‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఎంతోకాలంగా ఓ మంచి హిట్ కోసం చూస్తున్న అఖిల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని ఫ్యాన్స్ అంతా చర్చికుంటున్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చూసిన టాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు, హీరోహీరోయన్‌తో పాటు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖిల్‌కు కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అని చెబుతున్నారు. అలాగే ఈ మూవీ చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తన రివ్యూను ఇచ్చాడు.
చదవండి: లైవ్‌చాట్‌లో బుట్టబొమ్మకు షాకింగ్ ప్రశ్న, నెటిజన్‌కు పూజ హెగ్డే చురక
చిత్రం బృందం, అఖిల్, పూజలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. ‘మై బ్రదర్ అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. అఖిల్ నటన చాలా నచ్చింది. ఎప్పుటిలాగే పూజాహెగ్డే అదరగొట్టింది. ఈ సందర్భంగా డైరెక్టర్ భాస్కర్, మేకర్స్‌కు నా అభినందనలు’ అంటూ చెర్రి ట్వీట్ చేశాడు. కాగా ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నిలాంబరిగా అలరించబోతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చూసిన చిరంజీవి తనకు ఫోన్ చేశారని, ఈ సినిమాలో తన ఫర్‌ఫామెన్స్‌ని మెచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో పూజ పేర్కొంది.
So happy for my brother @AkhilAkkineni8 on the success of #MostEligibleBachelor 🤗
— Ram Charan (@AlwaysRamCharan) October 19, 2021
Loved your performance in this film. @hegdepooja you nailed it again👏👍
Many congratulations to @GA2Official & Bhaskar
We thoroughly enjoyed it 👍 pic.twitter.com/rEMXJR7Z51
Comments
Please login to add a commentAdd a comment