bachelor
-
బ్యాచిలర్ మూవీ హీరోయిన్ దివ్య భారతి (ఫోటోలు)
-
యువతులే అతడి టార్గెట్.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్ బ్యాచిలర్..
ధనవంతుడిలా కటింగ్ ఇచ్చాడు ఓ కన్నింగ్ ఫెలో. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్ పెట్టి ఘోరంగా నష్టపోయాడు. దీంతో, మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. మ్యాట్రిమోనిలో రిచ్ బ్యాచ్‌లర్‌గా కలరింగ్ ఇస్తూ.. పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. ఓ యువతి ద్వారా గుట్టురట్టై జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్(26) బీసీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. అనంతర, గుర్గావ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో, డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. మైండ్ ఐడియా తట్టిందే అదనుగా.. మాట్రిమోనీ వెబ్సైట్లను టార్గెట్‌ను చేశారు. పెళ్లి పేరుతో యువతులను వల వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీల్లో రిచ్ బ్యాచిలర్లా ఫ్రొఫైల్ సెట్ చేశాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్ అయిన యువతులకు.. అతను అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, భవనాలు చూపిస్తూ అతి తనవేనంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చేశాడు. యువతి టచ్‌లోకి రాగానే వారికి మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం వాళ్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి దూరంపెట్టేవాడు. అయితే, తాజాగా విశాల్ మ్యాట్రిమోనీ ప్రోఫైల్ చూసి పెళ్లి విషయమై గుర్గావ్కు చెందిన ఓ యువతి, ఆమె ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా తన రిచ్‌నెస్ చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్ వ్యాపారాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, సెల్‌ఫోన్స్ తక్కువ ధరకే తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్, బంధువుల నుంచి అందినకాడికి ఆర్డర్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. కాగా, వస్తువులు, ఫోన్ల కాలం బాధితులు విశాల్‌కు ఫోన్లు చేయడంతో వారి నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. దీంతో, తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్ ఆపరేషన్ చేపించి విశాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో రిచ్ బ్యాచిలర్ అసలు కథ బయటకు వచ్చింది. ఇతగాడి మోసాలు తెలుసుకుని బాధితులు, పోలీసులు షాక్ తిన్నారు. -
ఆ ఊరు మొత్తం బ్రహ్మచారులే.. ఎక్కడంటే?
ఆ ఊళ్లో ఎక్కడ చూసినా పెళ్లికాని బ్రహ్మచారులే కనిపిస్తారు. దాదాపు యాభైఏళ్లుగా ఆ ఊళ్లో పెళ్లిళ్లే జరగలేదంటే, ఆ ఊరి పరిస్థితిని ఊహించుకోవచ్చు. బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు బర్వాంకలా. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో కైమూర్ కొండల మధ్య ఎగుడు దిగుడు దారిలో ఉన్న ఈ ఊరికి చేరుకోవడం అంత తేలిక కాదు. సమీపం పట్టణాల నుంచి ఇక్కడకు రాకపోకలు జరిపే వాహనాలూ తక్కువే. రోజువారీ అవసరాలకు మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా ఈ ఎగుడు దిగుడు దారిలో కనీసం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక మాధ్యమిక పాఠశాల, రేషన్ దుకాణం తప్ప మరో సౌకర్యమేదీ ఈ ఊళ్లో కనిపించదు. ఈ ఊరి పరిస్థితి ఇలా ఉండటంతో ఇక్కడి కుర్రాళ్లకు పిల్లనివ్వడానికి ముందుకొచ్చేవాళ్లే కరువయ్యారు. యాభై ఏళ్ల పాటు పెళ్లిళ్లకు నోచుకోని ఈ ఊరి యువకుడు అజయ్‌కుమార్ యాదవ్‌కు ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. అతడు వధువును తీసుకొస్తున్న సందర్భంగా గ్రామస్థులే స్వయంగా రోడ్డు నిర్మించి, నూతన వధూవరులకు ఘనస్వాగతం పలికారు. అయితే, ఇప్పటికీ ఈ గ్రామ పరిస్థితుల్లో పెద్దగా మార్పురాలేదు. ‘బ్రహ్మచారుల గ్రామం’ అనే పేరూ తొలగిపోలేదు. చదవండి: మనుషులే ఉండని ఊరు -
‘బ్యాచులర్’ హీరో కొత్త చిత్రం ప్రారంభం
వైవిధ్యభరితంగా కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు జీవీ ప్రకాష్ కుమార్. ఓ పక్క సక్సెస్ఫుల్ సంగీత దర్శకుడిగా పయనాన్ని కొనసాగిస్తూ మరో పక్క కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన బ్యాచులర్ వంటి చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. మరిన్ని చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా తాజాగా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి సిద్ధమయ్యారు. ఈయన కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం చెన్నైలో పూజ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో ఆయనకు జంటగా మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఇంతకుముందు తమిళంలో నటి త్రిష నాయకగా నటించిన రాంగీ చిత్రంలో ముఖ్యపాత్ర ద్వారా ఈమె పరిచయం అయింది. కాగా ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి ఉదయ్ మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు నాళై, చక్రవ్యూహం చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా జీవా, తంగమగన్, కబాలి, వేలైక్కారన్, నేర్కొండ పార్వై తదితర చిత్రాల్లో నటుడుగా కీలకపాత్రలు పోషించారన్నది గమనార్హం. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రానికి హేశం ఏడబ్ల్యూ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్, కవితాలయ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చదవండి: Vijay Devarakonda: ‘లైగర్’ ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నా: విజయ్ దేవరకొండ -
బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఓ ఇంట్లో 35 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి బాపూజీనగర్ సమీపం రామకృష్ణానగర్‌లో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలివీ.. రామకృష్ణానగర్‌లోని బ్యాచిలర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం స్థానికులు గుర్తించారు. చదవండి: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో.. ఈ విషయాన్ని ఇంటి యజమాని గేదెల సత్యవతికి తెలిపారు. ఆ ఇళ్లు తాళం వేసి ఉండటంతో.. యజమాని కొడుకు ఈశ్వరరావు మారు తాళాలతో తలుపులు తెరిచి చూడగా.. బాత్రూమ్లో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ శ్రీపాదరావు, సీఐ కృష్ణారావు, ఎస్ఐ అప్పలనాయుడు.. మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మహిళ మృతి చెంది మూడు రోజులై ఉంటుందని పోలీసులు తెలిపారు. బాత్రూమ్లో స్నానానికని వెళ్లే సమయంలో జారిపడి తలకు గాయమై మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె మృతికి ఇతర కారణాలున్నాయో అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఇంట్లో మూడు నెలల కిందట ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు దిగారు. వీరు పోర్టులో బొగ్గు పని చేస్తుంటారు. ఉదయం 7 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుంటారు. ఇద్దరిలో ఒకరి పేరు రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఇద్దరు యువకులు: మూడు రోజులుగా ఈ ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాలు, కిరాణా దుకాణాల వద్ద వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ఎస్ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యంగ్ పొంగల్
పండగంటే ఎవరింటికి వాళ్లు చేరుకోవాలి. థియేటర్లోకి సినిమా రావాలి. కుటుంబమంతా కలసి ఆ సినిమాకు వెళ్లాలి. సినిమాకు సంక్రాంతి ముఖ్యం. సంక్రాంతికి సినిమా ముఖ్యం. సంక్రాంతి బరిలో దిగడానికి భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురు పండగ పోటికీ సిద్ధమైతే, యంగ్ హీరోలకు ఛాన్స్ మిస్. కానీ వచ్చే సంక్రాంతి పూర్తిగా యంగ్ కాబోతోంది. ఈ పొంగల్ (సంక్రాంతి)కి వినోదం వడ్డించడానికి యంగ్ హీరోలు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. రంగ్ దే 25 సినిమాలు చేసిన నితిన్‌కు ఇప్పటివరకు ఒక్క సంక్రాంతి రిలీజ్ లేకపోవడం విశేషం. ‘రంగ్ దే’తో తొలిసారి పొంగల్‌కి తన సినిమాను విడుదల చేయబోతున్నారు నితిన్. అలాగే పెళ్లి తర్వాత నితిన్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శర్వాతో శ్రీకారం శర్వానంద్‌కి సంక్రాంతి కలిసొస్తుంది. గతంలో ‘ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి’ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. శర్వానంద్ కెరీర్లో మంచి హిట్స్‌గా ఈ సినిమాలు నిలబడ్డాయి. ఇప్పుడు ‘శ్రీకారం’తో మరోసారి సంక్రాంతికి థియేటర్స్‌లోకి రాబోతున్నారు. కొత్త దర్శకుడు కిశోర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కావాల్సింది. కరోనా వల్ల సంక్రాంతికి వాయిదా వేశారని సమాచారం. బ్యాచిలర్ వస్తున్నాడు అఖిల్‌కి ఇది తొలి సంక్రాంతి. హీరోగా అఖిల్ థియేటర్లో సందడి చేయబోతున్న తొలి సంక్రాంతి. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్లో విడుదల కావాల్సింది. కరోనా వల్ల పొంగల్‌కి పోస్ట్‌పోన్ అయింది. ఇందులో అఖిల్ పాత్ర పేరు నాగార్జున అని టాక్. ఇదో రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని సమాచారం. కరోనాతో సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. షూటింగులు ఆగిపోయాయి. సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా సందడి లేకపోవడం సినీ ప్రేమికులకు పెద్ద లోటు. త్వరలో థియేటర్లు ఆరంభం అయి, సందడి మొదలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
దసరాకు ‘అఖిల్’.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. లాక్ డౌన్ ఎత్తినా ఇప్పట్లో థియేటర్స్ కి జనాలు వచ్చే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన అనేక సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టమేనని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మిగతా సినిమాల పోటీని తట్టుకుని ‘బ్యాచ్‌లర్’ చిత్రం నిలబడవలసి ఉంటుంది. ఇంతవరకూ సరైన హిట్ ఖాతాలో వేసుకోలేకపోయిన అఖిల్, దసరాకి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి అఖిల్ రిస్క్ చేసి దసరా బరిలోకి దిగుతాడా లేక ఫ్యాన్స్ కోరిక మేరకు దసరా సీజన్ నుంచి తప్పకుంటాడా అనేది వేచి చూడాలి. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అఖిల్‌తో ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చదవండి: సితూ పాప కోసం సూపర్ స్టార్ ఏం చేశారంటే.. ‘ఆరోజు ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చే పనిలో మహేశ్’ -
నాకెవ్వరూ ప్రపోజ్ చేయలేదు!
వయసు 53. అయినప్పటికీ ‘బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్’లో కండలు తిప్పుకుంటూ ముందు వరుసలో ఉంటారు సల్మాన్ ఖాన్. బ్యాచిలర్ కాబట్టి బుట్టల కొద్దీ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తుంటాయి అనుకోవచ్చు. కానీ అలాంటిదేం ఇప్పటివరకూ జరగలేదట. ‘‘సినిమాల్లో హీరోయిన్లు నా ప్రేమ కోసం వెనకబడ్డ సందర్భాలున్నాయి. పెళ్లి చేసుకోమని అడిగిన సీన్లూ ఉన్నాయి. కానీ నిజజీవితంలో ఇప్పటివరకూ ఒక్క అమ్మాయి కూడా నా దగ్గరకు పెళ్లి ప్రపోజల్ తీసుకురాలేదు’ అన్నారు సల్మాన్ ఖాన్. దానికి ఓ కారణం కూడా చెప్పారు. ‘‘నేను క్యాండిల్ లైట్ డిన్నర్లు చేయలేను. ఎందుకంటే.. ఆ కొవ్వొత్తుల వెలుతురులో తినడానికి చాలా తంటాలు పడుతుంటాను. ‘ఇప్పటివరకూ నాకెవరూ ప్రపోజ్ చేయలేదే?’ అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను’ అని ఫీల్ అయ్యారు భాయ్. -
శాస్తారం ప్రణమామ్యహం
అయ్యప్ప అనగానే అందరికీ యోగాసనంలో, మోకాలికి యోగపట్టం ధరించి కుడి చేత్తో అభయాన్నిస్తూ, ఎడమచేతిని మోకాలిపై ఉంచే రూపం గుర్తుకు వస్తుంది. శబరిమలైపై కొలువు తీరిన రూపం ఇదే. ఇక్కడ ఆయన బ్రహ్మచారిగా కనిపిస్తాడు. కానీ ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పూర్ణ, పుష్కలా వారి పేర్లు. శక్తి సమేతుడైన స్వామిని ధర్మశాస్త అని పిలుస్తారు. అచ్చన్ కోసం ఆలయంలో స్వామివారు ఇరువైపుల దేవేరులతో పాటు ఆసీనుడై కుడి కాలిని కిందకు చాచి ఎడమకాలిని మడిచి పీఠంపై ఉంచి నడుముకూ ఎడమమోకాలికీ కలిపి వేసిన పట్టంతో కుడిచేతిలో పుష్పాన్ని, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. పూర్ణాపుష్కలా దేవేరులు చేతిలో సౌగంధికా పుష్పాలను పట్టుకుని వరదముద్రనూ చూపుతూ వరాలిస్తుంటారు. ఇదే స్వరూపంలో తమిళనాడులోని కాంచీపురం,కడలూర్ మొదలైన కొన్ని దేవాలయాలలో మాత్రం అరుదుగా దర్శనమిస్తాడు. పూర్ణాపుష్కలాసమేత ధర్మశాస్త విగ్రహ స్వరూపాన్ని మయమత శిల్పశాస్త్రం విశేషంగా వివరించింది. ఇతడి చేతిలో చండ్రాకోలును ఉంచాలని చెప్పింది. ఈ స్వామి వాహనం, ధ్వజచిహ్నం రెండూ గజమే. చతుర్భుజుడైన స్వామికి కుక్కుటధ్వజం ఉంటుంది.శాస్త అంటే శాసించువాడని అర్థం. ఆగమ, శిల్ప శాస్త్రాలలో అనేక శాస్తా స్వరూపాలున్నా వాటిలో ఎనిమిది శాస్తారూపాలు ప్రసిద్ధమైనవి. ఆదిశాస్త, ధర్మశాస్త, జ్ఞానశాస్త, కల్యాణవరదశాస్త, గజారూఢ శాస్త, సమ్మోహన శాస్త, సంతానప్రాప్తి శాస్త, వేదశాస్త, వీరశాస్తలలో ఒక్కో దేవుడూ ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు.ధర్మశాస్తా దర్శనంతో సకలాభీష్టాలూ నెరవేరుతాయి. మహాపాతకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, పుత్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాగమం చెప్పింది. -
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు...
-
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు... పెళ్లి దాచిన ప్రసాదు
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అవివాహితుడు కారు. ఆయనకు నలభై అయిదేళ్ల క్రితమే పెళ్లైంది. అంతే కాదు. ఇన్నాళ్లూ ఆయన వివిధ ఎన్నికల అఫిడవిట్లలో వైవాహిక జీవితానికి సంబంధించిన కాలమ్ ను ఖాళీగా వదులుతూ వచ్చారు. బుధవారం వడోదరలో నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన తాను వివాహితుడని, తన భార్య పేరు యశోదా బెన్ అని చెప్పుకున్నారు. దీంతో నరేంద్ర మోడీ రహస్యమయ వ్యక్తిగత జీవితం పై మరిన్ని ఊహాగానాల తేనెతుట్టెని కదిలించినట్టయింది. తాను పెళ్లి చేసుకున్నట్టు మోడీ మొట్టమొదటిసారి అంగీకరించారు. యశోదాబెన్ తో మోడీకి వివాహమైన విషయం గుజరాత్ లో బహిరంగ రహస్యం. మోడీ స్వగ్రామం వడ్ నగర్ కి పది కి.మీ దూరంలోని ఒక ఊళ్లో యశోదాబెన్ టీచర్ గా పనిచేస్తున్నారు. స్థానిక బిజెపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇన్నేళ్ల తరువాత మోడీ తనకు పెళ్లైన విషయాన్ని ఒప్పుకున్నారు. ఆమె ఆస్తిపాస్తుల విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పుకున్నారు. కానీ మోడీ ఈ విషయాన్ని తన అఫిడవిట్లలో ఇంతవరకూ ఎందుకు వెల్లడించలేదు? 2012 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లోనూ దీని గురించి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తనకు పెళ్లైన విషయాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎన్నికల తరువాత తన వైవాహిక స్థాయి విషయంలో వివాదం తలెత్తకూడదనే ఇలా చేశారా? బిజెపి తరఫు నుంచి కూడా దీని గురించి ఎవరూ స్పష్టీకరణనివ్వడం లేదు. మోడీ తనకు పెళ్లైందా లేదా అన్న విషయాన్ని అఫిడవిట్ లో స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోడీ మొదటిసారి ఈ వెల్లడి చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఇది వివాదమై, తాను ప్రధాని కాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఇలా చేశారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మోదీ అన్నగారైన దామోదర్ దాస్ మోడీ మాత్రం మోడీకి బాల్య వివాహం జరిగిందని, అప్పట్లో తమ కుటుంబంలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన లేదని, కుటుంబంలో ఎవరూ అప్పట్లో పెద్దగా చదువుకున్న వారు లేరని ఒక ప్రకటనలో తెలియచేశారు. తరువాత కాలంలో మోడీ పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ఆరెస్సెస్ ప్రచారక్ కావాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన పూర్తిగా బ్రహ్మచర్య జీవనాన్నే పాటించారు. -
పెళ్ళయింది కానీ... ఆజన్మ బ్రహ్మచారి
మహా బలశాలి, అమిత పరాక్రమవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు అయిన హనుమంతుడు ‘బ్రహ్మచారి’. అంటే బ్రహ్మచారిగా ఉంటేనే అలా ఉండటం సాధ్యమనుకునేరు. అది ఆయన సహజ గొప్పతనం. ఇప్పటికీ హనుమంతుడిని మనం ‘బ్రహ్మచారి’గానే చూస్తున్నా ఆయన అవివాహితుడు కాదు! గురువుగారైన సూర్యదేవుల వారి ఆనతి మేరకు ఆయన పుత్రిక అయిన సువర్చలాదేవినే పరిణయమాడాడు. అయితే ఆమెను తన హృదయంలోనే నిలుపుకున్నాడు. సతిగా ప్రేమించాడు. అంతకు మించి హనుమంతుడు ఆమెతో ఎటువంటి సంసార బంధాలనూ ఏర్పరచుకోలేదు. మరి పెళ్లెందుకు చేసుకున్నట్టో..! అని కొందరు ప్రబుద్ధులు పెదవి విరవవచ్చు. అలాంటి వారికి సమాధానం ఏమిటంటే... కల్యాణం చేసుకోనిదే సర్వేశ్వరుడికైనా పరిపూర్ణత సిద్ధించదని లోకోక్తి. అదీగాక సాక్షాత్తూ సూర్యభగవానుడంతటి వాడు గురుదక్షిణ కోరిన తర్వాత తీర్చకుండా ఉంటే ఏం బాగుంటుంది? దానికితోడు బ్రహ్మాది దేవతలు కూడా ఆమె నీకు తగిన వధువు అని సిఫార్సు చేశారాయె. పెద్దలంటే ఉన్న గౌరవం కొద్దీ హనుమంతుడు అందుకు ఒప్పుకున్నాడు కానీ, ఒక షరతు విధించాడు. అదేమిటంటే... ‘‘సంసార బంధాలలో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. మీరందరూ చెబుతున్నారు కాబట్టి నేనామెను పెళ్లాడతాను. అయితే వివాహ బంధం రీత్యా ఆమె నా భార్యగా ఉంటుంది. అంతకుమించి ఆమెతో నాకు ఎటువంటి సంబంధమూ ఉండదు. అలాగని ఆమెను విడిచిపెట్టేది లేదు. నా గుండెలోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి, అందులో ఆమెను నిలుపుకుంటాను. అందుకు మీరు సరేనంటేనే మీరు చెప్పినదానికి నేను సమ్మతిస్తాను’’ అంటూ తిరకాసు పెట్టాడట. ‘నువ్వు మా మాట విన్నప్పుడు మా పెద్దరికం కూడా నిలుపుకోవాలి కదా’ అన్నట్టు దేవతలందరూ సరేనన్నారట. కాబట్టి... హనుమంతుడు సంప్రదాయాలకు వివాహితుడు, ఆలోచనల్లో మాత్రం నిత్య బ్రహ్మచారి. కొసమెరుపు: పెళ్లి విషయంలో సూర్యపుత్రిక సువర్చలా దేవి కూడా అచ్చం అలాగే ఆలోచించిందట! బహుశా పురాణాల్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో! -
హ్యాపీ కస్టమర్స్..
=మహేష్ బ్యాంకుకు చేరిన దోపిడీ బంగారం =ఆనందం వ్యక్తం చేసిన కస్టమర్లు =తాకట్టు బంగారం తీసుకెళ్లిన వైనం సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సంచలనం సృష్టించిన దోపిడీకి గురైన 14.5 కిలోల బంగారు ఆభరణాలు నెలరోజుల తర్వాత ఎట్టకేలకు మహేష్ బ్యాంకుకు చేరింది. దీంతో బ్యాంకు వినియోగదారులు (కస్టమర్లు) ఉబ్బితబ్బిబ్బయ్యారు. గతనెల 28న రాత్రి ఏఎస్‌రావునగర్‌లోని మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రయిజర్‌గా విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్లోజు బ్రహ్మచారి (50) మారుతాళం చెవులతో తాకట్టు పెట్టిన బంగారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును నాలుగురోజుల్లోనే సైబరాబాద్ పోలీసులు మిస్టరీ చేధించి బ్రహ్మచారితోపాటు అతని భార్య లలిత, కుమారుడులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను కుషాయిగూడ పోలీసు ఠాణాలో భద్రపరిచారు. న్యాయపరమైన అంశాలు పూర్తిచేసుకోవడంతో సోమవారం కోర్టు అనుమతితో పోలీసుల ఆధీనంలో ఉన్న ఆభరణాలను బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు చాలామంది బ్యాంకు వచ్చి తాకట్టు పెట్టిన నగలను విడిపించుకెళ్లారు. ఈ సందర్భంగా కస్టమర్లు పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అయితే ఈ కేసులోని నిందితులు కూడా బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. బంగారు నగలు భద్రపర్చడంలో నిర్లక్ష్యం వహించిన అటెండర్ రాములు, సీనియర్ అకౌంటెంట్ శివశంకర్లను ఇదివరకే అరెస్టు చేయగా..బ్యాంకు ఎండీ, జనరల్ మేనేజర్, మేనేజర్ పద్మజ, ఉద్యోగులు ఊర్మిల, ప్రశాంతిల నిర్లక్ష్యంపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో వీరి నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా తేలితే అరెస్టు చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.