అఖిల్‌కు జోడి దొరికేసింది! | Heroine Confirmed For Akhil 4 | Sakshi
Sakshi News home page

అఖిల్‌కు జోడి దొరికేసింది!

Published Sat, Sep 14 2019 1:17 PM | Last Updated on Sat, Sep 14 2019 3:35 PM

Heroine Confirmed For Akhil 4 - Sakshi

అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన తొలి సినిమా అఖిల్ నిరాశపరచటంతో తరువాత ఫ్యామిలీ హీరో‌, లవర్ భాయ్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించాడు అఖిల్‌. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తాజాగా ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

గీతా ఆర్ట్స్‌2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరోయిన్‌ ఎవరన్నది ఫైనల్‌ కాకుండానే చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, రష్మిక మందన్న లాంటి వారి పేర్లు వినిపించినా ఫైనల్‌గా చిత్రయూనిట్ పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. అఖిల్‌కు జోడి పూజానే అని కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పూజా హెగ్డే ప్రస్తుతం.. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు ప్రభాస్‌ నెక్ట్స్ సినిమా జాన్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement