖిల్‌కు జోడిగా భరత్ అనే నేను ఫేం కియారా అద్వానినీ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ భామ అఖిల్ సరసన నటించేందుకు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
మేలో మొదలు
అఖిల్ కొత్త చిత్రం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ – కామెడీ కథను భాస్కర్ తయారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారో ఇంకా కన్ఫార్మ్ కాలేదు. కియారా అద్వానీ పేరు వినిపిస్తునప్పటికీ చిత్రబృందం మాత్రం తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే మొదటివారంలో ప్రారంభం కానుందట. 2019 చివరి కల్లా ముగించి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
అఖిల్‌కు జోడిగా ప్రియాంక!
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న సినిమాలో అఖిల్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. త్వరలో లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనుంది. -
సమ్మర్లో షురూ
‘నెక్ట్స్ ఏంటి?’ అంటూ మంగళవారం ‘సాక్షి’లో అఖిల్ గురించి ఓ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఏంటి? అనేది వార్త సారాంశం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పరశురామ్, సత్య ప్రభాస్ ఎవరో ఒకరి దర్శకత్వంలో సినిమా ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో చేయబోతున్నారో చెప్పేస్తున్నాం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్ సినిమా ఫిక్స్ అయింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘బొమ్మరిల్లు, పరుగు’ సినిమాలతో తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్న భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేయబోతున్న సినిమా ఇది. -
నెక్ట్స్ ఏంటి?
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి, ఒక సినిమా పూర్తి చేసిన హీరోకు తరచుగా వినిపించే ప్రశ్న నెక్ట్స్ ఏంటి? ‘మిస్టర్ మజ్ను’ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి? అని ఇండస్ట్రీలో టాపిక్. అఖిల్ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని సమాచారం. ‘మలుపు’ దర్శకుడు సత్య ప్రభాస్‌తో ఓ స్పోర్ట్స్ సినిమా ఉందని ఒక వార్త. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ కూడా అఖిల్‌కు కథ వినిపించారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తన నాలుగో ప్రాజెక్ట్‌ను ఈ అక్కినేని హీరో ఏ దర్శకుడితో చేస్తాడో వేచి చూడాలి. నెక్ట్స్ ఏంటి? అన్న ప్రశ్నకు ఈ నెలాఖరు లోపు సమాధానం రానుందట. దర్శకుడు ఎవరైనా బేనర్ మాత్రం గీతా ఆర్ట్స్ అని సమాచారం. -
మెగా బ్యానర్లో అక్కినేని హీరో
అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్, తన మీద ఉన్న అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. తొలి సినిమాతో ఇప్పటికి మూడు సినిమాలు చేసిన అఖిల్ వరుసగా తడబడుతున్నాడు. మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన ఈ యంగ్ హీరో తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. అయితే అఖిల్ నాలుగో సినిమా మెగా బ్యానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని హీరోకు సక్సెస్ ఇచ్చే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నట్టుగా తెలుస్తొంది. ఇప్పటికే గీత గోవిందం ఫేం పరశురాం, బొమ్మరిల్లు భాస్కర్లు అఖిల్ కోసం కథలు రెడీ చేస్తున్నారట. వీరిలో ఎవరి కథకు అఖిల్ ఓకె చెప్తే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. -
బొమ్మరిల్లు భాస్కర్‌కు మరో ఛాన్స్
బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్, ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాప్ రావడంతో భాస్కర్ కెరీర్ తిరగబడింది. ఆ తరువాత ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఒంగోళుగిత్తకు కూడా ఫ్లాప్ టాక్ రావటంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, ఇటీవల బెంగళూర్ డేస్ తమిళ రీమేక్‌తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. మరోసారి తెలుగులో దర్శకుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయాత్నాలు ప్రారంభించిన భాస్కర్‌కు మెగా ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే మెగా హీరోస్తో పరుగు, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కించిన భాస్కర్, ఈ సారి అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే లైన్ ఓకె చేసిన అరవింద్, పూర్తి కథతో రమ్మన్నాడట. కథ రెడీ అయ్యాక నటీనటుల ఎంపిక జరుగనుంది. అయితే మరోసారి మెగా హీరోతోనే సినిమా చేస్తాడా..? లేక.. లో బడ్జెట్లో చిన్న హీరోతో సినిమాను చేస్తారా..? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.