
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. లాక్ డౌన్ ఎత్తినా ఇప్పట్లో థియేటర్స్ కి జనాలు వచ్చే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట దర్శకనిర్మాతలు.
అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన అనేక సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టమేనని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మిగతా సినిమాల పోటీని తట్టుకుని ‘బ్యాచ్‌లర్’ చిత్రం నిలబడవలసి ఉంటుంది. ఇంతవరకూ సరైన హిట్ ఖాతాలో వేసుకోలేకపోయిన అఖిల్, దసరాకి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి అఖిల్ రిస్క్ చేసి దసరా బరిలోకి దిగుతాడా లేక ఫ్యాన్స్ కోరిక మేరకు దసరా సీజన్ నుంచి తప్పకుంటాడా అనేది వేచి చూడాలి. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అఖిల్‌తో ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
చదవండి:
సితూ పాప కోసం సూపర్ స్టార్ ఏం చేశారంటే..
‘ఆరోజు ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చే పనిలో మహేశ్’
Comments
Please login to add a commentAdd a comment